ధాత్రి నవమి


ధాత్రి నవమి 

నేటి రోజునకు

అక్షయ నవమి అనే పేరు ఉన్నదని తెలుసా?

అదేమిటండి? అక్షయ తృతీయ తెలుసు ఈ అక్షయ నవమేమిటంటారా?

పైగా ఈ రోజునకు

ఆమలక (ధాత్రి) నవమని,  కుష్మాండ నవమని ఇలా వివిధ పేర్లు కూడా కలదని తెలుసా? 

గొప్ప పర్వదినమైన నేడు

ఏ దేవతను ఏ పేరుతో పూజించాలో? 

నేటి విశేషాలేమిటో?

వాటినన్నింటినీ తెలుసుకుని

శక్తి వంచన లేకుండా  ఆచరించి ఆనందిద్దాం తరిద్దాం.

అమాలక నవమి' యొక్క గొప్పతనాన్ని 'పద్మ పురాణం' మరియు 'స్కాంద పురాణం' లో పేర్కొన్నారు.

పురాణాల ప్రకారం, 'సత్య యుగమని అందరిచే కీర్తింపబడే కృతయుగం ప్రారంభమైనది కార్తీక శుద్ధ నవమి నాడే. 

కనుక ఈనాడు స్నానం దానం అర్చన అనుష్ఠానం,ఇలా ఏ పుణ్యకార్యం చేసిన అక్షయ పుణ్య ఫలం లభిస్తుంది... కనుక ఈ నవమికి 

 అక్షయ నవమనే వ్యవహారం వొచ్చెను.   

పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు 'కుష్మాండుడు' అనే రాక్షసుడిని ఓడించి  అధర్మ వ్యాప్తిని అడ్డుకున్నాడు.

కాబట్టే అక్షయ నవమిని 'కుష్మాండ నవమి' గా కూడా ప్రసిద్ధికెక్కినది .

పశ్చిమ బెంగాల్లో, ఈ రోజును జగద్ధాత్రి పూజ అని కూడా పిలుస్తారు. 

ఈ రోజున జగదంబను 

ధాత్రి వృక్ష (ఉసిరి చెట్టును) రూపంలో జగధాత్రిగా పూజిస్తారు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో 'పరబట్ ఫేరీ', అనే పేరుతో ఉత్సవంగా

సూర్యదేవుడిని, దుర్గా దేవిని ఆరాధిస్తారు.

బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో తపస్సు చేసి కళ్ళు తెరవగానే ఆయన నేత్రముల నుంచి  వొచ్చిన ఆనందబాష్పాలు రాలినాయి. 

అందు నుంచి ధాత్రి (ఉసిరి) వృక్షం వొచ్చినది....ఈ రోజే కనుక నేడు ఆమలక నవమి అని ప్రసిద్ధికెక్కిందని ఐతిహ్యం.  

ఈ రోజున ఉసిరి చెట్టు కింద ఆహారాన్ని వొండి తినటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 

ఈ ఆచారం మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

ఉసిరి చెట్టుకి పూజ ఎలా చేయాలి ?

కార్తీక శుద్ధ నవమి నాడు ఆమలక (ఉసిరి) చెట్టు చుట్టూ శుభ్రం చేసి 8 వైపులా అష్టదళ పద్మాలులా ముగ్గులు వేసి గోపాదుక ముద్రలు వేసి, శంఖ, చక్రాలు పెట్టాలి,

 8 వైపులా దీపలు పెట్టాలి . 

పద్మపురాణం  ప్రకారంగా అయితే 108 ప్రదక్షిణాలు చేయాలి. కనీసమ్ 8 ప్రదక్షిణాలైనా చేయాలని ఉంటుంది. 

 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆమలక (ఉసిరి) వృక్షం

చుట్టూ ఎర్రని దారంతో తోరబంధానం చేయమని చెపుతారు. 

చెట్టుకి తోరం కట్టేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదువవలెను.

శ్లో.ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి!

పుత్రాన్ దేహి మహాప్రజ్ఞా, యశోదేహి బలంచమే!!

 శ్లో.ప్రజ్ఞాం,మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం!

నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా!!

తాత్పర్యం:- ఓ ధాత్రీదేవి! నీకు నమస్కారము. మా పాపములను పోగొట్టి పుత్రులను, యశస్సును, బలమును, ప్రజ్ఞ, మేధ, సౌభాగ్యాన్ని శాశ్వతమైన విష్ణు భక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించుము.

ఉసిరి చెట్టు నీడలో దీపమ్ పెట్టండి, కానీ కొమ్మలు కాలే లాగ కాకుండా దూరంగ పెట్టండి. 

ఆమ్లా నవమి కి ఆమల (ఉసిరి చెట్టు) వృక్షం యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది.

ఈనాడు ఉసిరి చెట్టు మూలంలో....శ్రీ తులసి,ధాత్రి సహిత లక్ష్మి నారాయణులను, పరమేశ్వరుని పూజించిన పిదప బ్రాహ్మణులకు ఉన్నితో చేసిన వస్త్రాలు, గోవులు మొదలగునవి దానాలు చేసి. 

అక్కడే భోజనాలు పెట్టి దక్షిణాతాంబూలాలను అర్పించి. 

వారి శుభాశీస్సులు పొంది. అనంతరం తాము కూడా ఆ ఉసిరి చెట్టు నీడలోనే భోజనం చేయాలనే జనశృతికి ఓ పురాణ కథనం కూడా ప్రచారంలో ఉన్నది.

 భూలోకంలో

విష్ణువును, శివుడిని ఏకకాలంలో పూజించాలని భావించి  వచ్చిన శ్రీమహాలక్ష్మీదేవి...

 తులసి వృక్షం విష్ణువుకు, శివునికి ప్రియమైన బిల్వ (మారేడు) వృక్షాల రెంటికీ సంకేతంగా... బ్రహ్మదేవుని కంటినీటి నుంచి ప్రాదుర్భవించిన ఉసిరి చెట్టు నీడలో  శివ,విష్ణువులను పూజించినది... సరిగ్గా  ఉత్థాన ఏకాదశికి రెండు రోజుల ముందు వొచ్చే కార్తీక శుద్ధ నవమి నాడే పూజించెను గనుక.

 ఈ ఆమలక నవమి నాడు ఉసిరి చెట్టు క్రింద సశక్తిసమేతంగా శంకర, నారాయణులను  పూజించినవారికి మహాపుణ్యఫలము లభిస్తుందని ఐతిహ్యం ఏర్పడినది.

-:మరొక పురాణగాధ:-

ఓ దంపతులకు చాలా కాలం సంతానం లేకపోవడంతో భార్య తనకు ఎలాగైనా సంతానం కలగటానికి మార్గం చెప్పమని. ఓ క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిని  సలహా అడుగగా. అతను భైరవుడికి ఓ పసి బాలుడిని బలి ఇస్తే సంతానం కలగుతందని చెప్పగా.. ఆమే అలాగేనని వీధిలో ఆడుకునే ఓ..పసిబాలకుణ్ణెవరినో.... దొంగతనంగా ఎత్తుకొచ్చి.... భైరవుడికి బలి ఇస్తుంది. 

అటు తర్వాత ఆమెకు ఓ మగపిల్లవాడు కల్గినా... తనకు కుష్టు రోగం వొస్తుంది. 

ఆ బాధతో తాను పిల్లలు కల్గటం కొరకు తాను చేసిన పాపాన్ని భర్తకు చెప్పగా ఆ పాప నిష్కృతికి గంగా స్నానం చేస్తూ... పుణ్య వృక్షాలకు ప్రదక్షిణలు చేయమని భర్త సూచించాడు. 

ఆ పనిని భక్తి శ్రద్ధలతో ఆమే చేస్తూ ఉండగా... ఒకనాడు అమ్మవారు ఆమెకు ఓ వృద్ధనారీరూపంలో కనిపించి... ఓ అమ్మాయీ వొచ్చే

 కార్తీక శుద్ధ నవమి నాడు.  

 ధాత్రి (ఉసిరి) వృక్షానికి ఎర్రని దారం చుడుతు ప్రదక్షిణలు చేసి అక్కడే దానధర్మాలు ఆచారించి బ్రాహ్మణులకు భోజనాలు అర్పించి ఆ శేషం  స్వీకరించమని ఆదేశమివ్వగా.

 అలాగే ఆమె ఆచరించగా తనకు కుష్టు రోగం పోయి పూర్తి ఆరోగ్యవంతురాలగును.

కాబట్టి ఈనాడు ఆమలక (ఉసిరి చెట్టు) మూలమున అర్చనాదికములు అనుష్ఠించిన వారికి సత్సంతాన, సౌభాగ్య, సంపత్ప్రదమగునని జనశృతి ఏర్పడినది. 

ఇటువంటి అమోఘమైన పురాణ ప్రాశస్త్యం గల ఈ అక్షయ (ఆమలక) నవమి ఇంతవరకు ఎక్కువ ఉత్తరాది వారే ఆచరిస్తున్నప్పటికీ ఈ విశేషాలను మనమూ తెలుసుకున్నాము కాబట్టి.

ఇకనుంచి మనం కూడా పైన చెప్పిన విధివిధానాలను అందరికీ తెలిపి వాటిని మనందరమూ యథాశక్తిగానైనా ఆచరించి భగవదనుగ్రహంతో సర్వశ్రేయస్సులు పొందుదాం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు