క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా.


క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా.

సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు.

ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు.

పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది.

అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు.

ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు.

అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే.

సాధారణంగా ప్రతి వృక్షం భూమినుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది.

ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు.

అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేల పై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి.

ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణంలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదని చెప్పవచ్చు.

పారిజాత పుష్పాలు 9రకాలు 

1.ఎర్ర(ముద్ద)పారిజాతం  

2.రేకు పారిజాతం  

3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)  

4.పసుపు పారిజాతం  

5.నీలం పారిజాతం  

6.గన్నేరు రంగు పారిజాతం 

7.గులాబీరంగు పారిజాతం 

8.తెల్లని పాలరంగు పారిజాతం 

9.ఎర్ర రంగు పారిజాతం 

ఎరుపు రంగు పారిజాతంతో విష్ణువును ఆరాధించరాదు. ఎరుపు తమోగుణం విష్ణువు సత్వగుణం.  పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి. చెట్టు నుండి కోసి వాడరాదు.  పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.  రంగు, వైశాల్యం, గుణం, దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.  

ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు. ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.  భూ స్పర్శ, మృత్తికా (మట్టి) స్పర్శ జల స్పర్శ హస్త స్పర్శ తరువాత స్వామి స్పర్శ. ఈ 5 స్పర్శల తోను పంచ మహా పాతకాలను పోగొట్టేదే పారిజాతం.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025