రాశిఫలాలు - జులై 01, 2025

 


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో బాగానే లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే ఉద్యోగావకాశం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. విలాసాల మీద ఖర్చు తగ్గించడం మంచిది. ఆర్థిక సమ స్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురో గతి ఉంటుంది. ఆస్తి వివాదం విషయంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభ వార్త వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. హోదా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహక రంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా చక్కబెట్టుకుంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది కొన్ని అవసరాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని ధన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగి పనిభారం తగ్గుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల ద్వారా శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక విషయాలకు, ప్రయత్నాలకు రోజంతా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు కొన్ని నిరాటంకంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

శుభ గ్రహాలు బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. రావలసిన సొమ్మును రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక నష్టాలు, సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం వల్ల పని ఒత్తిడి, పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 
9542665536

#rasiphalalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025