పరివర్తిని ఏకాదశి విశిష్టత.. పూజా విధానం

పరివర్తిని ఏకాదశి విశిష్టత.. పూజా విధానం : యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnu) భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతారని చెబుతారు. ఇలా విష్ణుమూర్తి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని అంటారు. ఈసారి పరివర్తిని ఏకాదశి 2025 ఎప్పుడు, విశిష్టత ఏంటో తెలుసుకుందాం. పరివర్తిని ఏకాదశిని హిందూ మతంలో విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ పరివర్తిని ఏకాదశిని ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షం 11వ రోజు ఏకాదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు. శ్రీమహావిష్ణువు దేవశయని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్లి.. భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరో వైపుకి తిరిగి నిద్రపోతాడని చెబుతారు. అందుకే దీన్ని పరివర్తిని ఏకాదశి (Parivartini Ekadashi) అని లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పరివర్తిని ఏకాదశి ఉపవాసం వ్రతం ఆచరిస్తే.. మంచి ఆరోగ్యం, సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని, సంకల్ప శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. ప్రతి ఏకాదశిలాగానే...