స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది.
స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లోకి రాలేదు!
కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
(కామందక నీతిశాస్త్రం)
1. కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!
2. కరణేషు దక్షః :
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.
3. రూపేచ కృష్ణః:
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
4. క్షమయా తు రామః:
ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
5. భోజ్యేషు తృప్తః:
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా)భుజించాలి.
6. సుఖ దుఃఖ మిత్రం:
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి