ప్రేతయోని దోషం అంటే ఏమిటి?
ఇది చాలా క్లిష్టమైన సమస్య. నిజానికి జన్మ జన్మాంతర సమస్య. అంటే పూర్వజన్మలకు చెందిన దోషం. అయితే ఇది ఈ జన్మలో కూడా మొదలు కావచ్చు. ప్రేతయోని అంటే ఎవరికి అయితే ఆయువు తీరకుండా చనిపోతారో వారు మిగిలిన ఆయువు తీరేవరకూ ప్రేతగా ఉండిపోతారు. ఆ తరువాతే యమలోకం వెళతారు. ఇది ఒక రకంమైన ప్రేత యోనిదోషం. ఇక రెండో రకంగా ఈ దోషం సరైన కర్మకాండలు జరుగకపోతే వస్తుంది. అంటే వారసులు చనిపోయిన వారిని నిర్లక్ష్యం చేసి వారికి ప్రేతత్వ విముక్తి కల్పించి యమలోకం వెళ్ళే అవకాశం వచ్చే యాతనా శరీరాన్ని ఏర్పరచరు. ఈ కారణం వలన చనిపోయిన వారు వాయురూపంలో ప్రేతగా ఉండిపోతారు. యాతనా శరీరం ఏర్పడితేనే కానీ రంపపు కోతలు, ముళ్ళగదలతో కొడితే నొప్పి పుట్టడం, నూనెలో కాల్చితే బాధ కలుగడం ఉండదు కనుక యమభటులు ప్రేతత్వం విముక్తి కలగని వారిని విడిచి వెళిపోతారు. వారు వాయు రూపంలో చింత చెట్టుకు వేళ్ళాడుతూ ఉంటారు. అయితే వీరు ఊరికే ఉండరు. తమకు ఎవరైతే నీళ్ళు నిప్పులూ ఇవ్వాలో అవి ఇవ్వలేదో వారిని పీడిస్తారు. ఇదే ప్రేతయోనిదోషం. ఈ విధంగా తప్పు చేసిన వారసులు తరువాత జన్మల్లో కూడా ఈ దోషంతో అల్లాడవలసి వస్తుంది. అంటే ఈ జన్మలో చేయవలసిన వారికి కర్మాదులు చేయకపోతే ఆ పాపం దోషరూపంలో తరువాత జన్మల్లో కూడా బాధిస్తుంది.
ఈ విధమైన దోషాలు పోవాలంటే ప్రతి అమావాస్య మరియు పర్వదినాల్లో గోసేవ తప్పకుండ చేస్తూ ఆ విశేష సమయంలో కడు పేదవారికి అన్నప్రసాదం వితరణ చేసుకోవాలి.
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి