భారతీయులు తులసి చెట్టును ఎందుకు పూజిస్తారు?


 

భారతీయులు తులసి చెట్టును ఎందుకు పూజిస్తారు?

ఈ విషయాలు తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు!

దాదాపుగా అన్ని తెలుగు లోగిళ్లలోనూ తులసికోట కనిపిస్తుంది. చాలా ఇళ్లలో ఇంటి ముందు, కొన్ని ఇళ్లలో ఇంటి మధ్యలో తులసిని ఏర్పాటు చేస్తారు. ఉదయాన్నే తలస్నానం ఆచరించిన మహిళలు, నిష్టతో కోట చుట్టూ తిరిగి పూజలు చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, అసలు తులసి చెట్టును ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? దాని వల్ల కలిగి ఉపయోగాలేంటో తెలుసా? తులసి గురించి ఆధ్యాత్మికత, శాస్త్రీయత చెబుతున్న విషయాలేంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

అమ్మవారి ప్రతిరూపం :

తులసి చెట్టును లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంట్లోనూ చిన్నదో, పెద్దదో.. తులసి కోట మాత్రం తప్పకుండా ఉంటుంది.

తులసి మొక్క శ్రీ మహా విష్ణుమూర్తికి సైతం అత్యంత ప్రియమైనది

తులసి దళం లేకుండా విష్ణుపూజ పూర్తికాదని భావిస్తారు

అలాంటి మొక్కను నిత్యం పూజించడం ద్వారా భక్తి, విశ్వాసం పెరుగుతాయని పండితులు చెబుతారు.

తులసి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా వస్తుందని నమ్ముతారు

దివ్య రక్షణ:

తులసి ఇంటి ఆవరణలో ఉండడం వల్ల దుష్టశక్తులు ఏవీ ఇంట్లోకి రాకుండా ఉంటాయని నమ్మకం

దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చెబుతారు

తులసి కళకళలాడుతోందంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉందని అర్థం అంటారు

అందుకే పండగలతో సంబంధం లేకుండా ప్రతి రోజూ తులసిని పూజిస్తారు

తిరుమలకు చేరుకోవడానికి 3 కాదు- మొత్తం 8 మార్గాలున్నాయట! మీకు తెలుసా?

ఆరోగ్య ప్రయోజనాలు :

తులసి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మందికి తులసిని తింటే కలిగే మేలు గురించి మాత్రమే తెలుసు. కానీ ఆ చెట్టును ఇంటి ముందు నాటితే కూడా చాలా మంచిదని చెబుతారు

తులసి మొక్క అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్ గా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆక్సీజన్​ ఉత్పత్తి చేయడంతోపాటు గాలి కాలుష్యాన్ని శుభ్రం చేసే శక్తిని కలిగి ఉందని చెబుతారు.

దగ్గు, జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారికి తులసితో చికిత్స చేస్తుంటారు

ఇంకా జీర్ణ క్రియ సాఫీగా సాగడానికి, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి తులసి చక్కగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు

పొట్టలో ఆహారం అరిగించడానికి అవసరమైన ఎంజైమ్స్​ ను ప్రేరేపించి, ఆహారంలోని పోషకాల్ని శరీరం గ్రహించేలా చూస్తుంది

తులసి ఆకుల్లోని యూజెనాల్‌, C విటమిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బూస్టర్​గా పని చేస్తాయి

కిడ్నీల ఆరోగ్యానికి కూడా తులసి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులు నిత్యం తీసుకోవడం వల్ల శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయని, తద్వారా చర్మం కాంతివంతంగా తయారవుతుందని సూచిస్తున్నారు.

అంతేకాదు మానసిక ఒత్తిడిని తగ్గించే అడాప్టోజెనిక్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయట

మనిషి మెదడులో ఒత్తిడి పెరిగిపోవడానికి కార్టిసాల్‌ కారణం. దీన్ని తగ్గించడానికి తులసి ఆకుల్లోని రసాయనాలు ఎంతో బాగా పనిచేస్తాయి. ఇవి కార్టిసాల్​ను తగ్గించి, ప్రశాంతతను పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

శ్వాస సంబంధింత ఇబ్బందులకు కూడా తులసి చక్కగా పనిచేస్తుందట. ఇందుోలని యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలు శ్వాస సమస్యల్ని కంట్రోల్ చేస్తాయట

అందుకే రోజూ ఉదయం నాలుగైదు తులసి ఆకుల్ని నమిలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులతోపాటు, ఆధునిక వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

        1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

పూర్వ జన్మ కర్మ ఫలితాలు - వాటి అవయోగాల ఫలితాలు....