చంద్ర రాహువుల కలయిక



చంద్ర రాహువుల కలయిక

మనసుకు కారకుడైన చంద్రుడు సర్పగ్రమైన రాహువు లేదా కేతు కలిసినప్పుడు జాతకం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. సాధారణంగా రవి చంద్రులతో రాహు కేతువులు దగ్గరలో ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు రాహువు కలిసి ఉన్న జాతకం తీవ్ర మానసిక ఆందోళన భవిష్యత్తు గురించి భయం ఉంటాయి. ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటారు మంచి ఆలోచనలు ఉండవు. శారీరక సమస్యలు ముఖ్యంగా లంగ్స్ కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీ జాతకంలో ఈ కలయిక ఉన్నప్పుడు హిస్టీరియా రోగులవలే ప్రవర్తిస్తారు. మానసిక బలాన్ని కోల్పోతారు లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటారు. బంధువులతో, చుట్టుపక్కల వారితో విరోధం పెట్టుకుంటారు. నమ్మదగిన వ్యక్తులుగా ఉండరు. జాతకంలో గురుడు లేదా శుక్రుడు బలంగా ఉండి చంద్రుడిపై దృష్టి ఉంటే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఈ చంద్ర రాహువులు కలయిక జాతకులు ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారిపై దాడి చేయడం అస్థిరంగా ప్రవర్తించడం ఉంటాయి. ఈ మానసిక అస్థిరత్వం వలన కుటుంబ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. లగ్నంలో ఈ కలయిక ఉన్నప్పుడు విపరీతమైన మానసిక ఆందోళన గందరగోళ పరిస్థితి ఉంటుంది. కుటుంబ స్థానంలో ఈ కలయిక ఉంటే మాటలతో కుటుంబ సభ్యులను టెన్షన్ కు గురి చేస్తారు కుటుంబ సభ్యులకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. మూడో స్థానంలో ఈ గ్రహాలు ఉంటే చెడు స్నేహాలు విపరీత ధోరణి ఉంటుంది. నాలుగో స్థానంలో ఉంటే విద్య పాడవుతుంది తల్లి ఆరోగ్యం పాడుతుంది. బంధువులతో విరోధం ఉంటుంది. పంచమ స్థానంలో ఉంటే లోపం ఉన్న సంతానం కలగడం పూర్వీకుల ఆస్తులు అనుభవించలేకపోవడం జరుగుతాయి. ఆరవ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులను వీళ్లే ఏర్పరచుకుంటారు, గుప్త వ్యాధులు ఉంటాయి. వివాహ స్థానంలో ఉన్నప్పుడు వివాహం చేదు అనుభవంగా ఉంటుంది లేదా ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు లేదా వివాహం కాకపోవడం జరుగుతుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్షు గురించి భయం, పుట్టిన ఊరు నుండి దూరంగా వెళ్లిపోవడం, నేర ప్రవృత్తి, జైలు శిక్షలు ఉంటాయి. తొమ్మిదో స్థానంలో ఉంటే తండ్రితో విరోధం తండ్రి లేకపోవడం సమాజంలో పెద్ద మనుషులతో విరోధం తెచ్చుకుంటారు. పదవ స్థానంలో ఈ కలయిక ఉంటే వ్యాపారాలలో ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, నష్టాలు కలగడం ఎదుటివారిని మోసం చేసి బతకడం వంటివి ఉంటాయి.లాభ స్థానంలో ఈ కలయిక ఉంటే జూదం మోసం పక్కవారి జీవితాన్ని నాశనం చేసి సంపాదించడం వంటివి ఉంటాయి. 12వ స్థానంలో ఉన్నప్పుడు శయన సుఖం ఉండదు. నిద్ర ఉండదు విదేశాలలో జైలు శిక్షలు మనశాంతి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఏదిఏమైనాప్పటికీ చంద్ర రాహువు కానీ చంద్ర కేతువులు గాని కలయిక జాతకంలో ఉండకపోవడం అనేది ఒక అదృష్టం అని చెప్పవచ్చు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు