పరివర్తిని ఏకాదశి విశిష్టత.. పూజా విధానం
పరివర్తిని ఏకాదశి విశిష్టత.. పూజా విధానం : యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnu) భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతారని చెబుతారు. ఇలా విష్ణుమూర్తి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని అంటారు. ఈసారి పరివర్తిని ఏకాదశి 2025 ఎప్పుడు, విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
పరివర్తిని ఏకాదశిని హిందూ మతంలో విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ పరివర్తిని ఏకాదశిని ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షం 11వ రోజు ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు. శ్రీమహావిష్ణువు దేవశయని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్లి.. భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరో వైపుకి తిరిగి నిద్రపోతాడని చెబుతారు. అందుకే దీన్ని పరివర్తిని ఏకాదశి (Parivartini Ekadashi) అని లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పరివర్తిని ఏకాదశి ఉపవాసం వ్రతం ఆచరిస్తే.. మంచి ఆరోగ్యం, సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని, సంకల్ప శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు.
ప్రతి ఏకాదశిలాగానే ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాస పూజలు ఆచరిస్తారు. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈసారి 2025 సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 04:53 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై.. సెప్టెంబర్ 4వ తేవీ ఉదయం 4:21 గంటలకు ముగియనుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీన పరివర్తిని ఏకాదశి పండుగ జరుపుకోవాలి. ఈ ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి చెప్పినట్లు పండితులు చెబుతారు. ఈ పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం విశేషమైన పూజా ఫలితం లభిస్తుందని నమ్ముతారు.
పరివర్తన ఏకాదశి 2025 పూజా విధానం
ప్రతిసారి వచ్చే ఏకాదశిల మాదిరిగానే ఈ పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్ష పాటిస్తారు. ఈరోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే వారు రోజంతా ఉపవాసం ఉండాలి. శ్రీలక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో, చేమంతులతో పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటివి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి దగ్గర్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి. ఇక పరివర్తిని ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీవిష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వేల రెట్లు ఫలితం ఉంటుందనేది శాస్త్రవచనం.
పరివర్తన ఏకాదశి పూజా ఫలం
పరివర్తిని ఏకాదశి రోజు ఆగిపోయిన పనులు పూర్తికావాలంటే ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడిని పూజించాలి. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయని విశ్వాసం. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే పరివర్తన ఏకాదశి వ్రతాన్ని శాస్త్రంలో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే రకరకాల కారణాల వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని కూడా మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు శివపార్వతులను, వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #parivartiniekadashi #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి