పితృ దోషం
పితృ దోషం
వేద జోతీష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మ కుండలిలో కొన్ని గ్రహాల స్థితి కారణంగా పితృధోషం ఉన్నట్లు గుర్తించవచ్చు. పితృధోషానికి ముఖ్య కారణం జన్మకుండలిలో రవి గ్రహం మరియు శని గ్రహములకు మధ్య ఉన్న సంబంధం గా చెప్పవచ్చు. రవి శని గ్రహాలు పరివర్తన చెందితే ( రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి) ఉంటే దానిని పితృధోషముగా గుర్తించాలి. రవి శని ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేక రవి, శని కలిసి ఒకే భావంలో ఉన్నప్పుడు జాతకునికి పితృధోషం ఉన్నట్లు గుర్తించాలి. ఇక్కడ రవి, శని సంబంధం లాగానే జాతకం లో గురు, బుధ గ్రహముల వలన కలిగే సంబంధం కూడా పితృధోషం ను సూచిస్తుంది. కాకపోతే గురు, బుధ వలన కలిగే పితృధోషం ఎక్కువ ప్రభావం చూపదు.
హైందవ పురాణాల ప్రకారం మన పితృదేవతలు ( గతించిన తండ్రి, తాత, ముత్తాత) జీవించి ఉన్నప్పుడు చేసిన దోషములు, పాపాలు శాపంగా మారి తర్వాతి తరం వారికి కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని పితృధోషం అని అంటారు. నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాప పుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లోకంలో కొన్ని కోట్ల ఆత్మలకు శాంతి కలుగలేదు. ఆ ఆత్మలు అందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులు అయే ఉంటారు. పూర్వీకులు గతించిన తర్వాత అటు మోక్షం పొందక ఇటు ఇంకో జన్మ ఎత్తి పాప ప్రక్షాళన చేసుకోలేక ఊర్థ్వలోకంలో ఉన్నవారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలు మన DNA రూపంలో గోత్రమును కొనసాగిస్తూ, కుటుంబం లోని మగవారిలో y chromosomes ( క్రోమోజోమ్) రూపంలో ఉంటారు. మన ఆరాలో కూడా పొసిస్ అయి ఉంటారు......
ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషం వలన బాధపడతాడో, ఆ వ్యక్తి తర్వాతి తరమును ( కొడుకు, మనుమడు) చూచుటకు కష్ట తరం అవుతుంది. ఆ వ్యక్తి కి సంతానం కలగకపోవడం లేక తన సంతానం తన నుంచి వీడిపోవడం లేక వంశాభివృద్ది కలిగే పుత్ర సంతానం కలుగకపోవడం లాంటి పితృధోషం ఉన్న వారు అనుభవించాల్సి వస్తుంది.
పితృధోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావాలు :
పితృదోషం ఉన్న వ్యక్తి తన గొత్రాన్ని కొనసాగించడానికి పుత్ర సంతానం కలగదు
పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ గర్భవిచ్చితులు జరగటం
సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వచ్చి వీడిపోవడం
పితృదోషం ఉన్న వారి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండానే విద్యను లేక ఉద్యోగాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ఆపివేసి రావడం.
వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవడం.
వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరక్కపోవడం.
పితృదోషం ఉన్న వారి సంతానం అతి చిన్న వయసులోనే మధ్యానికి లేక డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు చేసుకుని జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటారు.
శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగిన సంతానానికి జన్మనివ్వడం జరుగుతుంది.
పితృదోషం ఉన్న వారి ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడం, కొత్త గోడలకు తొందరగా చీలికలు రావడం. నీటి పంపులు లీకేజీ రావడం, కుళాయిలోని నీరు కారుతూనే ఉండటం తరచూ జరుగుతాయి.
పితృదోషం ఉన్న వారి వ్యాపారంలో అప్పులు, నష్టములు కలగటం, తన కింద పనిచేసే వారు కూడా చిన్న చూపు చూడటం జరుగుతుంది.
పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఉద్యోగం మారుతూనే ఉండటం లేదా ఉద్యోగమే లేకపోవడం జరుగుతుంది.
వారి సంతానం పెద్ద వారిని గౌరవించక, అతి దురుసుతనంగా మాట్లాడటం జరుగుతుంది.
ఇంట్లో తరచూ చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి.
పీడ కలలు రావడం జరుగుతూ ఉంటుంది.
ఇంట్లో శుభ్రత ఉండదు.
జాతక చక్ర పరిశీలనలో చూడాల్సిన అత్యంత ప్రధాన అంశాలు దోషాలు, శాపములు, అవయోగాలు, అరిష్టాలను కలగ చేసే పితృశాపం.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #pitrudosham #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి