బతుకమ్మ దీవెన


బతుకమ్మ దీవెన

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస ఉయ్యాలో, 

బాలలకు వచ్చింది ఉయ్యాలో బొడ్డెమ్మ పండుగ ఉయ్యాలో, 

మహిళలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో...

అనంత చతుర్దశిన వినాయక నిమజ్జనం జరిగిన మరునాడు వచ్చే పౌర్ణమే బొడ్డెమ్మ పున్నమి. మేఘుడు జలకాలాడించడంతో ప్రకృతికాంత పరవశించి రంగురంగుల పువ్వుల్ని విరబూయిస్తుంది. చెరువులు నిండి పంటలు పచ్చగా అలరారుతూ ప్రజలు ఆనందడోలికల్లో పులకరిస్తారు. అప్పుడే ఆడపిల్లల బొడ్డెమ్మ పండుగ. ప్రాంతాన్నీ ఆనవాయితీనీ అనుసరించి పండుగ జరుపుకోవడంలో తేడా ఉంటుంది. కొందరు పౌర్ణమి మరునాటి నుంచి ఆడితే మరికొందరు పంచమి మొదలు త్రయోదశి వరకు ఆడతారు. సంతానం కోసం పూజించే అత్తిచెట్టు పర్యాయపదంగా ఉన్న ఈ బొడ్డెమ్మ పండుగ కన్నెపిల్లలు పెళ్లి, సంతానం దృష్టితో జరుపుకొంటారనేది ప్రచారం. దీని తరవాత బతుకమ్మ పండుగ మొదలవుతుంది.

బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకొంటారన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొనే కథనాలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇదమిత్థంగా ఫలానా కథనమే కరెక్టని చెప్పలేక పోయినా అన్నీ స్మరణలో భాగంగానే ఉంటాయి. యాదృచ్ఛికం అవునో కాదో చెప్పలేం కానీ బతుకమ్మ పండుగ మొదటి రోజైన మహాలయ అమావాస్య కూడా చనిపోయిన పెద్దల స్మరణలో జరుపుకొనేదే. కారణాలేమైనా పేరులోనే దీవెన గల పూల పండుగ బతుకమ్మ. ఇది చెట్టూ చేనూ, చెరువూ చెలకా, పంటా వంటలతో పాటు కుటుంబ, అనుబంధాల పండుగ. పనీపాటలకే పరిమితమైన స్త్రీల జీవితాలకు అచ్చట్లు ముచ్చట్లు చప్పట్లతో ఆట విడుపైన పండుగ. ఊరంతటినీ ఒక దగ్గరికి చేర్చే, సామాజిక సంబంధాలను కొనసాగించే పండుగ. మానవ ప్రయత్నం లేకుండా సహజ సిధ్ధంగా పూసే తంగేడు, గునుగు, కట్ల, గోరింట, రుద్రాక్ష పూలన్నీ ఔషధగుణాలు కలిగి తేలికైనవై నీళ్లలో అల్లనల్లన తేలియాడేవే. ఇవి సహజ సౌందర్యానికి ప్రతీక. అందుకే అవి బతుకమ్మ పండుగలో భాగమయ్యాయి. 

పేర్పులో సృజన, పాటలో సందేశం, ఆటలో నృత్యం... ఆ దృశ్యం చూడముచ్చటై మొత్తంగా ఓ లలిత కళల కూర్పుగా దర్శనమిస్తుంది బతుకమ్మ. ఈ పండుగ పెళ్లయిన ఆడపిల్లలకు పుట్టింటికి స్వాగతం పలుకుతుంది. కొత్తగా ఆ కాలంలో పండి చేతికొచ్చిన ధాన్యాలతో (పెసలు, మొక్కజొన్నలు, నువ్వులు, పల్లీలు) చేసే ప్రసాదాలను తినడం శ్రేయస్కరమనే సందేశంతో పాటు సామాజిక సంబంధాలను, పంచుకోవడంలోని ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. బతుకమ్మ అంటే పూలపండుగ... పాటల పండుగ... ప్రకృతితో మమేకమై బతికే రైతుబిడ్డల పండుగ. ఆ తొమ్మిది రోజులూ మహిళలు పాడే పాటలన్నీ తెలుగు జానపద వైభవాన్ని చాటుతాయి. ప్రపంచంలో ఎన్నో పూల పండుగలున్నా పూలనే పూజిస్తూ తెలంగాణలో జరుపుకొనే బతుకమ్మ పండుగ వంటిది మరొకటి లేదనేది నమ్మి తీరాల్సిన సత్యం.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #bathukammadivena #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025