రాహు దోషం..నివారణోపాయలు
రాహు దోషం..నివారణోపాయలు .............!! అన్ని గ్రహాలు రవి వలన అస్తంగతులైతే.. రవి చంద్రులను కూడా నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు. అందుకే ఈయన స్తోత్రంలో “చంద్రాదిత్య విమర్ధనం” అని మర్దించే శక్తీ రాహువుకు గలదని చెప్పబడింది. ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని, మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ధించే శక్తి ఉంది. అందుకే రాహు మహాదశః బాగు లేనివారు పడే పాట్లు వర్ణనాతీతం. పురాణా శాస్త్రాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కశ్యపునికి రాహువు జన్మించాడు. పైటినసగోత్రజుడు. పార్ధవా నామ సంవత్సర భాద్రపద పౌర్ణమి..పూర్వభద్రా నక్షత్రమందు జన్మించాడు. మ్లేచ్చ స్వభావం కలిగినవాడు. సూర్యునికి నైరుతి దిశలో సర్పాకార మండలంలో సింహవాహునుడై, కరాళ వక్త్రంతో ఉప విష్ణుడై వుంటాడు. కొత్త దాన్ని ఆవిష్కరించే స్వభావం రాహువుది. శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ, మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు గానీ, అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయించే శక్తి కలవాడు. అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట...