ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు...
ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు...
ఒక అడవిలో కుందేలు ఒకరోజు ఏనుగుని దాని భారీ శరీరం చూసి బిత్తరపోయింది, దాని చేటంత చెవులు, స్తంభాల్లాంటి కాళ్లు చూసి దాని ఆశ్చర్యానికి అంతేలేదు...
పొదల చాటుకెళ్లి దాక్కోవడం కూడా మరిచిపోయి నోరు తెరిచి చూస్తున్న ఆ బుజ్జి కుందేలును ఏనుగు గమనించింది...
చూపులకే మెత్తగా ఉన్న ఆ తెల్లని రూపాన్ని ఏనుగు కూడా ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయింది...
సుతిమెత్తగా ఉన్న ఆ కుందేలును ఏనుగు సుతారంగా తొండంతో ఎత్తి తన వీపుపై ఉంచుకుంది, ఆ చుట్టుపక్కలంతా షికారు తిప్పింది...
రోజూ తనకి కొండమీదున్నట్లు ఎత్తుగా కనిపించే చెట్ల మీద కోతులు తన ఎత్తులో ఉండటంతో కుందేలు కేరింతలు కొట్టింది.
అంత ఎత్తు నుంచి కిందికి చూడటం దానికి భలే వింతగా, గమ్మత్తుగా ఉంది.
ఏనుగు ప్రోత్సాహంతో అది కొమ్మనున్న కాయకోసి తింది, తర్వాత కుందేలును బొరియ వద్ద దింపి ఏనుగు వెళ్లిపోయింది...
అది మొదలు వాటి స్నేహం కొనసాగింది...
రోజూ కలిసి ఆడుకునేవి. ఒక రోజు కుందేలు దాగుడుమూతలు ఆడదామని సరదాపడింది...
ఏనుగుని కళ్లుమూసుకోమని ఒక పొదలో దాగింది...
ఏనుగు ఒక్కోపొదని మెల్లిగా ఒత్తిగిస్తూ కుందేలుని కనుక్కుంది.
అప్పుడు కుందేలు ఏనుగుని దాక్కోమంది, పాపం ఏనుగు తెల్ల మొహం వేసింది...
తను దాక్కోగల ప్రదేశమేదీ దానికి తోచలేదు.
కాదని కుందేలును బాధపెట్టడం దానికిష్టం లేకపోయింది.
వెళ్లి ఒక చెట్టు వెనక నుంచుంది, కళ్లు తెరిచిన కుందేలు ఏనుగు ఒళ్లు సగం బయటకే కనబడుతుండటంతో పకపకా నవ్వింది, దాని ఆనందం చూసి ఏనుగు సంతోషించింది...
మంచి చోటు వెతుక్కోమని కుందేలు పోరడంతో ఏనుగు దూరంగా వెళ్లింది.
ఒక గుహ చూసింది, బాగుంది కానీ అందులో సింహం ఉండొచ్చని అనుమానించింది, ఇంతలో వెదురుపొదలు కనిపిస్తే వాటి వెనుక దాగింది...
ఏనుగును వెతుకుతూ వచ్చిన కుందేలు కూడా గుహని చూసింది...
అందులో దాక్కుందేమోనని అటుగా వెళ్లబోయింది, దానిని ఏనుగు వారించేలోపే నక్క ఆపింది...
‘అందులో సింహం ఉంది, వెళ్లకు’ అంది , పైగా మెల్లిగా ‘ఆ మాయదారి ఏనుగు తను గుహలో దాక్కున్నానని నీకు చెప్పమంది, తెలుసా?’ అంది...
కుందేలు ఎంతో స్థిరమైన గొంతుతో స్నేహం అంటే నమ్మకం.
నాకది నా స్నేహితుడిపై పూర్తిగా ఉంది, మా చెలిమి చూసి ఓర్వలేక అసూయతో నువ్విలా అంటున్నావు... అంది...
వెదురు పొదలచాటు నుంచి ఈ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు కార్చింది...
కోపంతో ఘీంకరిస్తూ నక్కను చంపబోయింది, దానిని కుందేలు వారించింది, నక్క పారిపోయింది...
ఏనుగు కుందేలు కలిసి అడవంతా తిరిగి ఆనందించాయి...
లోకయాత్రా భయం
లజ్జా దాక్షిణ్యం ధర్మశీలతా
పంచ యస్మిన్ నవిద్యతే
నకుర్యాత్తేన సద్గతిం...
లోకంలో ఎలా వ్యవహరించాలో తెలీనివారు, సిగ్గు, భయం, దయ, ధర్మబద్ధత లేనివారు - ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు...
తెలివైన శత్రువు కంటే తెలివితక్కువ మిత్రుని వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అంటారు.
అలాగే పైన చెప్పిన ఐదు లక్షణాల వ్యక్తులతో కలసిఉంటే మంచి జరక్కపోగా హాని జరగడం కచ్చితం...
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి