శరన్నవరాత్రులు ప్రారంభం


 

శరన్నవరాత్రులు ప్రారంభం

మనకి 27నక్షత్రములు ఉన్నాయి. మొదటి అశ్వని నక్షత్రమునకు అధిదేవతలు అశ్వనీ దేవతలు. చంద్రుడు

అశ్వనీ నక్షత్రముతో కూడి ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి కలిగిన మాసము కనక ఆశ్వీయుజ మాసము మొదటి

మాసము కావాలి. చాంద్రమాన ప్రకారము చైత్రమాసము మొదటి మాసము. 27 నక్షత్రములలో మొదటి 13, వెనక 13 నక్షత్రములను విడచి పెట్టి మధ్యలోఉన్న 14 వ నక్షత్రమైన చిత్తా నక్షత్రముతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉన్న మాసము కనక చైత్ర మాసము మొదటి మాసము అవుతుంది. ఉపాసనకు సంబంధించి ఆశ్వీయుజ మాసము మొదటి మాసము అవుతుంది. భగవంతుని చేరుకోవడానికి ప్రారంభము అక్కడ ఉంటుంది. ఆ మాసమునకు అంత గొప్పదనము ఇచ్చి శారదా నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు అనగా దానికి ఒక్కటే ప్రధానమైన కారణము. ఈ మాసములో మొదటగా ప్రారంభము అయ్యే మొదటి తొమ్మిది రాత్రులు ఒక రోజుకి ప్రారంభములో ఉండేటటువంటి తెల్లవారుఝాము సమయమువంటివి. సూర్యోదయమునకు 48 ని|| కి ముందు ఉండే కాలము బ్రాహ్మీ ముహూర్త కాలము అంటారు. ఉపాసనకి పరమయోగ్యమైన కాలముగా నిర్ణయింపబడింది. ఉపాసన క్రమములో ఉండే సం|| అంతటినీ ఒక రోజుగా భావన చేస్తే తెల్లవారుఝాము కాలము ఆశ్వీయుజ మాసము వచ్చే పాడ్యమి లగాయితు నవమి వరకు ఉండే కాలము. ఆ తొమ్మిది రాత్రులు ఏవి ఉన్నాయో అది తెల్లవారుఝాము కాలముగా పరిగణిస్తారు. ఒక సం || అంతటికి శారదా నవరాత్రులే తెల్లవారు ఝాము కాలము. రోజు మొత్తమునకు ఉపాసనకు అత్యంత యోగ్యమైన కాలము తెల్లవారు ఝామున సూర్యోదయమునకు 48 ని|| కి ముందు ఉండే కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కనక దానికి ఉపాసనకు యోగ్యము అంటారు. మిగిలిన కాలము ఇంద్రియములతో కలసి పైకి తిరిగే మనసు వశము అవడము అంత తేలిక అయినది కాదు. మనసు తెల్లవారుఝాము కాలములో మనసు వెనకకి వెళ్ళి దాని మూలమైన ఆత్మ ఏది ఉన్నదో దాని యందు ఒదిగిపోతుంది. ఒకరోజుకి తెల్లవారుఝాము కాలము ఎంత గొప్పదో అంత గొప్పది ఒక సం || అంతటినీ రోజుగా భావన చేస్తే శరదృతువులో ఆశ్వయుజ మాసములో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు. తొమ్మిది రోజుల క్రమమును విడచి పెట్టకూడదు.

అందరూ చేస్తారు వ్యక్తిగతముగానూ చేస్తారు. దేవాలయములలో చేస్తారు. వీధి వీధిన దుర్గా అమ్మవారిని నిలబెట్టి వాయు ప్రతిష్ఠచేసి

తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవములు చేసి పదవ రోజు విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణముగా

శాంతికర కల్యాణముతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకుని వెళ్ళి నిమజ్జనము చేస్తుంటారు.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sharanavaratrulu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025