నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట…

 



నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట…

దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే…   ఈ ‘మన పాట’ ఆనాటివారికి గుర్తుకు రావలసినదే..!

ఇదే ఆ దసరా పాట…

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!  చేతిలో లేదనక ఇవ్వలేమనక !!తగదు!

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!    రేపురా మాపురా మళ్ళి రమ్మనక!!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

పావలా బేడైతె పట్టేది లేదు అర్థరూపాయైతె అంటేది లేదు ముప్పావలైతేను ముట్టేది లేదు రూపాయి ఐతేను చెల్లుబడి కాదు! హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!  జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!        మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!జయీభవ విజయీభవా.      దిగ్విజయీభవా!!

దసరా పండుగను గిలకల పండగంటారు. చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లంబులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ, కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచార మిది.

ఒక వ్యక్తి అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.

ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి   నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు. వెలుగుతున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతకడానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.

దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.

పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.

ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు!

ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో…!

దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.

ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కుఱుక్షేత్రంలో విజయులే.

అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.

ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది. తిరిగి నిలబెడదాం మన సంస్కృతి సంప్రదాయాలను..!

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025