పోస్ట్‌లు

మడికట్టుకోవడం?

చిత్రం
మడికట్టుకోవడం? మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం. ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం  మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే మడి అంటే ఏమిటి ? మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు.  శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు.  సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు.  కనుక నిత్య జీవనములో మానసిక...

28-09-2025 – తెలుగు రాశి ఫలాలు

చిత్రం
  మేష రాశి: మేష రాశి వారికి ఈ రోజు వృత్తిలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యము. ఆర్థికంగా పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ పెద్ద ఖర్చులు నివారించాలి. ప్రేమ సంబంధాల్లో సానుకూల పరిణామాలు లభిస్తాయి; ప్రస్తుత సంబంధాలు గాఢతతో నిండి ఉంటాయి. ఆరోగ్యం సాధారణ స్థితిలో ఉంటుంది, చిన్న ఒత్తిడి వల్ల సమస్యలు రావడం సహజం. ఈ రోజు ధ్యానం లేదా విశ్రాంతి తీసుకోవడం మేలు చేస్తుంది. వృషభ రాశి: వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. వృత్తి పరంగా సహకారం ఉంటుంది, స్నేహితులు మరియు సహచరుల సాయం ఉపయోగకరం. కుటుంబ సమస్యలు తక్కువగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది, కొత్త పరిచయాలు కొంత Romantically ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది; తక్కువ అలసటతో రోజు గడుస్తుంది. మిథున రాశి: మిథున రాశి వారు ఈ రోజు సృజనాత్మకతకు అనుకూలంగా ఉంటారు. కొత్త ఆలోచనలు, చింతనలో సమయం గడపడం ఉపయోగకరం. వృత్తి పరంగా సహకారం ఉంటే ఫలితం తక్కువ శ్రమతో సాధ్యమవుతుంది. ఆర్థిక పరిస్థితి మధ్యస్థ స్థితిలో ఉంటుంది. ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది, కానీ అధిక భావోద్వేగం సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్...

పంచాంగం - 28-09-2025

చిత్రం
  ఓం శ్రీ గురుభ్యోనమః  సెప్టంబర్ 28, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణ పక్షం విక్రమ్ సంవత్  -  2082, కాలయుక్త శక సంవత్  -  1947, విశ్వావసు పూర్ణిమంత  -  అశ్విన అమంత మాసం  -  అశ్విన తిథి శుక్ల పక్ష షష్ఠి    -  Sep 27 12:04 PM – Sep 28 02:27 PM శుక్ల పక్ష సప్తమి    -  Sep 28 02:27 PM – Sep 29 04:32 PM నక్షత్రం జ్యేష్ట   -  Sep 28 01:08 AM – Sep 29 03:54 AM మూలా   -  సెప్టెంబర్ 29 03:54 AM – Sep 30 06:17 AM కరణ తైటిలా  -  సెప్టెంబరు 28 01:17 AM – Sep 28 02:27 PM గరిజ  -  Sep 28 02:27 PM – Sep 29 03:33 AM వాణిజ  -  సెప్టెంబరు 29 03:33 AM – Sep 29 04:32 PM యోగా ఆయుష్మాన్  -  సెప్టెంబర్ 27 11:45 PM – Sep 29 12:31 AM సౌభాగ్య  -  Sep 29 12:31 AM – Sep 30 01:00 AM వర రవివార్ (ఆదివారం) పండుగలు & వ్రతాలు దుర్గా పూజ శాస్తి సూర్యుడు & చంద్రుడు సమయం సూర్యోదయం  -  ఉదయం 6:21 సూర్యాస్తమయం  -...

ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు...

చిత్రం
ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు... ఒక అడవిలో కుందేలు ఒకరోజు  ఏనుగుని  దాని భారీ శరీరం చూసి బిత్తరపోయింది, దాని చేటంత చెవులు, స్తంభాల్లాంటి కాళ్లు చూసి దాని ఆశ్చర్యానికి అంతేలేదు... పొదల చాటుకెళ్లి దాక్కోవడం కూడా మరిచిపోయి నోరు తెరిచి చూస్తున్న ఆ బుజ్జి కుందేలును ఏనుగు గమనించింది... చూపులకే మెత్తగా ఉన్న ఆ తెల్లని రూపాన్ని ఏనుగు కూడా ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయింది... సుతిమెత్తగా ఉన్న ఆ కుందేలును ఏనుగు సుతారంగా తొండంతో ఎత్తి తన వీపుపై ఉంచుకుంది, ఆ చుట్టుపక్కలంతా షికారు తిప్పింది... రోజూ తనకి కొండమీదున్నట్లు ఎత్తుగా కనిపించే చెట్ల మీద కోతులు తన ఎత్తులో ఉండటంతో కుందేలు కేరింతలు కొట్టింది.  అంత ఎత్తు నుంచి కిందికి చూడటం దానికి భలే వింతగా, గమ్మత్తుగా ఉంది.  ఏనుగు ప్రోత్సాహంతో అది కొమ్మనున్న కాయకోసి తింది, తర్వాత కుందేలును బొరియ వద్ద దింపి ఏనుగు వెళ్లిపోయింది... అది మొదలు వాటి స్నేహం కొనసాగింది... రోజూ కలిసి ఆడుకునేవి. ఒక రోజు కుందేలు దాగుడుమూతలు ఆడదామని సరదాపడింది... ఏనుగుని కళ్లుమూసుకోమని ఒక పొదలో దాగింది... ఏనుగు ఒక్కోపొదని మెల్లిగా ఒత్తిగిస్తూ కుందేలుని కనుక్కుంది....

క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా.

చిత్రం
క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా. సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు. ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు. అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే. సాధారణంగా ప్రతి వృక్షం భూమినుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఇలా స్వర్గం నుంచి భ...

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట…

చిత్రం
  నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట… దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే…   ఈ ‘మన పాట’ ఆనాటివారికి గుర్తుకు రావలసినదే..! ఇదే ఆ దసరా పాట… ఏదయా మీదయ మామీద లేదు! ఇంతసేపుంచుట ఇది మీకు తగదు! దసరాకు వస్తిమని విసవిసల బడక!  చేతిలో లేదనక ఇవ్వలేమనక !!తగదు! ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!    రేపురా మాపురా మళ్ళి రమ్మనక!! శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!! పావలా బేడైతె పట్టేది లేదు అర్థరూపాయైతె అంటేది లేదు ముప్పావలైతేను ముట్టేది లేదు రూపాయి ఐతేను చెల్లుబడి కాదు! హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!  జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!! అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!        మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!జయీభవ విజయీభవా.      దిగ్విజయీభవా!! దసరా పండుగను గిలకల పండగంటారు. చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లంబులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "...