ఆదిశక్తి యొక్క లీలాకథలు
ఆదిశక్తి యొక్క లీలాకథలు
నవార్ణమంత్రం యొక్క రహస్యార్థము - సాధనా మర్మము
ఆదిశక్తి యొక్క లీలాకథ బీజరూపములో నవార్ణమంత్రంలో ఇమిడివున్నది. నవార్ణ మంత్రం యొక్క విస్తారం వికాసమే,
శ్రీదుర్తాసప్తశతి యొక్క మూడు రకాలైన చరిత్రలు మరియు 700 మంత్రాల రూపములో జరిగింది అని కూడా చెప్పవచ్చును.
బహుశా అనేకమంది పలురీతులలో “ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చె" అను
9 అక్షరాలు గల ఈ నవార్ణమంత్రంతో పరిచయమును కలిగి వుంటారు. కానీ దీని రహస్యానుభూతిని కొద్దిమందే సాధించి ఉంటారు.
మంత్రవేత్తలు ఇందులో 33 కోట్లమంది దేవీ-దేవతల వివిధ మంత్ర మహామంత్రాల సారమును అనుభూతి చెందుతారు.
ఈ సాధనతో ప్రకృతి మరియు సృష్టియొక్క దుర్లభమమైన రహస్యాలు పరిశోధింపబడి, తద్వారా వాటి జ్ఞానమును పొందటం జరుగుతుంది.
ఈ మహా మంత్రంలో "ఐం హ్రీం క్లీం" మంత్రబీజాలే కాక మంత్రాక్షరాలలోని మిగిలిన ప్రతి అక్షరము బీజమంత్రము లతో సమానంగానే సాధకుని అస్తిత్వంలో ఆధ్యాత్మిక విస్ఫోటనం కలిగించి,అలౌకిక శక్తిధారలను వికసింపజేసే సామర్ధ్యమును కలిగి వున్నాయి.
జగన్మాత లీలాకథలను వివరిస్తూ ఇప్పటివరకు గడచిన భాగాలలో దీనిలో ఉన్న మొత్తం ఆరు అంగాల వివేచన చేయబడింది.
కవచం, అర్గలా, కీలకము, ప్రాధానికరహస్యము, వైకృతికరహస్యము, మూర్తిరహస్యము అను
ఈ మొత్తం ఆరు అంగాలు శ్రీదుర్గాసప్తశతితో అనివార్యమైన మరియు అభిన్నమైన రూపంలో జోడింపబడివున్నాయి.
వీటి పారాయణ చెయ్యకుండా సాధనావిధానము పూర్తి అవ్వదు. ఇదేక్రమంలో నవార్ణ మంత్రమునకు విశేష స్థానమున్నది.
సప్తశతి పారాయణకు ముందు, పారాయణ తరువాత నవార్ణమంత్ర జపమును చేయుట తప్పనిసరి అని శక్తి సాధకులు భావిస్తారు.
ఆద్యనౌ నవార్ధమంత్ర జపేత్ అనగా పారాయణ ఆది, అంతములలో నవార్ణమంత్రమును జపించాలి, ఎందుకంటే నవార్ణమంత్రముతో,
సంపుటీకరణ చేయుట వలన పారాయణ అతి ప్రభావశాలిగా ఉంటుంది అని శాస్త్రములు కూడా చెప్తున్నాయి. సాధకులు తమ సాధనా క్రమంలో దీని అనుభూతి చెందగలరు.
నవార్ణ మంత్ర బీజాక్షరములు మరియు మంత్రాక్షరముల రహస్యాత్మకత విషయానికి వస్తే వీటి కథా వివరణ బహు విస్తారమైనది.
ఐం హ్రీం క్లీం రూపంలో
ఈ మూడు వాగ్బీజం, మాయాబీజం మరియు కామబీజం ప్రకృతి యొక్క త్రిగుణాత్మక ధారలకి ప్రతీకలు.
అవే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములో చిత్రీకరించబడినాయి. చాముండాయై విచ్చే మంత్రాక్షరాలలో త్రిగుణాత్మిక మహాశక్తి భగవతి పట్ల నిండైన శరణాగతి భావం ఉంది.
అందువల్ల పారాయణ క్రమంలో భగవతి మహాకాళీ స్వరూపము ముందుగా ఇవ్వబడింది. అందులో క్లీం బీజమంత్ర సామర్థ్యము విపులంగా వివరించబడినది.
దీని తరువాత మధ్యమ చరిత్రలో మాత మహాలక్ష్మి యొక్క మంత్ర మహిమయే బీజాక్షరములు విస్తారక్రమంలో ప్రకటీకరించబడినది.
చివరలో ఐం బీజ సామర్థ్యం మాత సరస్వతి యొక్క మంత్ర మహిమరూపంలో ఇవ్వబడింది.
చాముందాయై విచ్చె: ఈ మంత్రాక్షరాలలో కూడా అనేక ప్రత్యక్ష మరియు రహస్యమైన శక్తులు ఇమిడివున్నాయి. చాముండాయై అనే పదానికి ఒక అర్థము ' అజ్ఞానమనే సేనను నశింపజేసే మహాశక్తి' అని కూడా ఉంది.
సప్తశతి పారాయణ క్రమాన్ని అనుసరించి 7 వ అధ్యాయంలో భగవతి పరాంబ యొక్క లలాటం నుండి ఉద్భవించిన మహాశక్తి శుంభ నిశుంభుల సేనానాయకులైన చండ ముండులను వధించినది అని వర్ణించబడివుంది.
వధానంతరము వారు ఈ బలి పశువులను భగవతికి అర్పించినప్పుడు ఆమె నవ్వుతూ లేక మందహాసం చేస్తూ ఇలా అంది.
యస్మాచ్చణం చ ముణ్ణంచ చ గృహీత్వా త్వముపాగతా చాముణ్ణితి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి
'నువ్వు చండ, ముండులను తీసుకొని మా వద్దకు వచ్చినావు, అందువల్ల
ఈ లోకంలో నువ్వు చాముండాదేవీ అను నామధేయంతో విఖ్యాతి చెందెదవుగాక!'
విజ్ఞుల అభిప్రాయాన్ని అనుసరించి ఈ చాముండాయై పదం ఆ మహాశక్తినే తలపిస్తుంది. అదేవిధంగా పదంలో 4 అక్షరాలే లెక్కించబడతాయి.
కానీ ఇందులో - చ్, మ్, ణ్, డ్, య్ అను 5 వ్యంజనములు; అ, ఉ, ఆ, ఎ - అను 4 స్వరాలు ఉన్నవి. ఈవిధంగా దీని వర్ణసంఖ్య 9 అయివున్నది. ఈ 9 అక్షరాలకు లేక వర్ణాలకు చాలా అద్భుతమైన ప్రభావం ఉంది.
అందువల్ల ఇవి మంత్రానికి మధ్యన ఉంచబడినవి. ఈ పదం తరువాత వచ్చే 'విచ్చే' అను పదం భగవతికి శరణాగతి చేసుకోమని సూచిస్తుంది. మంత్రదృష్టిని అనుసరించి దీని గొప్పతనం కూడా సాటిలేనిది.
సిద్ధిని సాధించిన కొంతమంది పరాతంత్రయోగుల అభిప్రాయం ప్రకారం శ్రీదుర్గాసప్తశతి యొక్క 4 వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో దేవీ ప్రార్ధన చేసే మంత్రం కూడా నవార్ణ మంత్రంగా అంగీకరించబడుతుంది.
ఇందులో 9 సార్లు 'న' వర్ణ లేక అక్షర ప్రయోగం చేయబడింది. నిస్సందేహంగా ఈ మంత్ర మహత్యము, అర్థము సాటిలేనివి.
శక్తి సాధకుల కొరకు వీటి గోపనీయమైన అర్థమును ఇక్కడ వివరించబడుతున్నది. తద్వారా వీటి అద్భుత ప్రభావమును సరైన రీతిలో అర్థము చేసుకోవచ్చును.
శూలేనౌ పాహి నౌ
పాహి ఖడ్గన చామ్బికె ||
ఘజ్జాస్వనేన నః పాహి చాపజ్యానిః స్వనేన చ ||ఈ మంత్రంలో 'న' అను అక్షరం 9 మార్లు ప్రయోగించబడినది. దీని అర్థము కూడా అద్భుతమైనది. 'హే దేవీ! నీ ఖడ్గంతో నా దైహిక, దైవిక మరియు భౌతిక కష్టాలను ఖండించి వేయుము.
జాగృత, స్వప్న, సుషుప్తుల వ్యాధులను దూరం చేయుము. నేను మూడు దేహములు అనగా స్థూల సూక్ష్మ కారణశరీరాల కాలావధులను నాద, స్పంద మరియు ప్రణవం ద్వారా అతిక్రమించుదునుగాక!
కారణ మహాకారణ శరీరాలలో మహిషాసుర రూపంలో ఉన్న అహంకారమును షట్చక్రభేదన ద్వారా శమింపజేసి, సహస్రారం లేక బ్రహ్మ రంధ్రంలో ప్రవేశించి,
క్రమక్రమంగా ఊర్ధ్వగతిని పొంది జ్ఞాన సామ్రాజ్యంలో ప్రవేశించుదునుగాక!" అనే ప్రార్ధన ఇక్కడ చెయ్యబడింది. ఈ కొద్ది శబ్దాలలో దీని దివ్యమైన అర్థమును సంకేతముగా పొందగలము.
సాధకుల సముదాయము నవార్ణమంత్రమును నవార్ణవ మంత్రం అని కూడా పిలుస్తారు. నవ అర్ణవ అనగా 9 సముద్రాలు. ఈ మంత్రంలో 9 అక్షరాలు ఉన్నాయి.
అవి సాధకుడికి 9 సముద్రాలను దాటివేసే సామర్థ్యము నిస్తాయి. ప్రతి సాధకుడు 1. కామ, 2. క్రోధ,
3. మోహ, 4. లోభ, 5. మద, 6. మాత్సర్య, 7. ఈర్ష్య,
8. ద్వేషము అనే సముద్రములను దాటాలి.
ఈ ఎనిమిదీ కాక ఈ అష్ట సముద్రాల శృంఖల యొక్క రెండు ఒడ్డులను కలిపే సంగమమే 9వ సముద్రం.
ఈ 9 సముద్రాలను దాటిన మానవుడు తన జీవన లక్ష్యమును సాధిస్తాడు.
ఈ 9 సముద్రాల శృంఖలలో 'కామం' మొదటి సముద్రము. ఏ కామకళ మనిషిని నాశనము చేస్తుందో, దానినే సదుపయోగం చేసినప్పుడు అతనిని జగదంబ యొక్క శ్రీచరణాల సన్నిధికి చేరుస్తుంది.
నవార్ణ మంత్రములోని మూడవ అక్షరము కామబీజమైవుంది. దీని సమ్యక్ లేక సరియైన సాధన వలన సాధకుడు కామమనే సముద్రమును దాటుతాడు.
ఐం బీజం విజ్ఞానముతో కలిసిన వాక్కునకు సంబంధించినది. దీనితో మనిషి క్రోధమనే సాగరమును దాటగల సామర్థ్యమును పొందుతాడు.
వాక్కు కఠినముగా ఉంటే సాధకుడు మునిగిపోతాడు. వాక్కుతో క్రోధావేశం చెందకుండా సాధకుడు,
దేవిగుణ కీర్తన చేస్తూ
ఆ భావంలో మునిగి తేలినప్పుడు త్రికాలజ్ఞుడు అవుతాడు.
హ్రీం-మాయాబీజం. అది సాధకుని మోహబంధనాల నన్నింటిని త్రెంచివేస్తుంది. చివరకు మానవుడిని అన్ని మోహజాలములనుండి మహామాయే బయటపడవేసేది.
'చా' అనే అక్షర సాధన సాధకులను లోభమనే సముద్రమును దాటించివేస్తుంది. ఈ సాధనా రహస్యాలను తెలుసుకుని అర్ధం చేసుకున్నప్పుడు మానవుని అసంతృప్తి నశించిపోతుంది.
'ము' మదరూపంగల సముద్రమును దాటించగల సామర్థ్యమును ఇస్తుంది.
'మ' అమృతబీజం. దీని సాధనా రహస్యము లోతైనది.
దీని సాధనతో సాధకుడు మదం నుండి బయటపడే సామర్థ్యమును పొందుతాడు. 'డ' జడత్వమును సూచించే అక్షరము. జడత్వము వలన మనిషిలో మత్సరం (అసూయ) వస్తుంది.
శ్రద్ధాపూర్వకంగా 'డా' మంత్రాక్షర రహస్యమును హృదయంలో భావనాత్మకంగా జపించినప్పుడు మనిషి తన ధ్యేయం వరకు చేరుకుంటాడు.
'యై' వాయువు మరియు వాక్భీజం సంయోగంతో ఉద్భవించినది. ఇది ద్వేషమనే సముద్రమును దాటించివేస్తుంది.
'వి' ఈర్ష్య రూప సముద్రమును అధిగమింపజేసే బీజమంత్రం. 'చ్చె' ఇది 9వ సముద్రానికి చెందినది. ఇది అష్ట సముద్రములను కలిపే కూడలి. దివ్యతత్త్వంతో కూడిన 'చ్చె' అక్షర సాధన సాధకుడిని ఈ సంగమం నుండి పైకి లేపి ఉద్ధరిస్తుంది.
నవార్ణమంత్ర రహస్యార్ధ్యము మరియు సాధనా రహస్యము ఇంకా చాలా ఉంది. ఇందులో మొదటగా తత్త్వ నవార్ణ భేదములు మరియు వివిధ సాధనా ప్రక్రియలు ఉన్నాయి.
నవార్ణమునకు చాలా విస్తృమైన రూపముంది. దాన్ని మహావార్ణం అని అంటారు. ఇంతేకాకుండా గాయత్రీ మహామంత్రమునకు కూడా నవార్ణమంత్రంతో రహస్య సంబంధము ఉంది. నవార్ణమంత్రము యొక్క ఇతర రహస్యాలను రాబోయే సంచికలో చెప్పబడతాయి.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి