బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదము


 

బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదము

ఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను.

 శ్రీ కృష్ణుడు మిక్కిలిసంతోషముతో చెప్పసాగెను . 

ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ' ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను. 

ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధ కామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల తీర్థములలో స్నాన ఫలమును ఒసంగును. సంసారమున యున్న మానవులు ఏ కారణము వలన నైనను మోహవశులై ఎట్టి దుష్కర్మములు చేసివారైనను నరకయాతన అనుభవించు చున్ననూ ఈ వ్రతాచరణవలన ఆ కష్టముల నుండి విముక్తి పొందుదురు. ఎవరు భగవంతుని

నిందించుచు భగవద్భక్తులను అవమానించుదురో వారికి తప్పక నరకము ప్రాప్తించును. అట్టివారు ఎన్ని వ్రతములు ఆచరించినను సత్ఫలితమును పొందజాలరు. 

మనుష్య జన్మమును పొంది ఈ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాటించని వారు ఎందులకూ పనికిరానివారై  జీవితము వ్యర్ధమగును. 

అట్టి వారు యజ్ఞయాగములు చేసినను నిష్ఫలమేయగును. కనుక ఈఏకాదశిని మించిన వ్రతము లేదని శాస్త్రములు మఱల మఱల ఘోషించుచున్నవి.

ఈ తిథియందు ఉపవాసముండి, కృష్ణసేవ, కృష్ణనామము చేయుట, కృష్ణకథాశ్రవణము చేయుట, అత్యావశ్యకములు. రాత్రియందు జాగరణ చేయవలెను. ఈ వ్రతమును ఆచరించిన వారి వంశములలో మూలమున పితృ మాతృ పదితరములవారు ఉద్ధరింపబడుదురు. 

బాలకులు, యువకులు,వృద్ధులు ఎవ్వరైనను యీ వ్రతమును పాటించవచ్చు. దురాచార సంపన్నులైన మానవులు యీ ఏకాదశీ ఉపవాసము చేసి ఊర్ధ్వలోకములు పొందుటకు అవకాశము గలదు.

తిల- సువర్ణ - భూ- జల - ఛత్ర(గొడుగు) మఱియు పాదుకలు దానము చేసినచో వారికి యమలోక నరకబాధలు కలగవు. సత్కర్మములు చేయనివాని జీవితం నిష్ఫలము. 

అంతేకాక ఓధర్మరాజా ! ఈ వ్రతమాచరించిన వారు దీర్ఘాయుస్సు కలిగి యుండి ధనధాన్యములతో సుఖముగా నుందురు. 

మఱియు సర్వ దోషముల నుండి విముక్తి పొంది భగవద్ ల్లోకమునకు వెళ్లుదురు.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025