అహంకారంతో విర్రవీగి జీవిస్తే ఏమైతుందో...... తెలియజేసే ఒక మంచి కధ...మన కోసం



 అహంకారంతో విర్రవీగి జీవిస్తే ఏమైతుందో...... తెలియజేసే ఒక మంచి కధ...మన కోసం.. 

ఒకసారి ఒక పండితుడు నది దాటవలసి వచ్చింది. ఆ పండితుడు పడవలో కూర్చున్నాడు. వాతావరణం ఆహ్లాదంగా, చల్లని గాలి తాకుతూ ఎంతో చక్కగా ఉంది. 

పడవ నడిపే వాడు సైలెంటుగా ఏం మాట్లాడకుండా, తన పడవ నడుపుతున్నాడు. పండితుడు, అతడి ఊరు, పేరు, కుటుంబ వివరాలు అన్నీ తెలుసుకున్నాడు. పడవాడు ఓపికగా సమాధానాలు చెప్పాడు.

“నీకు వేదాలు తెలుసునా?” ప్రశ్నించాడు పండితుడు.

“అవేవిటి స్వామీ తింటే బాగుంటాయా?” అడిగాడు పడవవాడు. పండితుడు నవ్వుకుని “పోనీ శాస్త్రాలు ” తెలుసా..? అని ప్రశ్నించాడు. “అవి నేనెప్పుడూ చూడలేదు బాబయ్యా, ఏమిటవి ఎగిరే పిట్టలా?” అని అడిగాడు. 

అందుకు పండితుడు కనీసం “నీకు చదువు వచ్చునా?” అని ప్రశ్నించాడు.

“లేదు స్వామీ, నాకు పొట్ట కోస్తే ఏ చిన్న అక్షరాలు కూడా రావు. చిన్నతనం నుంచీ పడవ నడపడంతోటే సరిపోయింది. నా తండ్రి ఆర్థిక స్తోమత వల్ల నేను బడికి పోలేదు. అయినా పడవ నడిపే వాడికి నాకు చదువుతో పనేమిటి బాబయ్యా” అని అన్నాడు.

పడవ వాని అజ్ఞానానికి విచారించాడు పండితుడు. నీవెలా బతుకి తరిస్తావని వాపోయాడు. పడవ వాడు ఏం మాట్లాడలేదు. మౌనంగా పడవ నడపసాగాడు. పండితుడు కూడా ఇటువంటి లో క్లాస్ వాడితో నాకు మాటలేంటి అని ఏం మాట్లాడలేదు. వేదాలూ, శాస్త్రాలూ రాకపోతే పోనీ అక్షరాలైనా రాణి వాడితో తనకి మాటలేమిటని అసలు నేను వీడితో ప్రయాణం ఏంటి అనుకున్నాడు.

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నది, ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. పెద్ద గాలి వేసింది. ఎక్కడనించో అకస్మాత్తుగా నీరు వరదలై వచ్చింది. పడవ ఊగసాగింది. 

నీరు హెచ్చు పెరిగిపోయింది. దానికి తోడు ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం మొదలైంది. పడవవాడు ఇవ్యన్ని తనకు మామూలే అని నిశ్చింతగా ఉన్నాడు. అప్పుడు పండితుడు చాలా భయపడ్డాడు.

పడవ తలక్రిందులై మునిగి పోయే పరిస్థితి . ఆ పండితుడు గోల పెట్టాడు. గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పటిదాకా మాట్లాడకుండా ఉన్న పడవ వాడు, “మీకు ఈతవచ్చునా?” అని అడిగాడు.

“నాకు ఈత రాదు” అన్నాడు పండితుడు.

“అయితే మీ బ్రతుకు వృథా స్వామీ! నాకు ఈత వచ్చును” అని చెప్పాడు. తన అజ్ఞానానికి క్షమాపణలు చెప్పాడు. నన్ను కాపాడాలని ఆ పడవ వాడిని వినయంగా వేడుకున్నాడు. పడవవాడు అతన్ని పట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డున చేర్చాడు పడవవాడు.

దీన్ని బట్టి చూస్తే నేనే గొప్ప అనే అహంకారం ఉండకూడదు. నీ దగ్గర ఎన్ని ఉన్నా భగవంతుని దీవెనలు ఆశీస్సులు లేక పోతే అంతా శూన్యం. అణిగి మణిగి జీవించాలి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని చెప్పే ఒక మంచి కధ. ఇక్కడ సంపదలు ఏవి ఆ మనిషి తో పాటు రావు. అవి నీ తరువాత మరొకరి సోత్తు, ఆ తరువాత ఇంకోకరి సోత్తు... నీతి లేని జీవితం వృధా. భగవంతుని సన్నిధిలోకి చేరలేవు. కుయుక్తులు, మోసపు ఆలోచనతో ఎంత కాలం..?? ఎన్ని శాస్త్రాలు, వేదాలు తెలిసినా ఈ జీవితాన్ని కుటుంబ సంసారాన్ని సాగించాలంటే భగవన్నామమనే ఈత రాకపోతే ప్రమాదం. కుటుంబాన్ని, సంసారాన్ని ఈ జన్మని సురక్షితంగా ఒడ్డు చేర్చాలంటే ఎటువంటి పరిస్థితులలోనైనా దాటాలంటే భగవంతుని నామమనే ఈతవచ్చి తీరాలి.

అహాన్ని  నాశనం చేయడం గురించి ఇవ్వాళ లోకంలో అనవసర ప్రసంగాలెన్నో చెబుతున్నారు. దీన్ని పవిత్ర గ్రంథాల నుండి తీసుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం వికారంగా మారినప్పుడల్లా మీరు దాన్ని అహం అంటారు. బాధ్యతను వదిలించుకునే మరో పద్ధతి ఇది. మీ వ్యక్తిత్వం అసహ్యంగా మారినప్పుడు అది మీరేనని మీరు గుర్తించాలి. “నేను వికారంగా ఉన్నాను” అని మీరనుకుంటే దాని గురించి మీరేమైనా చెయ్యవచ్చు. మీరలాగే ఉండాలని కోరుకోరు కదా.

నేను అందంగా ఉన్నానా...??

నేను మంచి వాడినా.....??

నాకే అన్ని సంపదలు ఉన్నాయి...?? అని నాకు నేనే గొప్పగా చెప్పుకుంటే ఏం ప్రయోజనం..?? సొంత డబ్బా అవుతుంది. ఇతరులు మన మేలు కోరి మన మంచికోరే వారు మాట్లాడుతూ చెబుతూ ఉంటారు...

మన అందరికి భగవంతుని దీవెనలు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను...

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

        1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

పూర్వ జన్మ కర్మ ఫలితాలు - వాటి అవయోగాల ఫలితాలు....