ఆరోవ రోజు బతుకమ్మ..


 

ఆరోవ రోజు బతుకమ్మ...!!

ఈ రోజు

బతుకమ్మ పండుగలో

అలిగిన బతుకమ్మ

ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ...

ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ 

వేడుకలు ముగిశాయి.

ఇక ఈరోజు బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. 

ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు.

అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. 

ఆమెకు ఈ రోజు 

ఏ నైవేద్యం ఉండదు. 

పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. 

అప్పటి నుంచి ఈ రోజును 'అలిగిన బతుకమ్మ' గా పిలుస్తారు.

 బతుకమ్మ పాట  మీ కోసం..

రామ రామ రామ ఉయ్యాలో 

రామనే శ్రీరామ ఉయ్యాలో..

రామ రామ నంది ఉయ్యాలో 

రాగమేత్తరాదు ఉయ్యాలో..

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో 

నేలవన్నేకాడ ఉయ్యాలో..

పాపిటలో చంద్రుడా ఉయ్యాలో 

బలాకుమరుడా ఉయ్యాలో..


పెద్దలకు వచ్చింది ఉయ్యాలో 

పెత్తరామాసము ఉయ్యాలో..

బాలలకు వచ్చింది ఉయ్యాలో 

బతుకమ్మ పండుగ ఉయ్యాలో..

తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో 

తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..

పన్నెండేండ్ల కింద ఉయ్యాలో 

పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో..


తెల్లయి వేములవాడ ఉయ్యాలో 

రాజన్న గుళ్లు ఉయ్యాలో..

నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో 

నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో..

నల్లయి నల్గొండ ఉయ్యాలో 

నరసింహ గుళ్లు ఉయ్యాలో..

పచ్చ పచ్చయి గుల్లు ఉయ్యాలో 

పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో..


పచ్చయి పరకాన ఉయ్యాలో 

మల్లన్న గుల్లు ఉయ్యాలో..

పర్వతాల మల్లన ఉయ్యాలో 

పదములు సెలవయ్య ఉయ్యాలో..

రామ రామ రామ ఉయ్యాలో 

రామనే శ్రీరామ ఉయ్యాలో…

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #bathukammapata #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025