ఆదుకునే అపరాజిత


 
ఆదుకునే అపరాజిత

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు శరన్నవరాత్రులు గడచిన మరునాడు జరిగే పర్వదినమే విజయదశమి. భారతీయ సనాతన ధర్మానికి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికసనానికి దసరా గొప్ప ఆసరా. రాక్షస సంహారం చేసి జగతిని కాపాడిన జగన్మాత మాహాత్మ్యానికి సంకేతం ఈ విజయదశమి.

దసరానాడు దుర్గ, సరస్వతి, లక్ష్మి అవతారాల్లో కనిపించే ఆదిపరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. శక్తిని, సిరిసంపదలను ప్రసాదించేది లక్ష్మియే. దశేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకునే సత్సంకల్పంతో ఈ పండుగ జరుపుకొంటారు. దసరా రోజునే రావణవధ జరిగిందంటారు. అందుకే విజయదశమి నాడు దశకంఠుణ్ని దహనం చేస్తారు. రుతువుల సంధికాలంలో వ్యాపించే వ్యాధులను దూరంచేసి, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రకృతిశక్తిని ప్రార్థిస్తారు.

ప్రాచీనకాలంలో అగ్నిపూజ చేస్తూ... అశ్వాలు, గజాలు మొదలైన వాటినీ పూజించేవారని కాళిదాసు రఘువంశంలో ఉట్టంకించాడు. శ్రౌతాగ్నికోసం జమ్మిని, రావిని సేకరించేవారట. అజ్ఞాతవాసం అనంతరం శమీ(జమ్మి) వృక్షం మీద దాచిన ఆయుధాలను అర్జునుడు విజయదశమి నాడే తీసుకుని, ఉత్తర గోగ్రహణంలో గెలిచాడని ప్రతీతి. ఈ రోజున కర్షకులు, కార్మికులు, చేతివృత్తులవారు, ఉద్యోగులు తమ పనిముట్లను, వాహనాలను పూజిస్తారు. మనిషిలోని రాక్షస గుణాలను నిర్మూలించేందుకు సంకేతంగా ఆయుధపూజ చేస్తారు. ‘శమీ శమయితే పాపం, శమీ శత్రు వినాశనం’... అన్న శ్లోకం చదివి శమీవృక్షాన్ని అర్చించి, దాని ఆకును ‘బంగారం’ అంటూ పిలుస్తూ పలువురికి పంచిపెడతారు. పెద్దలకిచ్చి నమస్కరిస్తారు. ఇవాళ పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పర్వదినం నాడే చాలామంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. పూర్వం చక్రవర్తులు దసరా రోజే తమ విజయ యాత్రను ప్రారంభించేవారు.

దశ అంటే పది. హరా అంటే హరించేది. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకుని, సద్వినియోగపరచి, జీవితాన్ని సార్థకం చేసుకొమ్మన్న సందేశం ‘దశహరా’ పర్వదినం ద్వారా ఆ జగన్మాత లోకానికి అందిస్తోంది. ఈ పండుగ వేళ అమ్మవారిని ‘అపరాజిత’ పేరుతో అర్చిస్తారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే ఆ తల్లిని ఎవరూ ఓడించలేరని నమ్మకం. మహిషుడు మొదలైన అసురులనెందరినో మట్టుబెట్టి మునులను, నరులను కాపాడింది ఆ మహామాత. మహారాష్ట్ర, పశ్చిమ్‌ బెంగాల్, గుజరాత్, కర్ణాటక(మైసూర్‌) తదితర రాష్ట్రాల్లో  దసరా పండుగ సంబరాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు.

దసరా సరదాల కోసమే కాదు- శక్తిసాధన, ఆధ్యాత్మిక బోధన కోసం కూడా. ముగురమ్మల మూలపుటమ్మను కొలిచి, ముక్తిమార్గం తెలుసుకునేందుకు అవకాశం కలిగించే అపురూపమైన పండుగ. అలయ్‌-బలయ్‌ పేరుతో ఆప్తులు, బంధుమిత్రులు, వివిధ వర్ణాల, వర్గాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించే మహాపర్వదినం.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025