ప్రేమ విఫలం



ప్రేమ విఫలం

ఈ కాలంలో ఎక్కువమంది వివాహానికి ముందు ప్రేమించడం, కొంతమందికి ప్రేమించిన వారితో వివాహం జరగడం మరి కొంతమందికి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఫెయిల్ అయ్యే జాతకాలు ముందుగా తెలుసుకుంటే బాధపడవలసిన అవసరం ఉండదు. ముందుగానే విషయం నుండి దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్ని గ్రహాలు కాంబినేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేమించుకున్న వారు దూరం అవుతూ ఉంటారు. ఉదాహరణకు శుక్ర భగవానుడు షష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానంలో కానీ ఉన్నప్పుడు ప్రేమికులు దూరం అవుతారు. శుక్ర భగవానుడు వక్రించినప్పుడు కూడా ప్రేమించుకున్న వారికి వివాహం జరగదు. మరొకటి పంచమరాహువు. పంచమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి. రాహువు ఆత్రుతకు కారకుడు ఒక వస్తువును వాడుకోవాలి అనే తొందర ఎక్కువ ఉంటుంది. అదే విషయం ప్రేమలో కూడా జరుగుతుంది. ప్రేమిస్తారు కానీ ఖచ్చితంగా బ్రేకప్ అయిపోతుంది ఇటువంటి వారు రెండు మూడు సార్లు కూడా ప్రేమిస్తారు ఫెయిల్ అవుతారు. చివరికి ఈ ప్రేమ అక్కరలేదు అనుకుంటారు, ప్రేమ పైన విరక్తి పొందుతారు అప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారు. అప్పుడు లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు. మరొక కాంబినేషన్ శుక్ర భగవానుడు బుధుడు ఈ కాంబినేషన్లో మొదటిసారి ప్రేమలో ఫెయిల్ అవుతారు రెండోసారి ప్రేమలో సక్సెస్ అయ్యి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాంబినేషన్ ఉన్నవాళ్లు మేనత్త కూతురు కానీ మేనమామ కూతురు కానీ మరదలు లేదా మేన మామ ఇటువంటి వారిని ఇష్టపడినప్పుడు మొదటిసారి సక్సెస్ ఇస్తుంది ఎందుకంటే బుధుడు మేనత్త మేనమామ మామయ్య వీటికి కారకుడు. శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఉన్న జాతకులు గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు తప్ప వివాహం వరకు వెళ్లరు. మరొక కాంబినేషన్లో శని భగవానుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలకు ఏదైనా సంబంధం ఉంటే వివాహ విషయంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. శుక్ర భగవానుడికి శని భగవానుడు లేదా కేతువు లేదా రాహువు ఏ విధంగా అయినా సంబంధం ఉన్నప్పుడు ప్రేమలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతర గ్రహాల కాంబినేషన్లో కొన్ని సందర్భాలలో సక్సెస్ తీసుకొస్తుంది కొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్ తీసుకొస్తుంది. శని భగవానుడు శుక్రుడు కాంబినేషన్లో ప్రేమలో చాలా ఒడిదుడుకులు తీసుకొస్తుంది. ఇద్దరూ గొడవలు పడుతూ ఉంటారు మరల కలుస్తూ ఉంటారు ఇద్దరి మధ్యన ఎంత పెద్ద గొడవలు జరిగినప్పటికీ మరల కలిసిపోతూ ఉంటారు చివరకు వివాహం చేయిస్తుంది. ఏది ఏమైనా జాతకంలో శుక్ర భగవానుడు బలంగా ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు జరుగుతాయి. పంచమాధిపతి  6 లేదా 8 లేదా 12 స్థానాలలో ఉన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా రాహువు, కేతువు, శని భగవానుడు పంచమాధిపతితో సంబంధం ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్సు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ప్రేమలో మునిగిపోయి బయటికి రాలేక మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తారు ఇటువంటి వారు పై కాంబినేషన్ ఏమైనా ఉంటే వారు ప్రేమకు దూరంగా ఉండటం చాలా మంచిది.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #premavipalam #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025