జాతకంలో ప్రమాదకర స్థానాలు
జాతకంలో ప్రమాదకర స్థానాలు
కాలపురుష చక్రంలోని కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో కొన్ని గ్రహాలు స్థితి పొంది ఉన్నప్పుడు అది ప్రమాదకరమైన స్థానంగా పరిగణింపబడుతుంది. ఈ స్థానాలలోని గ్రహాల దశ వచ్చినప్పుడు ఆ దశా కాలమంతా చాలా ఇబ్బందులను జాతకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ గ్రహం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
ఉదాహరణకు రవి భగవానుడు మేషం లో స్థితి పొందినప్పుడు ప్రమాదకరమైన స్థితి అని చెప్పాలి ఇది రెండు విధాలుగా బాధిస్తుంది. లగ్నంలో రవి ఉన్న కారణంగా లగ్నము బలహీనమైపోతుంది.రవి భగవానునికి స్వక్షేత్రమైన పంచమ స్థానం కూడా రిస్క్ లో పడుతుంది. సాధారణంగా రవి మేషం లో ఉచ్చ స్థితిని పొంది ఉన్నాడు అని భావిస్తాము కానీ ఇది ప్రమాదకరమైన స్థితి. సింహలగ్నంలో పుట్టిన జాతకులకు రవి మేషం లో ఉన్నప్పుడు లగ్నాధిపతి భాగ్య స్థానంలో ఉచ్చ పొందినాడు అనుకుంటాము. కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలను రవి భగవానుడు ఇస్తారు. ఇదేవిధంగా కర్కాటకంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. కాలపురుష చక్రం ప్రకారం నాలుగో స్థానం బలహీనమైపోతుంది మరియు ఏదైనా లగ్నంలో జన్మించిన వారికి లగ్నం నుండి కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆస్థానం కూడా రిస్క్ లో పడుతుంది. ఉదాహరణకు మిధున లగ్న జాతకులకు ద్వితీయంలో చంద్రుడు ఉన్నప్పుడు అత్యధిక ధనం సంపాదిస్తారు అనుకుంటాము కానీ ధన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరొక గ్రహం కుజుడు ఈ కుజుడు మిధున మరియు కన్యలో ప్రమాదకరమైన స్థితి అని చెప్పాలి. ఏ లగ్న జాతకులకు అయినప్పటికీ లగ్నాత్తు ఈ ప్రమాదకరమైన స్థానాలలో ఆయాగ్రహాలు ఉన్నప్పుడు మరియు కాలపురుష చక్రంలోని స్థానాల ప్రకారం ఆ గ్రహాలు ఉన్నప్పుడు రెండు విధాలుగా జాతకుడిని బాధిస్తుంది. ఆయాగ్రహ దశ కాలంలో జాతకుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. బుధ గ్రహము మకరంలో రిస్క్ ప్లేస్ అని చెప్పవచ్చు కాలపురుష చక్రం ప్రకారం మేషలగ్న జాతకులకు దశమ స్థానంలో బుధుడు శుభ యోగాలను ఇస్తాడు అనుకుంటాము మేష లగ్న జాతకులకు దశమంలో బుధుడు స్థితి పొందినప్పుడు ఆ దశాకాలంలో ఉద్యోగాల లేదా వ్యాపార పరంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులను చవిచూస్తాడు. గురు భగవానుడు వృషభంలోనూ కుంభం లోనూ ఏదైనా స్థానంలో స్థితి పొందినప్పుడు ఆ దశాకాలంలో ఆస్థానాలు పూర్తిగా దెబ్బతింటాయి. శుక్ర భగవానుడు తులాలగ్నంలో స్థితి పొందినప్పుడు మేష లగ్న జాతకులకైతే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మరియు వారి లగ్నానికి శుక్రుడు ఎన్నో స్థానంలో స్థితి పొందుతున్నాడు ఆ స్థానం కూడా బలహీనమైపోతుంది. శని భగవానుడు వృశ్చికంలోనూ మీనంలోనూ పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. వృశ్చికంలో ఉన్నప్పుడు మేష లగ్న జాతకులకు అయితే అత్యంత ప్రమాదాలు కు గురి అవుతారు ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. శని భగవానుడు మీనంలో స్థితి పొందినప్పుడు కాలపురుష చక్రం ప్రకారం మరియు లగ్నం ప్రకారం కూడా రెండు స్థానాలు దెబ్బతింటాయి. కుంభ లగ్న జాతకులకు మీనంలోశని భగవానుడు ఉన్నప్పుడు లగ్నాధిపతి ధన స్థానంలో ఉన్నట్టుగా భావించి అత్యధిక ధనాన్ని సంపాదిస్తారు అని భావించరాదు. శని భగవానుని దశాకాలంలో ధనపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని గ్రహాలకు రెండు స్థానాల ఆధిపత్యం ఉంటుంది. ఇటువంటి గ్రహాలు పై చెప్పిన స్థానాలలో ఉన్నప్పుడు ఆ స్థానంతో పాటు మిగిలిన రెండు స్థానాలు కూడా బలహీనం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా జాతక పరిశీలన చేసే సమయంలో రవి భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నారని ,చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలో ఉన్నారని, శుక్రుడు తులలో స్వక్షేత్రంలో ఉన్నారని ఫలితాలు చెప్పే విషయం పై అంశాలను కూడా తీసుకొని జాగ్రత్తగా తెలియజేయవలసి ఉంటుంది. ఇటువంటి సూక్ష్మ విషయాలు జ్యోతిష్యులు జాగ్రత్తగా పరిశీలించి జాతకులకు సరియైన పరిహారాలు సూచించడం వలన జాతకుడు సమస్యల నుండి బయటపడి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#jathakavishleshana #jathakamlopramadalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి