రేపు మహాలయ అమావాస్య , శుభ ముహుర్తం , పూజా విధానం , విశిష్టత
రేపు మహాలయ అమావాస్య , శుభ ముహుర్తం , పూజా విధానం , విశిష్టత
ఈసారి అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభ ముహుర్తం ఎప్పుడు.. ఏ సమయంలో పూజలు చేయాలి.. ఎవరిని ఆరాధించాలి.. ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చివరి రోజున మహాలయ అమావాస్య వస్తుంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21 వ తేదీన అమావాస్య వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో పూర్వీకులు భూ లోకానికి వస్తారని చాలా మంది నమ్ముతారు. ఆ మరుసటి రోజే అశ్విజ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన దుర్గా మాత భూ లోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది చాలా మంది విశ్వాసం. అందులోనూ ఈసారి అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస్య రోజు శుభ ముహుర్తం ఎప్పుడు.. ఏ సమయంలో పూజలు చేయాలి.. ఎవరిని ఆరాధించాలి.. ఈ మహాలయ అమావాస్య ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ ముహుర్తం
ఆ వెంటనే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గా దేవి భూ లోకంలో అడుగుపెడుతుందని పండితులు చెబుతారు.
విజయ ముహుర్తం :
పూజా విధానం
ఈ పవిత్రమైన రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి. పూజ చేసే సమయంలో దక్షిణం వైపు మీ ముఖం పెట్టి కూర్చోవాలి. ఆ తర్వాత రాగిపాత్రలో గంగాజలం తీసుకుని , అందులో నల్ల నువ్వులు , పచ్చి పాలు , కుసాలను కలపాలి. ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలి. ఈరోజు తయారు చేసే ఆహారాన్ని ఐదు భాగాలు చేసి ముందుగా దేవుడికి , తర్వాత గోమాత , శునకం , చీమ , కాకులకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
మహాలయ అమావాస్య ప్రాముఖ్యత
మహాలయ అమావాస్య రోజున పితృ పక్షాలు పూర్తవుతాయి. పితృ పక్షాల్లో ఇది చివరి రోజు కాబట్టి ఈరోజున నువ్వులు , కుశ గడ్డి కలిపిన నీటితో పితృ దేవతలకు పిండాలను చేసి తర్పణం , శ్రాద్ధం నిర్వహిస్తారు. ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకుల నుంచి అనుగ్రహం లభించినట్టేనని నమ్ముతారు. అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైతే చనిపోయిన వ్యక్తులుంటారో.. వారు ఏ తిథిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధం నిర్వహిస్తే వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెబుతారు.
మహాభారతంలోనూ ఈ అమావాస్య ప్రస్తావన..
మహాభారతంలోనూ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం , కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది. అప్పుడు తను ఓ నది దగ్గరకు వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒకచోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్లగా అవి కూడా బంగారంగా మారిపోతాయి.
సూర్య దేవుని ప్రార్థన
ఈ విచిత్ర సంఘటనలను చూసి తన తండ్రి అయిన సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు. ‘నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు. అయితే ఏరోజు పితృ దేవతలకు అన్నదానం , శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయని’ సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు , శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరతాడు.
ఇంద్రుని సహాయంతో
అప్పుడు కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృ దేవతలందరికీ తర్పణాలు , శ్రాద్ధ కర్మలు , అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్లాడు. ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి. అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),
MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
#mahalayapaksham #amavasya #poojamuhurtam #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి