ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ?
ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ?
1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల" నిత్య పారాయణను ఉపయోగిస్తారు. మరియు
విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.
2.కనకధారా స్తోత్రం..!
"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.
3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం..!
ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.
4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి..
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి"ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.
5.నవగ్రహ స్తోత్రం..
నవగ్రహ స్తోత్రా"న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.
6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు.
విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.
7. గోపాల స్తోత్రం..!
సంతానం లేని వారు ప్రతిరోజు "గోపాల స్తోత్రం"ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి