వివాహస్థానము-వక్ర గ్రహాలు
వివాహస్థానము-వక్ర గ్రహాలు
మానవ జీవితంలో వివాహము అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. వివాహ స్థానాన్ని జ్యోతిష్య శాస్త్రంలో కళత్ర స్థానము లేదా సప్తమ స్థానము అంటారు. ఈ స్థానము జీవిత భాగస్వామిని, సమాజంతో ఉండే సంబంధాలను, భాగస్వామ్య వ్యాపారాన్ని సూచిస్తుంది. అంతే కాకుండా ఈ స్థానము మారకాన్ని అనగా మరణాన్ని కూడా సూచిస్తుంది.
ఈ సప్తమ స్థానంలో వక్రించిన గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది తెలుసుకుందాం. రాహు కేతువులు ఎల్లప్పుడు వక్ర గ్రహాలు. రవిచంద్రులు ఎప్పుడూ వక్రీంచవు. బుధుడు శుక్రుడు వక్రించినప్పటికీ మరల యదాస్థితిని పొందగలరు. గురువు శని భగవానుడు కుజుడు ఈ గ్రహాలు రవి నుండి 5,6,7,8,9 స్థానాలలో ఉన్నప్పుడు వక్రగతిని పొందుతారు. సప్తమ స్థానంలో వక్ర గ్రహం ఉన్నప్పుడు గానీ సప్తమాధిపతి వక్రించినప్పుడు కానీ మీ జీవిత భాగస్వామి నుండి మీరు ఊహించిన ఫలితాలు కచ్చితంగా రావు. ఒక జాతకంలో రాహు కేతు దోషం ఉన్నప్పుడు వారి జీవితంలో 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్యలో రాహుకేతుదశ రానప్పుడు వారికి రాహు కేతు దోషం వర్తించదు. సప్తమ స్థానంలో ఒక గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక గ్రహం దశ జరుగుతున్నప్పుడు ఆ గ్రహం నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తాయి. జాతకంలో సప్తమ స్థానంలో వక్ర గ్రహం ఉన్నప్పుడు ఆ జాతకులు పార్ట్నర్షిప్ వ్యాపారంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేదా పార్టనర్ షిప్ వ్యాపారం చేయకపోవడం మంచిది. అంతేకాకుండా జీవిత భాగస్వామిపై మీరు పెట్టుకున్న విపరీతమైన ఆశలు అంచనాలు నిరాశను విచారాన్ని కలిగిస్తాయి. వివాహ పొంతన సరిగా చూడకుండా వివాహం కుదిరిస్తే జీవిత భాగస్వామి నుండి అనేక ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి. సప్తమ స్థానము సమాజాన్ని కూడా సూచిస్తుంది కావున సప్తమ స్థానంలో వక్ర గ్రహాలు ఉన్నప్పుడు ఎంత కష్టపడినప్పటికీ సమాజం నుండి సరైన గుర్తింపు రాదు. మరియు వ్యాపార భాగస్వాముల నుండి అనేక సమస్యలు ఎదురవుతాయి. సప్తమ స్థానంలో గ్రహం బలంగా ఉంటే ఈ సమాజం మిమ్మల్ని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉంటుంది. భార్య మరియు భాగస్వామ్య వ్యాపారులతో మంచి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సప్తమ స్థానము మరణాన్ని కూడా సూచిస్తుంది. వయసు పెరిగే కొద్దీ మరణం కూడా సహజమే. సప్తమ స్థానంలో వక్ర గ్రహాలు ఉన్నప్పుడు మరణం అతి బాధాకరంగా ఉంటుంది. యాక్సిడెంట్లలో మరణం కానీ, సామూహిక మరణం కానీ, క్రిమి కీటకాలు వ్యాధుల వలన కానీ మరణం సంభవిస్తుంది. సప్తమ స్థానంలో వక్ర గ్రహం ఉన్నప్పుడు విభిన్నమైన అలవాట్లు, ఆలోచనలు ఉన్న జీవిత భాగస్వామి మీకు లభించే విధంగా ఈ గ్రహం పని చేస్తుంది. సప్తమ స్థానంలో వక్ర గ్రహం ఉన్నప్పుడు మీ ఆలోచనలు విధానాలు ముందుగా మీ జీవిత భాగస్వామికి తెలియజేయాలి లేకపోతే మీ విధానాలకు వారు వ్యతిరేకంగా ప్రవర్తించి కొత్త కొత్త సమస్యలకు నాంది పలుకుతారు. ముందుగానే మీ అలవాట్లు అభిరుచులు తెలియజేయడం వలన ఎదుటివారు అర్థం చేసుకునే అవకాశం ఉంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),
MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి