మడికట్టుకోవడం?

మడికట్టుకోవడం? మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం. ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే మడి అంటే ఏమిటి ? మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసిక...