నవ గ్రహ దోషాలు పోగొట్టే నవ జనార్ధన క్షేత్రాలు
నవ గ్రహ దోషాలు పోగొట్టే నవ జనార్ధన క్షేత్రాలు
గోదావరి నదికి తూర్ప తీరాన గల జనార్ధన ఆలయాలల్లో తొమ్మిది ఆలయాలు లోక ప్రసిద్ధి చెందినాయి. వీటిని నవ జనార్ధన క్షేత్రాలుగా పిలుస్తారు. ఇవి మహా విష్ణువు కంకితమైన నవ గ్రహ స్ధానములుగా ప్రతీతి. నవ గ్రహ దోషములు నుంచి విముక్తిని పొందుటకు భక్తులు నవ జనార్ధన క్షేత్రాలును దర్శించుతారు.
సాధారణంగా శైవాలయం నందు నవగ్రహ మండపం ఉంటాయి. నవ గ్రహ దోషములు నుంచి విముక్తి కోసం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. వైష్ణ్వాలయంలో నవగ్రహ మండపం చాల అరుదుగా ఉంటాయి. కాబట్టి
శ్రీవైష్ణువులు మరియు విష్ణువును ఆరాధించిన వారు నవ గ్రహ దోషములు నుంచి విముక్తి కోసం మహా విష్ణువుకు
అర్చనలు జరుపుతారు. జాతక చక్రం నిపుణలు విష్ణ్వాలయం నందు జరుపు నవ గ్రహ అర్చనలు ఉత్తమైనవి అని చెప్పుచుంటారు.
గోదావరి నదీ తీరాన గల నవ జనార్ధన క్షేత్రాలు
1. ధవళేశ్వరం - శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి
2. మడికి - శ్రీ జనార్ధన స్వామి
3. జొన్నాడ - శ్రీ జనార్ధన స్వామి
4. ఆలమూరు - శ్రీ జనార్ధన స్వామి
5. మండపేట - శ్రీ జనార్ధన స్వామి
6. కపిలేశ్వరపురం - శ్రీ జనార్ధన స్వామి
7. మాచర - శ్రీ జనార్ధన స్వామి
8. కోరుమిల్లి - శ్రీ జనార్ధన స్వామి
9. కోటిపల్లి - శ్రీ సిద్ధి జనార్ధన స్వామి
ఒకప్పుడు తొమ్మిది ఆలయాలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉండేవి. జిల్లా పునర్ వ్యవస్ధీకరణములో తూర్పు గోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించినారు. కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం (తూర్పు గోదావరి జిల్లా)
మినహయించి మిగిలన ఆలయాలు కోనసీమ జిల్లా పరిధి లోనికి వస్తాయి.
మహావిష్ణువుకు వైశాఖ మాసం ప్రీతి. నవ జనార్ధన క్షేత్రాలు వైశాఖ మాసంలో సందర్శించుట పుణ్యధాయకం.
నవ జనార్ధనలు దర్శిస్తే అయురారోగ్య, సకల ఐశ్వర్యాలు సమకూరుతాయనేది భక్తుల విశ్వాసం. స్వామి అనుగ్రహముతో నవగ్రహములు శాంతించి, సుఖశాంతులు కలుగుతాయి. ధనుర్మాసం నందు రాజమండ్రి APSRTC Depot మరియు కాకినాడ డిపో వారు '" నవ జనార్ధన పారిజాత దివ్య దర్శని" అను టూర్ సర్వీసులు ప్రత్యేకముగా నాలుగు ఆదివారములు నిర్వహించుచున్నారు.
ఆంధ్రనాట్యం రూపకర్త నటరాజ రామకృష్ణ గారి అపూర్వ సృష్టి అయిన నృత్య ప్రదర్శనలు "నవ జనార్దన పారిజాతం" గా లోక ప్రసిద్ధి చెందినాయి.
యాత్రికులు మీ సమయం బటి మిగిలన మాసములల్లో కూడ నవ జనార్ధన యాత్ర చేయుటకు బస్సులు/టాక్సీలు/ఆటోలు దొరుకుతాయి.
1. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం నకు బస్సులు/షేరింగ్ ఆటోలు ఉంటాయి.
ధవళేశ్వరం బస్ స్టాండ్ కు సుమారు 2 Kms. దూరాన (జొన్నాడ వైపు) శ్రీరామ పాదాల రేవు ముఖద్వారం ఉంటుంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి.
ముఖద్వారం నకు సుమారు ఒక కీ.మీ లోపలకి శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం చిన్న కొండ పైన ఉంటుంది.
2. శ్రీరామ పాదాల రేవు ముఖద్వారం నుంచి మడికి రేవుకు బస్సులు/షేరింగ్ ఆటోలు ఉంటాయి.
మడికి రేవు కు సుమారు ఒక కీ.మీ లోపలకి మడికి గ్రామం కలదు. ఇక్కడ శ్రీ జనార్ధన స్వామి దర్శనం దొరుకుతుంది.
3. మడికి రేవు నుంచి జొన్నాడ సెంటర్ కు బస్సులు/షేరింగ్ ఆటోలు ఉంటాయి.
రావలపాలెం - కాకినాడ రోడ్డు మార్గం మరియు రాజమండ్రి - రావలపాలెం రోడ్డు మార్గం జొన్నాడ సెంటర్ వద్ద విడిపోతాయి.
జొన్నాడ సెంటర్ కు సుమారు 2 Kms. దూరాన (లోపలకి) జొన్నాడ గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ జనార్ధన స్వామి దర్శనం దొరుకుతుంది.
4. జొన్నాడ సెంటర్ నుంచి ఆలమూరు కు బస్సులు/షేరింగ్ ఆటోలు ఉంటాయి. ఆలమూరు బస్ స్టాప్ కు కొంత ముందుగా శ్రీ జనార్ధన స్వామి బస్ స్టాప్ వస్తుంది. (రథం వీధి)
రోడ్డు కు కొంత లోపల ఆలయం ఉంటుంది. రావలపాలెం - కాకినాడ రోడ్డు మార్గంలో ఆలమూరు, మండపేట ఉన్నాయి.
5. ఆలమూరు నుంచి మండపేట కు బస్సులు/షేరింగ్ ఆటోలు ఉంటాయి. మండపేట బస్ స్టాండ్ కు కొంత ముందుగా రథం గుడి సెంటర్ బస్ స్టాప్ వస్తుంది.
రథం గుడి సెంటర్ కు సుమారు ఒక కీ.మీ దూరాన (లోపలకి) శ్రీ జనార్ధన స్వామి ఆలయం కలదు. స్ధానికులు రథం గుడి గా పిలుస్తారు. రథం గుడి సెంటర్ వద్ద లాడ్జిలు ఉంటాయి. యాత్రికులు విశ్రాంతి పొందవచ్చును.
6. రావులపాలెం - మండపేట - రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో గల మండపేట పట్టణం నకు దక్షిణ దిశగా, గోదావరి నది తీరాన కపిలేశ్వరపురం, మాచర, కోరుమిల్లి, కోటిపల్లి గ్రామాలు ఉంటాయి. ఈ ప్రాంతములుకు బస్సులు, ఆటోలు తక్కువుగా ఉంటాయి.
మండపేట నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు/బస్సులు (వయా) రథం గుడి మీదగా ఉంటాయి.
అంగర నుంచి కపిలేశ్వరపురం నకు షేరింగ్ ఆటోలు ఉంటాయి.
కపిలేశ్వరపురం నందు కొంత లోపలకి శ్రీ జనార్ధన స్వామి ఆలయం ఉంటుంది.
7. కపిలేశ్వరపురం నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.
అంగర నుంచి టేకీ మీదగా మాచర మరియు కోరుమిల్లి వరకు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి.
8. కోరుమిల్లి గోదావరి గట్టు నుంచి కోటిపల్లి రేవుకు షేరింగ్ ఆటోలు ఉంటాయి.
రావులపాలెం నుంచి యానాం వరకు గోదావరి గట్టు పైన రోడ్డు నిర్మించారు. ఈ మార్గములో కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కోటిపల్లి గ్రామాలు ఉంటాయి. రావులపాలెం నుంచి కోటిపల్లి వరకు షేరింగ్ ఆటోలు (వయా) జొన్నాడ గోదావరి గట్టు, కపిలేశ్వరపురం రేవు, కోరుమిల్లి రేవు, కోటిపల్లి రేవు ఉంటాయి. ఈ మార్గములోయాత్ర బస్సులు (Private), షేరింగ్ ఆటోలు ప్రయాణం చేస్తాయి. షేరింగ్ ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి.
సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి రామచంద్రపురం కు బస్సులు కలవు.
రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మండపేట కు బస్సులు కలవు
రాజమండ్రి & కాకినాడ నుంచి ద్రాక్షారామం కు బస్సులు కలవు.
ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును.
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి