పోస్ట్‌లు

నవంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కాళభైరవాష్టమి

చిత్రం
  కాళభైరవాష్టమి కాళభైరవా నమోస్తుతే -  కపిలీశ్వరా నమోస్తుతే -  కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే" అని నిత్యం పఠిస్తే బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కాళభైరవుడు. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి ''కాలభైరవాష్టమి''. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ''కాలభైరవాష్టమి'' పర్వదినాన్న కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి  శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.  ఈరోజు గంగాస్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది. కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప...

పంచాంగం - 30-11-2025

చిత్రం
  జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య HAVANIJAAA -  Ph. no:  9542665536 ఓం శ్రీ గురుభ్యోనమః  శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రం సంవత్సరం  -  కాళయుక్తి 2082, మార్గశిరము 10 ఇండియన్ సివిల్ క్యాలెండర్  -  1947, మార్గశిరము 9 పుర్నిమంతా  -  2082, మార్గశిరము 25 అమాంత  -  2082, మార్గశిరము 10 తిథి శుక్లపక్షం దశమి    -  Nov 29 11:15 PM – Nov 30 09:29 PM శుక్లపక్షం ఏకాదశి    -  Nov 30 09:29 PM – Dec 01 07:01 PM నక్షత్రం ఉత్తరాభాద్ర  -  Nov 30 02:22 AM – Dec 01 01:10 AM రేవతి  -  Dec 01 01:10 AM – Dec 01 11:18 PM కరణం తైతుల  -  Nov 29 11:15 PM – Nov 30 10:28 AM గరజి  -  Nov 30 10:28 AM – Nov 30 09:29 PM పణజి  -  Nov 30 09:29 PM – Dec 01 08:20 AM యోగం వజ్రము  -  Nov 29 09:26 AM – Nov 30 07:12 AM సిద్ధి  -  Nov 30 07:12 AM – Dec 01 04:21 AM వ్యతీపాతము  -  Dec 01 04:21 AM – Dec 02 12:58 AM వారపు రోజు ఆదివారమ...

అద్భుత విషయాలు

చిత్రం
అద్భుత విషయాలు 1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట,  ఒట్టు పెట్టుట దోషం. 2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని  అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు.  రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. 3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం  రెండూ నిషిద్దాలే. 5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు  ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే  వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు  ఉబ్బసపు రోగులుగా పుడతారు.  ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు  సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి  కష్టనష్టాల పాలవుతారు. 10. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. 11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు.  పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు....

"దానం చేయడం.

చిత్రం
  "దానం చేయడం. .."   మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి.. “దానం చేయడం...!” అందులో సందేహం లేదు.. అయితే ఇక్కడొక జాగ్రత్త అవసరం.  దానం పొందిన వ్యక్తి...పొందిన దానంతో తాను అభివృద్ధి చెందాలి, తిరిగి సమాజానికి ఉపయోగపడాలి. దానం చేయడం వలన..., దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి. అయితే కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజాభివృద్ధికి ఆటంకమవుతారు, దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలై మోసపూరిత మాటలతో దాతలను మరింత పీడిస్తారు. దానం చేసే వ్యక్తి ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే... తన దానాన్ని స్వీకరించే వారు తగిన అర్హతలున్న వారా.. కాదా.. అని బాగా ఆలోచించాలి, తదుపరి ఖచ్చితంగా ఋజువు చేసుకోవాలి. వారు దానం స్వీకరించడానికి అర్హులు అయితే.. అలాంటి వారికి మాత్రమే దానం ఇవ్వాలి. అది కచ్చితంగా సమాజ శ్రేయస్సుకొరకై ఖర్చు పెడితే సమాజం నుంచి నీకు ముంచి ఫలితాలు వస్తాయి. దైవం కొరకై ఖర్చు పెడితే దైవం నుండి అనుగ్రహం లభిస్తుంది. దానం స్వీకరించే వ్యక్తులు.. తగినంత అర్హులు కారని తెలిసి కూడా... అలాంటి వారికి దానం ఇచ్చినట్టయితే.... అలాంటి దానాన్ని "అపాత్రదానం" అంటారు. ఈ అప...

పంచాంగం - 29-11-2025

చిత్రం
  జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య HAVANIJAAA -  Ph. no:  9542665536 ఓం శ్రీ గురుభ్యోనమః  శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రం సంవత్సరం  -  కాళయుక్తి 2082, మార్గశిరము 9 ఇండియన్ సివిల్ క్యాలెండర్  -  1947, మార్గశిరము 8 పుర్నిమంతా  -  2082, మార్గశిరము 24 అమాంత  -  2082, మార్గశిరము 9 తిథి శుక్లపక్షం నవమి    -  Nov 29 12:15 AM – Nov 29 11:15 PM శుక్లపక్షం దశమి    -  Nov 29 11:15 PM – Nov 30 09:29 PM నక్షత్రం పూర్వాభాద్ర  -  Nov 29 02:49 AM – Nov 30 02:22 AM ఉత్తరాభాద్ర  -  Nov 30 02:22 AM – Dec 01 01:10 AM కరణం భాలవ  -  Nov 29 12:15 AM – Nov 29 11:51 AM కౌలవ  -  Nov 29 11:51 AM – Nov 29 11:15 PM తైతుల  -  Nov 29 11:15 PM – Nov 30 10:28 AM యోగం హర్షణము  -  Nov 28 11:05 AM – Nov 29 09:26 AM వజ్రము  -  Nov 29 09:26 AM – Nov 30 07:12 AM వారపు రోజు శనివారము సూర్య, చంద్రుడు సమయం సూర్యోదయము  -  6:33 AM ...

నిజాయితీకి మరోపేరు!

చిత్రం
నిజాయితీకి మరోపేరు!  చీకటిపడే సమయం అవుతోంది. ఇక త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వరత్వరగా నడుస్తున్నాడు అబ్రహాం లింకన్. ఒక వీధి మలుపు దగ్గర ఒక పేద మహిళ…  'బాబూ కొంచెం సహాయం చేయండి ఆకలితో వున్నాను'  అని  అడిగితే తన జేబులోని రెండు నాణాలలో ఒకదాన్ని ఇచ్చాడు.  ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు. నాలుగు కిలోమీటర్లు నడిచాక ఇల్లు వచ్చింది. దీపపు వెలుతురులో చూస్తే తన పొరపాటు తెలిసింది.  ఎందుకంటే మధ్యాహ్నమే చూసుకొన్నాడు అందులో ఒక నాణెం చెల్లనిది.  సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఆ విషయం మరచి చెల్లని నాణాన్ని ముసలి భిక్షగత్తెకు ఇచ్చాడు. ఎంత పొరపాటు చేశాను! అనుకొని ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి మంచి నాణాన్ని ఇచ్చి,    క్షమాపణ చెప్పి, చెల్లని నాణాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకొన్నాడు.  ఇంతలో మబ్బులు కమ్మి , వర్షం పడే సూచనలు కనిపించాయి. అయినా లింకన్ బయలుదేరాడు. వర్షం కురిసి తాను తడవకుండా వుండాలని ఆయన కోరుకోలేదు , వర్షం పడేలాగా వుంది అని ‘ఆ ముసలి భిక్షగత్తె  అక్కడి నుండి వేరేచోటికి వెళ్ళకుండా అక్కడే దగ్గర్లో వుండేలాగా చేయి దేవుడా!’ అని మనసులో అనుకొ...