జోతిష్యంలో:- ఆలస్య వివాహాం,కలుగు అంశాలు

 


జోతిష్యంలో:- ఆలస్య వివాహాం,కలుగు అంశాలు

జాతక పరంగా కొన్ని గ్రహాల అనుకూలతలు లేకపోవటం వలన కూడా ఆలస్య వివాహాలు జరుగుతున్నాయి.ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలను పరిశీలిద్దాం. జాతకంలో వివాహ స్ధానం సప్తమ స్ధానం. సహజ వివాహా కారకుడు శుక్రుడు, స్త్రీలకు కుజుడును చూడాలి. సప్తమ భావానికి బావాత్ భావం అయిన లగ్నాన్ని కూడా పరిశీలించాలి. అపోహలకి కారకుడైన రాహువుని, చంచలత్వానికి కారకుడైన చంద్ర గ్రహాన్ని పరిశీలించాలి. పంచమ స్ధానం ప్రేమ వివాహనికి కారణం కావున ఆ స్ధానాన్ని పరిశీలించాలి. కుజ, శుక్ర గ్రహాలను పరిశీలించాలి.

లగ్న స్ధానం- సప్తమానికి భావాత్  భావం

సప్తమ స్ధానం – భార్య, భర్తల గుణగణాల కోసం.

చతుర్ధ స్దానం – సుఖాల కోసం.

వ్యయ స్ధానం – శయ్యా సుఖం కోసం.

ద్వితీయ స్ధానం – కుటుంబ అభివృద్ధి కోసం .

పంచమ స్ధానం – సంతానం కోసం .

నవమ స్ధానం – సత్ సంతానం కోసం.

లాభస్ధానం – దర్మ, అర్ధ, కామ, మోక్ష స్ధానాలలో కామ స్ధానం, వివాహానంతర ప్రేమాభిమానాలకు.

షష్టమ స్ధానం – గొడవలు, కోర్టు సమస్యలు, ఎడబాటు( ఉద్యోగ పరంగా, విద్యాపరంగా దూరంగా ఉండటం కూడా కావచ్చు)

అష్టమ స్ధానం – కష్ట, నష్టాల కోసం ఆయా స్ధానాలను వివాహానికి పరిశీలించాలి. 

1. శని రాహువులు సప్తమభావంలో ఉంటే ఆలస్య వివాహం అవుతుంది. వర్ణాంతర వివాహాం జరిగే అవకాశాలు ఉండవచ్చు.

2. సప్తమ భావంలో నెప్ట్యూన్ ఉన్న ఆలస్య వివాహం అవుతుంది.

3. శని, శుక్ర సంబందం వలన ఆలస్య వివాహం అవుతుంది.

4. లగ్నానికి కుజుడు అష్టమంలో శత్రు రాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది.

5. 2,7,11 భావాలపైన శని రాహువుల దృష్టి ఉండటం వలన కూడా వివాహం ఆలస్యం అవుతుంది.

6. తులా లగ్నం అయి శుక్రుడు సప్తమ భావంలో ఉన్న ఆలస్య వివాహం అవుతుంది.

7. అష్టమంలో రాహువు ఉన్న కుటుంబ సమస్యల మూలంగా వివాహం ఆలస్యమవుతుంది.

8. 2,7,11 భావ అధిపతులకి 6,8,12 భావాధిపతులతో సంబందం ఏర్పడిన వివాహం ఆలస్యమవుతుంది.

9. సప్తమాధిపతి నీచలో ఉన్న, నవాంశలో సప్తమాదిపతి 6,8,12 భావాలలో ఉన్న వివాహం ఆలస్యమవుతుంది.

10. సప్తమాధిపతి శని,రాహు, కేతువులతో కలసి ఉన్న,షష్టాధిపతి, వ్యయాధిపతి సప్తమాన్ని చూస్తున్న, కుటుంబ స్ధానాన్ని చూస్తున్న, సప్తమంలో కుజుడు నీచలో ఉన్న, వివాహం ఆలస్యమవుతుంది.

11. శని దశమ భావంలో ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. సప్తమంలో ఉన్న గ్రహం గాని, సప్తమాధిపతి గాని వక్రించటం వలన వివాహం ఆలస్యం కావటం కాని, వివాహం పట్ల విముఖత చూపటం కాని చేస్తారు.

12. కర్కాటక, సింహలగ్నం వాళ్ళకు సప్తమాధిపతి శని కావటం వలన వివాహం ఆలస్యం కావటం లేదా వివాహం అయిన తరువాత చిన్న చిన్న మనస్పర్ధలు రావటం జరుగుతాయి.   

13. గ్రహాలన్నీ రాహు కేతువుల మద్య ఉన్నాయని, కుజదోషం ఉన్నదని, నాగదోషం ఉన్నదని అపోహలతో మిగతా జాతకాన్ని పరిశీలించక మంచి జాతకం కాదనే ముద్ర పడటం వలన కూడా వివాహం ఆలస్య మవుతుంది.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

        1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

పితృస్థుతి