ధన తయోదశి
ధన తయోదశి రోజున వెండి, బంగారం కంటే ఈ ఒక్క వస్తువు కొనండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది..
ఐదు రోజుల దీపావళి పండగ ధన త్రయోదశి నుంచి మొదలవుతుంది. ఈ ఏడాది ధన త్రయోదశి పండుగను అక్టోబర్ 18, 2025న జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి , ఇత్తడి వంటి లోహాలన కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఖరీదైన వస్తువులను మాత్రమే కాదు.. చీపురిని కూడా = ధన త్రయోదశి నాడు కొనుగోలు చేస్తారు. ఇలా ధంతేరాస్ నాడు చీపురులను ఎందుకు కొనుగోలు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం లోని త్రయోదశి తిథిని ధన త్రయోదశి అని అంటారు. దీనినే ధన త్రయోదశి అని పిలుస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 18న ధన త్రయోదశిను జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున చీపురు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ధన త్రయోదశి నాడు చీపుర్లు ఎందుకు కొనుగోలు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ధన త్రయోదశి రోజున చీపుర్లు కొంటారు ఎందుకంటే అవి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం ధన త్రయోదశి నాడు చీపురు కొని ఇంటికి తీసుకుని రావడం అంటే.. లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువచ్చినట్లే. ఈ రోజున చీపురు కొనడం లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది.
చీపురు ఇంటి లోని ప్రతికూల శక్తిని , పేదరికాన్ని తొలగిస్తుంది. అందువల్ల ధన త్రయోదశి నాడు ఇంటికి కొత్త చీపురు తీసుకురావడం వల్ల ఆనందం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. అంతేకాదు ధన త్రయోదశి నాడు చీపురు కొనడం వల్ల శ్రేయస్సు వస్తుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది.
ధన త్రయోదశి నాడు చీపురు కొని తర్వాత ఆ చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ధన త్రయోదశి నాడు చీపురు కొనడం పేదరికాన్ని దూరం చేయడానికి ఒక సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి