గృహంలో- వ్యాపార స్థలంలో దేవుని ఫోటోలు

గృహంలో- వ్యాపార స్థలంలో దేవుని ఫోటోలు సాధారణంగా ప్రతి గృహంలోనూ వ్యాపార స్థలాల యందు దేవుని యొక్క చిత్రపటాలు ఉంచుతుంటారు. ఏ దేవుని ఫోటోలు ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఏ దేవుని ఫోటోలు ఇంట్లో ఉండరాదు అనే విషయం పరిశీలన చేద్దాము. వ్యాపార స్థలంలో శివ కుటుంబం ఉన్న ఫోటో ఉంచితే మంచి పురోభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉండాలి. వెంకటేశ్వర స్వామి మధ్యలో నిలుచుని ఉంటారు వారి చుట్టూ అష్టలక్ష్మి కొలువై ఉంటారు దీనిని అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో అంటారు.కుబేరుడు నవనిధులకు అధిపతి అటువంటి కుబేరుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో వ్యాపార స్థలంలో ఉండాలి. ఈ మూడు ఫోటోలు ఉంచడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపార స్థలానికి ముందు భాగంలో కను దిష్టి వినాయకుడు ఫోటో ఉంచండి. అదేవిధంగా గృహంలో కూడా శివ పరివారం ఫోటో ఉండాలి. లక్ష్మీ నరసింహ స్వామి శాంతస్వరూపుడై లక్ష్మీదేవిని తన తొడ పై కూర్చుండు పెట్టుకొని ఉన్న ఫోటో కూడా ఉంచాలి. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో మరియు సరస్వతీదేవి ఫోటో కూడా గృహంలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. పంచముఖ...