ఈశాన్య దిక్పాలకుడు ఈశ్వరుడు


ఈశాన్య దిక్పాలకుడు ఈశ్వరుడు 

తూర్పు ఉత్తర మధ్యభాగమైన ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వ రుడు అధిపతిగా ఉన్న కారణంగా ఈ దిక్కుకి ఈశాన్యమని పేరు. త్రిమూర్తులలో ఒకడైన శంకరుడు తమోగుణసంభూతుడు, లయాధిపతి, నిత్య తపస్వి. 'జ్ఞానంతు శంకరాదిచ్ఛేత్' అని స్మృతి వాక్యం. అనగా శంకరుడు జ్ఞానప్రదాత. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు, తన తపస్సుని భగ్నం చేసిన కారణంగా మన్మథుడిని తన మూడో కంటితో భస్మం చేసినవాడు శంకరుడు. దక్షప్రజాపతి పుత్రిక, శంకరుని మొదటి భార్య అయిన సతి, దక్షయజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపెట్టగా తిరిగి కొంత కాలానికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని వివాహమాడాడు శివుడు. అంధకాసురుడు, భస్మాసురుడు, వృకాసురుడు వంటి దానవులను సంహరించి లోకోపకారము చేసినవాడు శివుడు. నారాయణుడు ఎక్కడ అవతరించినా అతని వెంటే తాను అవతరించాడు. నారాయణుడు రాముడైతే, శంకరుడు ఆంజనేయు డయ్యాడు. ప్రసిద్ధిగాంచిన విష్ణుక్షేత్రాలలో క్షేత్రపాలకుడు శంకరుడే. అలాగే శివక్షేత్రాలలో విష్ణువు క్షేత్రపాలకుడు. దేవతల ప్రార్థనతో క్షీరసాగరమథనంలో పుట్టిన విషాన్ని తాగగా కడుపులోని లోకాలు కల్లోలమవుతాయని కంఠంలోనే నిలుపుకొని నీలకంఠుడయ్యాడు. వాసుకి, తక్షకుడు మొదలైన మహాసర్పాలకు కలిగిన ఆపదను తప్పించడానికి వాటిని ఆభరణాలుగా ధరించి సర్పభూషణు డయ్యాడు. ఆహార్యం ఆస్తి, ఆవాసం ఇవి హృదయానికి సూచికలు కావని చల్లని హృదయం ఉంటే పూజాపాత్రులవుతారని లోకానికి చాటినవాడు శంకరుడు. శంకరుడు గంగాధరుడు కావున ఈశాన్యం జలావాసం అయ్యింది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
  1. HAVANIJAAA

    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

  2. శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  3. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

25-09-2025 – తెలుగు రాశి ఫలాలు