శుక్ర కేతువులు-వివాహ జీవితం


 

శుక్ర కేతువులు-వివాహ జీవితం

జాతకంలో విడిగా ఉన్న గ్రహం ఫలితాలు ఒకరకంగాను, ఏవైనా రెండు గ్రహాలు కలయిక వలన ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాయి. దీనిలో భాగంగా శుక్ర భగవానుడు కేతువు ఈ రెండు గ్రహాల కలయిక వలన జరిగే ఫలితాలు. శుక్ర కేతు కలయిక వలన సన్యాసి యోగం వస్తుందని, దేశాటన చేస్తారని స్థిరమైన జీవితం ఉండదని, లేదా వివాహ జీవితం పాడవుతుందని చెబుతూ ఉంటారు. కానీ అన్ని సందర్భాలలోనూ ఈ విధమైన ఫలితాలు రావు. మొదటగా శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని పరిశీలించగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని, లగ్జరీ లైఫ్ కావాలని, కొద్దిగా స్వార్ధబుద్ధితోను, మితిమీరిన కామం, స్త్రీవ్యామోహం, ఈ విధంగా ప్రపంచంలోని అన్ని సుఖాలు అనుభవించాలనే కోరికని ఇస్తారు. అయితే జాతకంలో శుక్రుడు ఉన్న స్థానాన్ని ఆధారంగా పై ఫలితాలు నిర్ణయించాలి. కేతువు ఇచ్చే ఫలితాలు వేరే ఉంటాయి. కేతువు మోక్షకారక గ్రహం ఈ జీవితానికి ఇది చాలు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు కష్టపడినా ఇంతకుమించి దొరకదు ఉన్నదానితోనే తృప్తి పొందుదాము అనే ఫలితాలను కేతువు ఇస్తాడు. శుక్ర కేతువులు కలిసిన ప్రతి స్థానంలోనూ కూడా చెడు ఫలితాలను ఇవ్వరు. శుక్రుడికి కొన్ని బలమైన స్థానాలలో అనగా  వృషభం, మిధునం, కర్కాటకం కన్య, తుల, మీనం ఈ స్థానాలలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నప్పుడు జీవితంలో అనేక సుఖసౌఖ్యాలు, ధనము, అన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. జీవితంలో చిన్న చిన్న చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ ఆర్థికంగా మంచి సౌఖ్యాలను పొందుతారు. వైవాహిక జీవితం, ఆర్థిక అభివృద్ధి ,స్త్రీ లాభం అన్ని రకాల సంతోషాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మంచి జ్ఞానంతో నిదానంగా అనుభవిస్తారు. ఇదేశుక్రకేతువులు మేషం, సింహం ,వృశ్చికం, ధనుస్సు మకరం, కుంభం ఈ స్థానాలలో ఉంటే కేతువు బలం పొందుతాడు. శుక్రుడు బలహీనమవుతాడు ఈ కారణంగా వైవాహిక జీవితం అస్తవ్యస్తంగానూ, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి అన్ని సుఖ సౌఖ్యాలు దూరం అవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం రెండు లేదు మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడం తెలిసిన వాళ్ల ద్వారా నమ్మక ద్రోహానికి గురి అవ్వడం మానసిక  క్షోభ, కుటుంబానికి దూరంగా దేశాంతరం వెళ్లడం వంటివి జరుగుతాయి. శుక్రుడు పాపగ్రహ స్థానాలలో ఉన్నప్పుడు కేతు బలం పొందుతాడు అప్పుడు శుక్ర భగవానుడు ఇచ్చే భౌతిక  సుఖాలకు దూరమవుతారు.ధనుస్సు శుభగ్రహ స్థానం అయినప్పటికీ ఇక్కడ శుక్రుడు బలహీనమవుతాడు కేతువు బలం పొందుతాడు. ఒక్క శుభగ్రహ స్థానమైన ధనుస్సులో మాత్రమే శుక్ర కేతువులు కలయిక అనేక నష్టాలకు దారితీస్తుంది. మిగిలిన శుభగ్రహ స్థానాలలో శుక్రుడు బలం పొందుతాడు కేతువు బలహీనమవుతాడు. అప్పుడు అన్ని ఐహికసుఖాలను జాతకుడు పొందుతాడు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025