దేవుడి లీల


 దేవుడి లీల

ఒక అరణ్యంలో ఒక గురువు వద్ద కొందరు శిష్యులు  విద్య అభ్యసిస్తున్నారు.

వారిలో   సోమశర్మ అనెే శిష్యుడు  సకల విద్యలు  వేదవేదంతాలు   గురువు వద్ద నేర్చుకోగలిగాడు.    

అలా సోమశర్మలో  తన మిత్రులకన్నా   తాను తెలివైనా వాడిననే  ఆహం అతనిలో పెరుగుతూ వచ్చింది.   గురువు ఏమి చెప్పిన వెంటనే చెయ్యగలిగేవాడు. అలా అతనిలో గర్వం నెత్తికెక్కి   గురువుకన్నా తెలివైనా వాడిగా బావించేవాడు.  తనకున్నా  విద్య శక్తులతో    ఏమైనా చెయ్యగలననే  మూర్ఖం పెరిగి చివరకు ఏదైనా సమస్య వచ్చిన 

ఆ దేవుడు  కూడా ఏమి  చెయ్యడని తనకున్న అపరశక్తులే తనను రక్షిస్తాయని నమ్మే సోముడు తన మిత్రులను సైతం  తన తెలివితేటలతో అవమానిస్తూ  ఏదైనా చెయ్యగలననే పొగరు మరింత పెరిగింది.

ఒకరోజు గురువు తన శిష్యులను పిలిచి తాను చెయ్యబోయే  యజ్ణయాగానికి సంబందించిన పూజకు  కావలసిన  దివ్యపుష్పాం గురించి

 తన శిష్యులతో  చెపుతాడు.  మన ప్రాంతానికి  ఈశాన్య దిక్కున  ఎత్తైన పర్వతాలు ఉన్నాయని  ఆ పర్వతాలు దాటితే అక్కడ  కొంత దూరంలో  ఒక  దివ్యపుష్పములు గల వృక్షం కలదని  ఆ పుష్పాన్ని  తెచ్చి ఇవ్వగలవారెవరని అడగగా అప్పుడు సోముడు నేను తెచ్చి ఇవ్వగలనని చెపుతాడు.  అప్పుడు గురువు సంతోషించి నాయన సరిగ్గా విను ఆ కొండలు చాల ఎత్తైనవని చాలా ప్రమదమని  అవి దాటుకుని వెళ్ళటం అంత సులభం కాదని అక్కడికి వెళ్ళినవారెవరు తిరిగి రాలేదని చెప్పగా దానికి సోముడు తనకున్న శక్తి గురువు గ్రహించలేదని మనసులో అనుకుని   నేను ఎలాగైనా తీసుకురాగలనని చెపుతాడు. అప్పుడు ఆ గురువు సోముడితో ఆదేవుని తలచుకుని  ముందుకు సాగమని  చెపుతాడు.   దానికి సోమశర్ముడు  దేవుడెక్కడున్నాడని  అంతా మన శక్తి యుక్తిలలోనే ఉన్నదని కంటికి కనిపించని  ఆదేవున్ని తలచుకోనాని  గురువు మాట పెడచెవిన పెట్టి బయలుదేరాడు.    అలా చాలా దూరం ప్రయాణించాక  కొంత దూరంలో ఆ ఎత్తైన పర్వతాలు కనిపిస్తాయి.

సోముడు ఎలాగోలా అడవులు వాగులు దాటుకుని ఆపర్వతాలను సమీపిస్తాడు.   అతడు తాను తెచ్చుకున్న తాడుతో ఆ కొండను ఎక్కుతుంటాడు.  అప్పటికే చాలా చీకటిపడి  ఏమి కనిపించని పరిస్థితులలో కూడా  అలా కొండ ఎక్కుతు తన మనసులో  ఈకొండను అవలీలగా ఎక్కగలుగుతున్నానని తను నేర్చుకున్న విద్యలే తనకు ఈ కొండను అధిరోహించే శక్తి కలిగిందని అంతేకాని  ఆదేవుడేమి చేసాడని గురువు ఎందుకు ఆదేవుని తలచుకోమన్నాడు అనుకుంటు గరువు అమాయకత్వాన్ని మనసులోనే నవ్వుకుంటాడు.  అనుకోకుండా ఒక్కసారిగా తను పట్టుకున్న తాడు తెగిపోవటంతో  దేవుడా రక్షించు అన్ని గట్టిగా ఆ కారుచీకటిలో అరవగా ఆ భగవంతుడు వెంటనే  నీ కాలుకు చిక్కుపడిన ఆబంధన్ని    విడువు నేను  పట్టుకుని రక్షిస్తాను నన్ను నమ్ము అంటాడు.  సోమశర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడి తను క్రింద పడలేదని తాను పట్టుకున్న తాడే తనాకాలుకి చిక్కు పడి తనని రక్షించిందని  తెల్లవారితే  ఏదోరకంగా బయటపడవచ్చని  ఒక వేళ  దేవుడు రక్షించాలను కుంటే తాడు వదిలేయమని ఎందుకంటాడని  నిజంగా ఈ తాడు వదిలివేసి ఉంటే ఈపాటికి క్రిందపడి  మరణించేవాడినని ఎంత కష్టమైనా తాడువదలకుండా ఉండాలని   ఆ కారుచీకటిలో చలిగాలులలో ఉండటంతో తెల్లవారేసరికి  మరణించాడు.  విచిత్రమేమిటంటే అతడు భూమికి ఒక్క అడుగు దూరంలో అలా తాడుకు వ్రేలాడుతు మరణించాడు. ఆ తాడు వదిలి  ఉంటే బ్రతికేవాడు.   అదే ఆ దేవుని లీల....

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

        1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

పూర్వ జన్మ కర్మ ఫలితాలు - వాటి అవయోగాల ఫలితాలు....