సలేశ్వర యాత్ర విశేషాలు (ఏప్రిల్ 2 పౌర్ణమి నుండి ఏప్రిల్ 6)


నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలసి భూలోకం లో అద్బుత ప్రాంతం గా చెప్పుకునే సలేశ్వర మల్లికార్జున స్వామి వారి ఆలయ చరిత్ర:

తెలుగు రాష్ట్రాల అమరనాధ్ యాత్ర గా చెప్పుకునే సలేశ్వరం యాత్ర:ఉగాది వెళ్లిన తొలి పౌర్ణమి సమయం లో కేవలం 5 రోజులు ( ఈ సంవత్సరం రానున్న ఏప్రిల్ 2 పౌర్ణమి నుండి ఏప్రిల్ 6 వరకు మాత్రమే) భక్తులు దర్శించుటకు వీలు కలిగే సలేశ్వర యాత్ర: శివుడు మల్లిఖార్జున స్వామి రూపంలో కీకారణ్యంలో వేలసంవత్సరాల క్రితం వెలసిన క్షేత్రం సలేశ్వరం: అలనాటి నిజాం నవాబ్ లు సలేశ్వర ప్రాంత అద్బుత అందాలకు బందీ అయి ఆ ప్రాంతంలో వేసవి విడిది ఏర్పాటు: మన పల్నాడు ప్రాంత విజయపురి ని పాలించిన ఇక్ష్వాకుల పరిపాలనలో సలేశ్వర ప్రాంత ఆనవాళ్లు లభ్యం:

రానున్న పౌర్ణమి ఏప్రిల్ 2   వ తేదిన లక్షల మంది భక్తులు దర్శించే సలేశ్వర యాత్ర విశేషాలు తెలుసుకుందాం:

హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మన్ననూరు ,అచ్చంపేట గ్రామాల అటవీ ప్రాంతం లో సలేశ్వర మల్లిఖార్జున స్వామి వెలిసారు.చుట్టూ కొండలు ఉండటం వలన శైలాలు(కొండలు) పేరు మీదుగా మొదట శైలేశ్వరం అని కాలక్రమేణా వాడుక భాష లో ప్రజలు సలేశ్వరం గా ఈ ప్రాంతాన్ని పిలవటం మొదలయింది. శివదేవుడు ప్రకృతి ప్రేమికుడు,ధ్యాన సంపన్నుడు కావటం వలన ఆయన వెలసిన క్షేత్రాలన్ని దట్టమైన అడవులు,కొండలు,జలపాతాలు,ప్రశాంత వాతావరణం లోనే వెలుస్తారు.ఉదాహరణకు శ్రీశైలం, ఉమామహేశ్వరం,లొద్ది మల్లయ్య,కోటప్ప కొండ ఇలా అనేకం చెప్పుకోవచ్చు.సలేశ్వర యాత్ర అతి కఠిన తరమైనది  కావున తెలుగు రాష్ట్రాల అమర్ నాధ్ యాత్ర గా పేరుపొందింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గ మధ్యలో మన్ననూర్ అటవీ ప్రాంతంలో 150 వ మైలు రాయి వద్ద నుండి అటవీ మార్గం ద్వారా 15 కిలోమీటర్లు వాహనాలు పై ప్రయాణిస్తే సలేశ్వరం కు వెళ్లే మార్గం కు చేరుకుంటాము,ఈ 18 కిలో మీటర్లు కూడా క్లిష్టమైన అటవీ ప్రాంతం,మట్టిరోడ్డు కావటం మరియు సింగిల్ రోడ్డు వల్ల 18 కిలోమీటర్లు చేరుకోవటానికి 4 నుంచి 5గంటల సమయం పడుతుంది,శ్రీశైలం నుండి తిరిగి హైదరాబాదు వెళ్లే మార్గం లో సరిగ్గా 60  కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్ననూరు వస్తుంది. ఇది దట్టమైన కీకారణ్య ప్రాంతం కావున అటవీ శాఖ అధీనంలో ఉంటుంది.కేవలం చైత్ర శుధ్ధ త్రయోదశి నుండి చైత్ర బహుళ విదియ వరకు మాత్రమే  5 రోజులు స్వామి వారి వార్షిక ఉత్సవాల సమయంలో మాత్రమే భక్తులను ఆలయం వరకు అనుమతిస్తారు.మిగిలిన రోజుల్లో ఈ ఆలయం కు వెళ్లటం అసాధ్యం. అద్బుత మైన ప్రకృతి,ఆకాశం తాకే కొండలు,వాటి కిందనుండి పై వరకు పచ్చని చెట్లు,గుహలు,జలపాతాలు ఈ ప్రాంతం సొంతం,అందుకే 17 వ శతాబ్దం లో అలనాటి నిజాం నవాబ్ అటవీ సంచారానికి వచ్చి ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్దుడు అయ్యి ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో  వేసవి విడిది పర్హాబాద్ పేరుతో భవనం నిర్మించుకున్నారు. వేసవి లో ఈ ప్రాంతానికి వచ్చి ప్రకృతి సౌందర్యానికి పరవశించి పోయేవారట నాటి నిజాం పాలకులు.నిజాం వేసవి విడిది ప్రస్తుత శిధిల ఆనవాళ్లు ఈ మార్గంలో మనం చూడవచ్చు. అడవిలో 18 కిలోమీటర్లు వాహనాలపై ప్రయాణించాక వాహనాలు అక్కడ నిలిపి తమకు అవసరమైన దుస్తులు,ఆహార పదార్దాల వంటివి మాత్రమే తీసుకుని కాలి నడకన 5 కిలోమీటర్లు  నడవాలి. ఈ మార్గం కొండలు,ఇరుకైన ప్రాంతాలు,అతి క్లిష్టమైన సన్నని రోడ్లు కలిగి ఉంటుంది,అలా కొంత దూరం వెళ్ళాక రెండు కొండల మధ్య ఒక వాగు ప్రవాహంకలిగి ఉంటుంది. ఆ కొండలను పట్టుకుని అతి జాగ్రత్తగా అడుగులో ,అడుగు వేస్తూ ఆ వాగు దాటాలి,ఏ మాత్రం కాలు జారినా వాగు ప్రవాహం లో పడిపోతారు. ఈ క్లిష్టమైన మార్గాన్ని దాటేటప్పుడు వస్తున్నాం శివయ్యా నీ వద్దకు వస్తున్నాం అంటూ భక్తులు అందరూ లయబద్దంగా అనుకుంటూ దాటటం  జరుగుతుంది.శివయ్య రక్షగా ఎవరికి ఏ మాత్రం అపాయం లేకుండా ఈ రెండు కొండల నడుమ ప్రవహించే జలపాతం దాటుతారు.ఇది దాటాక దాదాపు 200 అడుగులు లోతు గా ఉండే మోకాళ్ల కూర్వం గా పిలవబడే ప్రాంతం నుండి కిందకు అతి కష్టంగా దిగాలి,ఇలా కిందకు దిగే సమయంలో ప్రతి ఒక్కరు చేతి కర్రను ఊతంగా వాడుతారు,కొందరు కూర్చుని నెమ్మదిగా దిగుతారు.ఈ మార్గం దాదాపు 2 కిలోమీటర్లు వరకు ఉంటుంది. ఇలా జాగ్రత్తగా నడుస్తూ కొంత దూరం చేరుకున్నాక సలేశ్వర మల్లిఖార్జున స్వామి వారి ఆలయం కు చేరుకుంటాము,ఆలయ ప్రాంతం లో పచ్చని ప్రకృతి,ఆధ్యాత్మిక వాతావరణం చూస్తే పడిన శ్రమ భక్తులు మరచిపోతారు.ఈ ప్రాంతంలో కొండలను ఎవరో చక్కటి ఆకృతి తో చెక్కినట్లు వాటి పై అందమైన వృక్షాలు నాటినట్లు అద్బుతంగా కనిపిస్తాయి.స్వామి ఆలయం కు ముఖ మండపం ఉండదు. ఒక గుహలో వెలసినట్లు గా ఉండే మల్లికార్జున స్వామి వారిని దర్శించి భక్తులు పులకించిపోతారు,స్వామి వారికి స్వయంగా అభిషేకం చేయవచ్చు, ఈ అలయం లో అటవీ ప్రాంతంలో నివశించే గిరిజన చెంచు సోదరులే పూజారుల గా వ్యవహరిస్తారు,పండితులు,పూజారులు వలె శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణలు కాక వారికి నచ్చిన రీతిలో స్వామిని కొలుస్తారు. పరమ శివుడు భోళా శంకరుడు భక్తితో చెంబుడు నీళ్లతో అభిషేకిస్తే మురిసిపోయి భక్తులను కన్న బిడ్డలు గా చూస్తారని చారిత్రక కధనాలు అనేకం ఉన్నాయి కదా,అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వేటగాడి గా జీవించే గిరిజన పుత్రుడు భక్త కన్నప్ప మాంసం తెచ్చి ఇచ్చినా కాదనకుండా మోక్షమిచ్చిన దేవుడు,ఏ శాస్త్రాలు తెలియకున్నా నమ్మి కొలిచిన సర్పం,ఏనుగు,సాలీడు కు మోక్షం ఇచ్చిన దక్షిణా మూర్తి.ఇదే స్పూర్తితో,భక్తితో ఇక్కడ చెంచులు స్వామి వారికి అటవీ లో దొరికే పుట్ట తేనె,పుష్పాలు తో పూజిస్తారు. మూర్తి.ఇదే స్పూర్తితో,భక్తితో ఇక్కడ చెంచులు స్వామి వారికి అటవీ లో దొరికే పుట్ట తేనె,పుష్పాలు తో పూజిస్తారు.ఈ ఆలయం లో చైత్ర శుద్ధ పౌర్ణమి (ఈ సంవత్సరం ఏప్రిల్ 2 నుంచి 6 వరకు ఈ యాత్రకు అనుమతిస్తారు   ) రోజున చంద్రకిరణాలు ఏప్రిల్ 2 పౌర్ణమి రోజున  నేరుగా స్వామి వారి పై ప్రసరించి తేజోమూర్తి అయిన లింగమూర్తి గా స్వామి దర్శన మిస్తారు,సంవత్సరం లో ఒక్కరోజున మాత్రమే ఇలా జరుగుతుంది,కనుకనే ఈ రోజున లక్షలాది భక్తులు స్వామి వారిని దర్శించి కృపపొందుతారు,ఈ అద్బుతం మాటల్లో,రాతల్లో వర్ణించలేము,చూసిన వారు మాత్రమే ఆ అనుభూతి పొందుతారు.ఈ రోజున స్వామి వారిని దర్శిస్తే సకలపాపాల హరణం పొంది సుఖ:శాంతులతో వర్దిల్లుతారని చెపుతారు,అందుకే ఇంత క్షిష్టమైన మార్గం లో ప్రయాణించి స్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ఆలయం లో విద్యుత్ సౌకర్యం ఉండదు,దీపాల కాంతి,చంద్రుని వెలుగు మాత్రమే ఉండి పరమ శివుడు నేరుగా దర్శనం ఇచ్చారా?అని భక్తులు పులకించేలా పౌర్ణమి రోజు ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలో దాదాపు 200 అడుగుల పై నుండి జాలు వారే తెల్లని స్వచ్చమైన పాలధార లాంటి జలపాతం పడుతుంది,ఈ జలపాతం క్రింద స్నానమాచరించి స్వామిని దర్శిస్తారు. ఈ జలపాతం కింద స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం దట్టమైన అరణ్యం లో ఎన్నో ఔషధ మొక్కలు,ఆకులు ను తాకుతూ పై నుండి జాలు వారే జలం లో అనేక గుణాలు ఉండి రోగాలు నయం చేస్తాయని చెపుతారు. ఈ ప్రవాహం భక్తులు కొద్ది సంఖ్యలో వెళ్తే తక్కువ ధారతో ఎక్కువ సంఖ్యలో వెళ్తే పెద్ద ధారతో పై నుండి పడడం స్వామి లీల అని చెపుతారు. ఆలయం దగ్గరలో ఒక గుహలో కూడా పై నుండి జలపాతం పడుతూ అద్బుతంగా ఉంటుంది. ఆలయం కు దగ్గరలో గంగా మాత,కాలభైరవుడు,వీరభధ్రస్వామి ఆలయాలతో పాటు స్వయంగా వెలసిన పుట్ట సుభ్రమణ్య స్వామి వారు కొన్ని వేల సంవత్సరాల కాలం నుండి ఉండే ఆలయాలు గా మనకు కనిపిస్తాయి.పుట్టకు దారాలు కట్టి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతాన ఫలం అలాగే సొంత ఇళ్ళు లేని వారు స్వామిని మొక్కుకుంటే అతి త్వరలో ఇండ్లు కట్టుకునేలా దీవిస్తారని, అలా గృహాలు నిర్మించుకున్నవారు మరుసటి సంవత్సరం వచ్చి రాళ్ళు పేర్చి మొక్కులు తీర్చుకునటం మనం చూడవచ్చు. కొన్ని వేల సంవత్సరాల నాటి ఈ ఆలయ ప్రస్తావన 13 వ శతాబ్దంలో పండితారాధ్య చరిత్ర,శ్రీ పర్వత క్షేత్రం రాసిన ప్రముఖ శివ భక్త పండితుడు పాల్కురి సోమనాధుడు తన గ్రంధాలలో సలేశ్వర ఆలయ విశేషాలు తెలిపారు,దీనిని బట్టి ఎంత ప్రాసస్త్యం ఉన్న ఆలయమో మనం గ్రహించవచ్చు.17  వ శతాబ్దం లో శ్రీశైలం దర్శించిన చత్రపతి శివాజీ  అడవుల గుండా ప్రయాణించి సలేశ్వరం చేరుకుని స్వామి వారికి ఆరాధించినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయి. చేరుకుని స్వామి వారికి ఆరాధించినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయి. వచ్చి బౌద్ధ మతం లో చేరిన జూలధమ్మగిరి సాధువులు గా భావించే కొందరు బౌధ్దులు సలేశ్వరం ప్రాంతంలో నివశించి తపస్సు చేసేవారట,అలాగే పూర్వకాలం లో మునీశ్వరులు ఈ ప్రశాంత వాతావరణం లో శివదేవుని పూజించారని కధనాలు ఉన్నాయి.సలేశ్వర ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతంలో అధ్బుత మైన మల్లెల తీర్దం అనే చారిత్రక జలపాతం ఉంటుంది.(మరో సారి మల్లెల తీర్ధం గురించి పూర్తి వివరాలు అందిస్తాను) పూర్వ కాల దివ్యర్షులు పరమశివుడు నల్లమల్ల అటవీ తీరంలో ప్రకృతి కి పరవశించి  పంచ లింగాలు గా ఆవిర్బావించారని అవి 1.శ్రీశైలం.2.ఉమా మహేశ్వరం.3.లొద్ది మల్లయ్య4.సలేశ్వరం కాగా పంచమ లింగం ఇంతవరకు ఏ మానవుడు,దివ్యర్షి గాని కనిపెట్టలేకపోయారని చెపుతారు.దట్టమైన అరణ్యంలో పంచమ లింగం కూడా ఎక్కడో ఉండవచ్చని బహుశా అక్కడకు వెళ్లే మార్గం కూడా అసాధ్యం కావున ఇంతవరకు ఆనవాళ్లు కనబడలేదని చెపుతారు.ఎందరో ఋషులు,ఆధ్యాత్మిక పురుషులు,గిరిజనులు నల్లమల్లను జల్లెడ పట్టినా పంచమలింగ ఆధారం నేటికి లభించలేదట. ఈ మార్చి 31 కి సలేశ్వర యాత్ర కు తెలంగాణా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.ట్రెక్కింగ్,సాహాసాలు చేసే వారికి ఈ ప్రాంతం అద్బుత ప్రపంచం లా తోస్తుంది,కొండల అంచులు,జలపాతాలు,దట్టమైన అడవీ, కొండలు దాటుతూ సలేశ్వర మల్లిఖార్జున స్వామిని దర్శించటం గొప్ప అనుభూతి,స్వామి వారిని దర్శించటానికి వెళ్లేటప్పుడు భక్తులు వస్తున్నాం శివయ్యా అంటూ,తిరిగి వచ్చేటప్పుడు వెళ్తున్నాం శివయ్యా అంటూ శివనామ స్మరణ తో సాగుతారు,ఇంతటి క్షిష్టమైన యాత్రలో శివుడు భక్తులకు అండగా ఉండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా  చేస్తారని భక్తులు చెపుతారు,అది నిజం. దట్టమైన కీకారణ్యంలో కొన్ని వేల సంవత్సరాలనాటి నుండి దివ్యర్షులు తో పూజలు అందుకుంటూ ఉన్న శివాలయ ఆనవాళ్లు ఉన్నాయంటే అది శివుని మహిమ కాక ఏమని చెప్పాలి?ఇప్పటికే ఆప్రాంతం కువెళ్లటం అసాద్యం,సృష్టిలో దైవ లీలకు ఇటువంటి ఆధారాలే మనకు కీలకం గా చెప్పవచ్చు. నేటికి ప్రతి సంవత్సరం 5 రోజులు జరిగే ఉత్సవాలకు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించి వెళ్లే ప్రక్రియలో ఎక్కడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేవు,ఒక్కోసారి  ఈ 5 రోజుల యాత్రలో గతం లో వర్షాలు సంభవించినను భక్తులకు హాని జరగలేదు అని చెపుతారు. ఈ సంవత్సరం సలేశ్వర మల్లిఖార్జుని యాత్ర కు వెళ్లే భక్తుల పై స్వామి వారి కృప ఉండాలని కోరుతూ,ఇంతటి గొప్ప చారిత్రక,ఆధ్యాత్మిక ఆనవాళ్లు ఉన్న సలేశ్వర స్వామి గురించి తెలియని వారికి తెలియచేసేలా నాకు సంకల్పం కలగచేసిన పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతున్నాను.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

మాఘ పురాణం - 4 వ అధ్యాయము