స్వామివారి దివ్యదృష్టి

  


స్వామివారి దివ్యదృష్టి

పరమాచార్య స్వామివారు ఒకసారి చిన్న కాంచీపురంలో మకాం చేస్తున్నారు.

మహాస్వామివారి దర్శనానికి చెన్నై నుండి ఒక కుటుంబం వచ్చింది. ఇంట్లో జరగబోయే వివాహానికి కొన్న బంగారాన్ని కారులోనే ఉంచి మహాస్వామివారి దర్శనానికి అందరూ లోపలికి వెళ్ళారు.

వారిని చూసిన వేంటనే స్వామివారు “నన్ను బాగా దర్శించుకున్నారు. బయలుదేరండి, వెంటనే వెళ్ళండి” అని ఆజ్ఞాపించారు.

వారికేమి అర్థం కాక ఆయోమయంతో వారి కారు వద్దకు వెళ్లారు. కాస్త పరికించి చూడగా కార్లో వారు వదిలి వెళ్ళిన ఆభరణాలను ఎవరో దొంగిలించారని వారికి అర్థం అయ్యింది.

వారు వెంటనే మహాస్వామి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారు. “ఆ ఆభరణాలను దొంగిలించిన దొంగ ఇక్కడే దగ్గర్లోని బస్టాండులో ఉంటాడు. వెళ్ళి వెతికి పట్టుకొని మీ వస్తువులను తెచ్చుకోండి” అని స్వామివారు ఆదేశించారు.

అలాగే వారు బస్టాండుకు వెళ్ళి ఆ దొంగను పట్టుకుని ఆభరణాలను తీసుకున్నారు.

మహాస్వామి వద్దకు వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీస్సులు అందుకుని వెళ్ళిపోయారు.

అలాగే ఒకసారి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి చెన్నై నుండి చిన్న కాంచీపురం మఠానికి వచ్చాడు. అతణ్ణి చూడగానే స్వామివారు వెంటనే చెన్నైకి వెళ్ళవలసిందని ఆదేశించారు. 

తరువాత మాకు తెలిసిందేంటంటే అతను చెన్నైకి చేరువగా ఉన్నప్పుడు హృదయాఘాతం వల్ల మరణించాడు అని.

పరమాచార్య స్వామివారి దివ్యదృష్టి సామాన్యమైనది కాదు.

సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

      HAVANIJAAA

      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),

      MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025