దేవుడు అంతటావున్నాడు
దేవుడు అంతటావున్నాడు
”భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?”
ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు.
విగ్రహారాధానని వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో… ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసుకుంటున్నారు’ అన్నాడు.
స్వామీజీ నవ్వుతూ స్పందించారు.
రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు.
అయోమయం లో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు.
అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.
నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ, స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు.
స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు.
రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.
చివరికి సహాయకుడు ‘నేను ఈ పటం పై ఎలా ఉమ్మగలను? పటం లో వున్న చిత్రం లో మా రాజు వున్నారు అంటూ అరిచాడు.
అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటం లో వున్నది ఒక కాగితం మాత్రమే అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు
ఆ పటం పై ఉమ్మి వేయనంటున్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటం లో
నీ రాజు ని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటున్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.
స్వామీజీ ని చూసిన రాజు సామీజీ ముందర సాష్టాంగపడ్డాడు, స్వామి చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.
ఇదే విగ్రహారాధన యొక్క సారము.
భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. కానీ మనం ఆయనని పూజించాలను కుంటాము, కోరికలను కోరాలను కుంటాము, నివేదన చేద్దామను కుంటాము, కధలు చెప్పాలని అను కుంటాము, స్నానం చేయించాలని అనుకుంటాము, ఆడుకోవాలను కుంటాము.
మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము.
విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ, ప్రసాదించే వానిగానూ, సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.
విగ్రహము మనం చూడగలిగే యదార్ధ ప్రతినిధి.
నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు, నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు ప్రేమతో నన్ను నవ్వుతూ చూస్తున్నట్లు అనిపిస్తుంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి