ధర్మసందేహాలు:


ధర్మసందేహాలు: 

ఇంటిలో ఏ విధమయిన చెట్లు పవిత్రతతో కూడినవి వుండాలి? వాస్తు విషయంగా ఏదేని విశేషం కలిగిన చెట్లు వున్నవా? 

తులసి లేకుండా యిల్లు వుండరాదు. స్త్రీ నివసించు ప్రతి యింటా తప్పక వుండ వలసిన అవసరం వున్నది. సౌభాగ్య వృద్ధిని కలుగచేస్తుంది. యిక పూజకు ఉపయోగించు గన్నేరు, మల్లి, జాజి, వంటివి ఏదో ఒకటి లేకుండా యిల్లు వుండకూడదు.

“పారిజాత తరుమూల వాసినం” అని ఆంజనేయస్వామి వారికి ప్రత్యేకత వున్నది. కావున పారిజాత వృక్ష మూలంలో వున్న ఆంజనేయస్వామి సదా మనల్ని మన యింటిని రక్షణ చేస్తారు. అందుచేత ప్రతి యింటా పారిజాత వృక్షం వుండడం వలన దృష్టి దోషాలు వంటివి పోతాయి. నరఘోష, భూతబాధ, వంటివి పారిజాత వృక్షం వున్న యింటిలోని వారికి తగలవు. 

ప్రతి యింటా ఈశాన్యంలో మారేడు వృక్షం వుంటే అది ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. మారేడు, తులసి రెండూ వున్న యింట హరి హరులు యిరువురూ నివాసం చేస్తారు. 

యిదికాక వాస్తు శాస్త్రం ప్రకారం అనుభవం మీద పెద్దలు చెప్పే మాట ఏమిటి అంటే ప్రతి యింటిలోను మామిడి, పనస, కొబ్బరి వృక్షాలు వుండడం దృష్ట్యా అవి వాస్తు దోషాలు హరిస్తాయి. ఈ మూడు చెట్లు దక్షిణ, పశ్చిమ దిశలలో వుండాలి. అనగా ఆగ్నేయం నుండి ప్రారంభించి వాయవ్యం వరకు ఎక్కడయినా వుండవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు