యే యే నగరాలను, ఏకడెక్కడ, ఎవరెవరు నిర్మించారో తెలుసా?
యే యే నగరాలను, ఏకడెక్కడ, ఎవరెవరు నిర్మించారో తెలుసా?
* కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
* భాగవతం, మహాభారతం మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం, నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం, దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం)-కేరళ, కర్ణాటక, మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ, సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక, గుజరాత్ హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్(ఆదిత్యయోగీ)
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం, దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్, రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య గాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్...
* భావి పౌరుల భవిష్యత్తు, జీవిత భవనానికి బాల్యం, విద్యాభ్యాసం పునాది లాంటివి. దాని ప్రాధాన్యత తెలిసిందే. కనుక అందుకు సంబంధించి పేరెంట్స్ బాధ్యతే అధికం. అందుచేత పిల్లల భవిష్యత్తు విషయంలో తమ ఆశలు ఆశయాలు అంచనాల ఊహలకంటే ముఖ్యంగా విద్య విషయంలో పిల్లల వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మంచి పౌరులను తయారించాలి. విషయ జ్ఞానం, మానవత్వం, నైతికతతో పాటు ఉపాధి ప్రాధాన్యత గల విద్యాభ్యాసం ఉండాలి...
* జీవిత వాస్తవిక అవగాహన వారికి కలగాలి. మంచి మనసు తయారీకి బాల్యమే సరియైనది. జీవన జీవిత బంధం అలాంటిది. మంచి మనసు మంచి మనిషితో కుటుంబం సమాజం శిష్టతే సుమా!.
* "ఏకతా పరిపూర్ణతలో, భిన్నతాయోగీకరణకు సంబంధించి, జ్ఞాన ప్రస్థాన అవగాహన అవసరమని, విశ్వంబీజం, మదర్ న్యూక్లియస్, ప్రణవనాదం, శాశ్వత చేతన చలనయోగాల జ్ఞానాన్ని మనిషిగా ప్రతి ఒక్కరూ పొందాలని విశ్వ చైతన్య శంఖాన్ని పూరించిన విశ్వ చైతన్య గురు మండలం.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి