పితృ దోషం

పితృ దోషం వేద జోతీష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మ కుండలిలో కొన్ని గ్రహాల స్థితి కారణంగా పితృధోషం ఉన్నట్లు గుర్తించవచ్చు. పితృధోషానికి ముఖ్య కారణం జన్మకుండలిలో రవి గ్రహం మరియు శని గ్రహములకు మధ్య ఉన్న సంబంధం గా చెప్పవచ్చు. రవి శని గ్రహాలు పరివర్తన చెందితే ( రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి) ఉంటే దానిని పితృధోషముగా గుర్తించాలి. రవి శని ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేక రవి, శని కలిసి ఒకే భావంలో ఉన్నప్పుడు జాతకునికి పితృధోషం ఉన్నట్లు గుర్తించాలి. ఇక్కడ రవి, శని సంబంధం లాగానే జాతకం లో గురు, బుధ గ్రహముల వలన కలిగే సంబంధం కూడా పితృధోషం ను సూచిస్తుంది. కాకపోతే గురు, బుధ వలన కలిగే పితృధోషం ఎక్కువ ప్రభావం చూపదు. హైందవ పురాణాల ప్రకారం మన పితృదేవతలు ( గతించిన తండ్రి, తాత, ముత్తాత) జీవించి ఉన్నప్పుడు చేసిన దోషములు, పాపాలు శాపంగా మారి తర్వాతి తరం వారికి కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని పితృధోషం అని అంటారు. నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాప పుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లోకంలో కొన్ని కోట్ల ఆత్మలకు శాంతి కలుగల...