కార్తీక మాసంలో ఈ 4 విషయాలు పాటిస్తేనే మీ పూజకు ఓ అర్థం
కార్తీక మాసంలో ఈ 4 విషయాలు పాటిస్తేనే మీ పూజకు ఓ అర్థం
ప్రతియేటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య (Amavasya 2025) రోజు దీపావళి (Diwali 2025) జరుపుకుంటారు. ఆ తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం (Karthika Masam 2025) ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం అంతా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. భక్తులు చాలా నియమ నిష్టలతో ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు, అభిషేకాలు, బిల్వదళ పూజలు, రుద్రపూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటివన్నీ ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పాటించాల్సిన 4 ప్రధానమైన నియమాల గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసంలో తప్పక పాటించాల్సినవి
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో 1. నదీ స్నానం - శివారాధన 2. దీపారాధన- దీపదానం 3. ఉపవాసం 4. దానం చేయడం. విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో.. వాళ్లు చేసిన పాపాలన్నీ తొలగిపోయి.. పుణ్యం, జ్ఞానం సిద్ధిస్తుంది. మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం.

పవిత్ర స్నానం - శివారాధన
ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్లు ఎవరైనా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది. ఇలా చేయడం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుందట. అంతే కాకుండా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం. మరొక విషయం ఏమిటంటే.. పుణ్య నదీ స్నానం ఆచరించి శివారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది.
దీపారాధన- దీపదానం
దీపం జ్యోతి పరబ్రహ్మం
దీప జ్యోతి జనార్దన
దీపో మేహరతు పాపం
సంధ్యా దీపం నమోస్తుతే!
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపంలో లక్ష్మీ దేవి ఉంటుందని విశ్వాసం. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. మరో ముఖ్య విషయమేమిటంటే.. అంధకారం దారిద్ర్యానికి చిహ్నం.. కాంతి లక్ష్మీప్రదం. అంతే కాదు కాంతి జ్ఞానానికి, పురోభివృద్ధికి చిహ్నం అని మన పెద్దలు చెబుతుంటారు. కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మంచిది. రోజూ దీపారాధన చేయడం కుదరని వాళ్లు ఈ కార్తీక మాసంలో ఆచరించినా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం, తులసి కోట్ట వద్ద, రావిచెట్టు వద్ద, నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పురాణోక్తి.

ఉపవాసం
కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక, ఆరోగ్యపరంగా మంచిది. ఉపవాసం ఉండటం వల్ల మనస్సు నిర్మలంగా ఉండి దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుందని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఆచరించడం విశిష్టం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు.. మనసులోని కోరికలను పక్కనబెట్టి, భగవంతుడిపై ధ్యాస లగ్నం చేయడం. ఉపవాసం ఆచరించిన వేళ భగవతారాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితుల మాట. అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై, జ్ఞాన ప్రదమవుతుంది. చివరిగా మోక్ష ప్రదమవుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం.
దానం చేయడం
మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాల్లో స్నానం, జపం, దానం, తర్పణం అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి అత్యంత పుణ్య మాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం, దానం, జపం, తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తిమేర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#karthikamasam #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి