పోస్ట్‌లు

సెప్టెంబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

కాలాన్ని కొలిచిన దేవాలయం.

చిత్రం
  కాలాన్ని కొలిచిన దేవాలయం గడియారాన్ని కనుగొనడానికి చాలా శతాబ్దాల ముందు అంతరిక్షంలోకి చూసే టెలిస్కోపులు సృష్టించబడక ముందు ఎందుకంటే యూరప్ ఒక సంవత్సరం 365 పావు రోజులు [365.25] అని కనుగొనడానికి చాలా కాలం ముందే భారతదేశపు దక్షిణపు కొనలో సముద్రం ఆకాశం ఒకదానికొకటి ముద్దాడుకునే చోట ఒక గొప్ప అద్భుతమైన దేవాలయం వెలసింది. అది పద్మనాభస్వామి ఆలయం. అనంతుడు అనే సర్పం మీద శాశ్వత నిద్రలో ఉన్న ఆ స్వామి ఆలయం. ఇది కేవలం భక్తికి సంబంధించిన స్థలం మాత్రమే కాదు. ఇది రాతిలో చెక్కబడిన ఒక గొప్ప కాల యంత్రం! భాగం 1 : రోజులను లెక్కించే స్తంభాలు ఆలయపు పొడవైన నడవలోకి ప్రవేశించి చూడండి. మీ ముందు 365 స్తంభాలు గంభీరంగా నిలబడి ఉన్నాయి.అవి మాట్లాడవు, కదలవు. కానీ అవి సమయాన్ని లెక్కపెడుతున్నాయి. ప్రతి ఉదయం తూర్పున సూర్యోదయం అయినప్పుడు, దాని కాంతి తూర్పు ద్వారం గుండా ప్రవేశించి ప్రతిరోజూ సరిగ్గా ఒక స్తంభాన్ని తాకుతుంది. రోజుకు ఒక స్తంభం, ఆ స్తంభాలు సంవత్సరంలోని 365 రోజులను లెక్కిస్తాయి. కానీ, అక్కడ ఒక 'క్వార్టర్ పిల్లర్' ఉంది. అది చాలా చిన్నది, దాగి ఉంది. మూడేళ్లపాటు ఆ స్తంభం నీడలోనే ఉంటుంది. కానీ నాలుగవ సంవత్సరంలో, అ...

వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు?

చిత్రం
వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? — ఆ కథ వెనుక ఉన్న విశేషం గణపయ్య ముందు గుంజీలు తీయడం మన దగ్గర ఎంతో కాలంగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయం. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథను హరికథా, భక్తి సంప్రదాయాల్లో ఇలా చెబుతారు. ఇది పురాణాల్లో తప్పనిసరి పూజావిధిగా కాకుండా, ప్రచారంలో ఉన్న కథనంగా చూడాలి.  ఒకసారి శ్రీమహావిష్ణువు కైలాసానికి వెళ్లారు. పార్వతీదేవి సోదరుడైన విష్ణుమూర్తి, పరమశివుడిని కలుసుకుని సంభాషణలో మునిగిపోయారు. విష్ణుమూర్తి తన ఆయుధాలను పక్కన ఉంచారు. అందులో సుదర్శన చక్రం కూడా ఉంది. అక్కడ ఆడుకుంటున్న బాలగణపతికి ఆ సుదర్శన చక్రం కనిపించింది. బంగారు కాంతులతో మెరిసిపోతున్న ఆ చక్రం బాలగణపతికి ఎంతో ఆసక్తిగా అనిపించింది. బాలగణపతి తన అల్లరి స్వభావంతో దాన్ని తీసుకుని నోట్లో వేసుకుని మింగేశాడని కథనం. కొంతసేపటి తర్వాత విష్ణుమూర్తికి తన సుదర్శన చక్రం కనిపించలేదు. “నా సుదర్శన చక్రం ఎక్కడుంది?” అని వెతకసాగారు. బాలగణపతి అమాయకంగా, “మావయ్యా… నేను మింగేశాను!” అన్నాడట. విష్ణుమూర్తి ఎన్నో విధాలుగా అడిగినా బాలగణపతి వెంటనే చక్రాన్ని బయటకు ఇవ్వలేదు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక విచిత్రమైన ఉపాయం ఆలోచించ...

గురువు అంటే ఎవరు? జీవితంలో గురువు అవసరమా?

చిత్రం
  గురువు అంటే ఎవరు? జీవితంలో గురువు అవసరమా?  నిజానికి గురువు మహిమను సంపూర్ణంగా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. గురువు మహిమ భగవంతుని మహిమకన్నా గొప్పదిగా భావించబడింది. అందుకే శాస్త్రాలలో గురువుకు అత్యున్నత స్థానం కల్పించబడింది. అయితే ఈ మహిమ సత్యానికి సంబంధించినది; కపటత్వానికి సంబంధించినది కాదు. ప్రస్తుతం భారతదేశంలో లౌకికమైన లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే వ్యక్తిని సాధారణంగా గురువుగా పిలుస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఐదు రకాల వారు ఉన్నారు. పాఠశాలల్లో విద్యను బోధించే వ్యక్తి. ఆచార్యుడు – తన స్వీయ ఆచరణ ద్వారా విద్యను బోధించేవాడు. కులగురువు – వర్ణాశ్రమ ధర్మానుసారం సంస్కారజ్ఞానాన్ని అందించేవాడు. దీక్షాగురువు – గురుపరంపరను అనుసరిస్తూ, తన గురువు ఆదేశానుసారం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మంత్రదీక్షను ప్రసాదించేవాడు. గురు – ఈ పదం వాస్తవానికి సమర్థ గురువు లేదా పరమగురువుకు వర్తిస్తుంది. 'గురు' అనే పదానికి 'గొప్ప' అనే అర్థం ఉంది. జ్ఞానం అన్నిటికన్నా గొప్పది, శ్రేష్ఠమైనది. అందువల్ల సంపూర్ణ జ్ఞానస్వరూపుడైన చైతన్యమూర్తిని 'గురు' అని సంబోధిస్తారు. అటువంటి గురువునే స్తుతిస్తారు. రామకృష్...

సంతానము వలన సుఖము

చిత్రం
  సంతానము వలన సుఖము తమ పిల్లలు భవిష్యత్తులో తమను ఆదరిస్తారా లేదా అనేది ప్రస్తుత కాలంలో ఒక సమస్యగా ఉంది ఈ సమస్య కోటీశ్వరుల నుండి సాధారణ వ్యక్తుల వరకు కూడా ఉందని చెప్పాలి. తల్లిదండ్రులు సంతానం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కానీ పిల్లలు తన అవసాన దశలో ఆదరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది. జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి, ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు తమ పిల్లలు తమను ఆదరిస్తారు అనేది తెలుసుకోవచ్చు ఈ కారణంగా భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు సరిపడా ధనాన్ని నిలువ ఉంచుకుంటే అది అత్యవసర సమయంలో కాపాడుతుంది. జాతకంలో పుత్ర కారకుడు అయిన గురు భగవానుడు లగ్నంలో కానీ కర్కాటకంలో లేదా ధనుస్సు లేదా మీనం ఈ నాలుగు స్థానాలలో ఏ ఒక్క స్థానంలో అయినా గురుడు స్థితి పొందినట్లయితే మీ పిల్లలు నుండి మీరు ఆదరణ కచ్చితంగా పొందుతారు. లేదా మీ జాతకంలో పంచమాధిపతి శుభగ్రహమైనా లేదా పాప గ్రహమైనా సరే బలంగా ఉండాలి అనగా గురువు యొక్క దృష్టి కానీ గురువుతో కలిసి గానే ఉండాలి. ఈ రెండు నియమాలలో ఏ ఒక్కటి అయినా మీ జాతకంలో ఉన్నప్పుడు మీ సంతానం మిమ్మల్ని ఆర్థికంగా ఆదరిస్తారు మరియు వృద్ధాప్యంలో మీకు తోడ...

ఉద్యోగమా -వ్యాపారమా

చిత్రం
ఉద్యోగమా -వ్యాపారమా చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు. చాలామందికి వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది కానీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతామా లేదా అనే సందేహం వస్తుంది.ఒక జాతకుడికి వ్యాపారము కలిసి వస్తుందా లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అనే విషయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. వ్యాపారం చేయడానికి ధైర్యం ఉండాలి. ఏ లగ్న జాతకులు అయినా సరే మూడవ స్థానం బలంగా ఉంటే వ్యాపారం చేయవచ్చు. మూడవ స్థానం ధైర్య వీర్య స్థానంగా చెప్పబడింది. మూడో స్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ పనివాళ్ళు ఎక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయకూడదు. మూడో స్థానం బలహీనంగా ఉన్నవారు పెట్టుబడి లేకుండా తను ఒక్కరు మాత్రమే కష్టపడి పనిచేసే వ్యాపారం చేయవచ్చు. ఉదాహరణకి టైలరు, వడ్రంగి, మెకానిక్ వీరికి పెట్టుబడి పెద్దగా ఉండదు రిస్కు తక్కువ. మూడో స్థానం బలంగా ఉన్నవారు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ పని వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. మూడవ స్థానంలో శని భగవానుడు కానీ రవి కానీ ఉన్నప్పుడు వీరు కచ్చితంగా వ్యాపారం చేయవచ్చు. మూడవ స్థానంలో ఉండే గ్రహాలు వా...

విదేశాలలో ప్రమాదాలు

చిత్రం
విదేశాలలో ప్రమాదాలు చాలామంది అమెరికా కెనడా దుబాయ్ వంటి విదేశాలలో ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం లేదా విహారయాత్ర లేదా విద్య కోసం వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు విదేశాలలో ప్రమాదాలు ద్వారా కొంతమందికి మరణం సంభవించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో  దుండగుల కాల్పుల్లో తెలుగువారు మృతి, రోడ్డు ప్రమాదంలో భారతీయు కుటుంబం దుర్మరణం, విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇటువంటి వార్తలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. ఒక దేశంలో పుట్టి మరొక దేశంలో ప్రమాదాలకు గురి అవ్వడం కానీ మరణించడం కానీ జరగడం గూర్చి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేక గ్రహాలు కలయిక వలన జరుగుతుంది. జాతకుడిది ఏ లగ్నం అయినప్పటికీ కూడా రాహువు కేతువు తప్ప 3 పాప గ్రహాలు కలిసి దుస్థానాలలో ఉండరాదు. శత్రు స్థానము, ఆయుష్ స్థానము వ్యయ స్థానంలో ఈ గ్రహాలు ఉండి ఆయా గ్రహాల దశ అంతర్దశ కాలంలో ఈ యోగం యాక్టివేట్ అవుతుంది. ఈ దుష్ట యోగం ఉన్న జాతకులు విదేశాలలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నీటిలో మునిగి కానీ అగ్ని ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు లేదా కాల్పులు, లోయలో పడి మరణించడం ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఒక దేశం లో పుట్టి మ...

సంతానలేమి-జాతక విశ్లేషణ

చిత్రం
  సంతానలేమి-జాతక విశ్లేషణ ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య సంతానం ఆలస్యంగా కలగడం లేదా సంతానం లేకపోవడం. సంతానం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అనేక రకాల మెడిసిన్స్ వాడడం చాలామందికి తప్పనిసరి అవుతుంది. కొంతమంది దంపతులు జ్యోతిష్యులను సంప్రదిస్తారు. జ్యోతిషంలో సంతానం కలగకపోవడానికి సంతానం ఆలస్యంగా కలగడానికి జాతకాన్ని పరిశీలిస్తే స్పష్టమైన కారణాలు తెలుస్తాయి. సంతానం ఆలస్యంగా కలుగుతుంది అని జాతకరీత్యా తెలిసినప్పుడు కొద్ది సమయం ఎదురు చూడాలి తర్వాత సంతానం సులభంగా కలుగుతుంది. సంతానాన్ని జాతకరీత్యా పరిశీలించాలంటే పంచమ భావాన్ని పరిశీలించాలి. పంచమ స్థానాధిపతి లేదా పంచమ స్థానంలో ఉండే గ్రహాలు ఆధారంగా సంతాన విషయం తెలుస్తుంది. పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు గాని లేదా పంచమాధిపతి శని భగవానుడు అయినప్పుడు కానీ సంతానం ఆలస్యం అవుతుంది. పంచమాధిపతి వక్రించినప్పుడు ఫలితాలు వేరేగా ఉంటాయి. పంచమ స్థానంలో రాహు లేదా కేతువుఉన్నప్పుడు సంతాన సమస్యలు తీవ్రంగా ఉంటాయి కేతు అయితే కొంతవరకు పరవాలేదు కానీ పంచమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు స్త్రీలకు గర్భాశయ సమస్యలు మరియు హార్మోను ఇన్ బ్యాలెన్స్...

ఆదాయం వృద్ధి కొరకు

చిత్రం
  ఆదాయం వృద్ధి కొరకు చాలామంది చాలీచాలని ఆదాయంతో జీవితాలను నెట్టుకొస్తూ ఉంటారు. కొంతమందికి ఆదాయం ఎక్కువగా ఉన్నా ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి.ఖర్చులకు తగినట్టుగా ఆదాయం పెరగాలంటే కొన్ని సులభ మార్గాలు పాటించాలి. కొన్ని పరిహారాలు పాటిస్తే ఆదాయం కాస్త నిలవ వేయగలుగుతారు. దీనిలో ముఖ్యమైన భాగంగా ఎవ్వరైనా సరే చెట్లను నాశనం చేయకూడదు. వీలైతే మొక్కలను నాటాలి వాటిని పోషించాలి. మీ గృహ ఆవరణలో వీలైనంతవరకు మొక్కలతో పచ్చదనం నిండి ఉండేలా చూసుకోండి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. చెట్లను నాశనం చేసినప్పుడు ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మహాభారతంలో కొన్ని కథలు తెలియజేస్తున్నాయి. మీ గృహంలో కానీ, దేవాలయంలో కానీ, రోడ్డు ప్రక్కన, పాఠశాలలు,గెస్ట్ హౌస్, పార్కులు ఎక్కడైనా సరే మొక్కలు నాటి వాటిని పోషించండి. మొక్కలు చిగురు పడుతూ ఉంటే మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇది సత్యం. ఒక రాగి చెంబు తీసుకుని దానిలో మంచినీరు పోసి ఒక మందార మొగ్గను దానిలో వేసి రాత్రిపూట మీ దేవుని గదిలో ఉంచండి.మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రాగి చెంబులోని మందార పువ్వును తీసివేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి బయట...

ధన ప్రవాహము-జాతక విశ్లేషణ

చిత్రం
  ధన ప్రవాహము-జాతక విశ్లేషణ జాతకులలో కొందరికి ధన ప్రవాహం అనేది జరుగుతుంది అనగా ఎల్లప్పుడూ అవసరానికి తగిన ధనం లభిస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా అప్పులు చేయవలసిన పని ఉండదు. చేసినప్పటికీ వెంటనే తీరిపోతాయి. ఇటువంటివారి జాతకాలలో గ్రహాల అమరిక ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. లగ్నాత్తు రెండవ అధిపతి మూడవ అధిపతికి సంబంధం ఉన్నప్పుడు అనగా ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్న లేదా పరివర్తన ఉన్నా వీళ్ళకి నిరంతర ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా కుజుడు ధనాధిపతికి సంబంధం ఏర్పడినప్పుడు వీరి జాతకంలో ధన ప్రవాహం ఉంటుంది. ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. అదేవిధంగా భాగ్యాధిపతి లాభాధిపతి పై దృష్టి ఉన్న లేదా కలిసి ఉన్న జాతకులకు కూడా అత్యధిక ధనం లభిస్తూనే ఉంటుంది. కొద్ది రోజులలో ఏదో ఒక పెద్ద ధనానికి సంబంధించిన అవసరం ఉంటే ఆ సమయానికి ధనం వెంటనే లభిస్తుంది. వ్యాపారం చేసేవారైతే లాభాలు ఆకస్మికంగా రావడం లేదా ఏదో విధంగా ధనం అయితే లభిస్తుంది. లేదా జాతకంలో గురు భగవానుడు లాభాధిపతిని కలిసినా,లాభాధిపతి పై దృష్టి ఉన్నా ఈ జాతకులకు ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా తృతీయ అధిపతి తొమ్మిదో అధిపతిని కలిసినా దృష్టి ఉన్న, లేదా ఆ స్థానాలను చూస్త...

తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం క్షేత్ర పాలకుడు ఎవరు......

చిత్రం
  తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం క్షేత్ర పాలకుడు ఎవరు... ........!! సాధారణంగా వైష్ణవ క్షేత్రాలకు శివుడు ...  శైవ క్షేత్రాలకు విష్ణువు క్షేత్రపాలకులుగా వ్యవహరిస్తుంటారు.  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రంలో శివుడు క్షేత్రపాలకుడిగా వున్నాడు. ఈ స్వామియే తిరుమల క్షేత్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు.  అలాంటి క్షేత్ర పాలకుడైన శివుడు తిరుమల ప్రధాన గర్భాలయం ఎదురుగా గల ధ్వజస్తంభం దగ్గర శిలగా అంశ రూపంలోనూ ... ప్రస్తుతం 'గోగర్భ క్షేత్రం' గా పిలవబడుతోన్న 'పాండవతీర్థం' దగ్గర పూర్ణ స్వరూపంతోను భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే క్షేత్ర పాలకుడైన శివుడు ఇలా శిలా రూపంలో రెండు ప్రదేశాల్లో ఉండటానికి కారణం లేకపోలేదు. క్షేత్ర పాలకుడైన శివుడు పూర్వం 'రాతి గుండు' రూపంలో రాత్రి వేళలో శ్రీవారి ఆలయం చుట్టూ తిరిగేవాడట.  పూజారులు ఉదయం వేళలో ఆలయం తలుపులు తీసేటప్పుడు ... రాత్రి వేళలో తలుపులు వేసేటప్పుడు తప్పనిసరిగా క్షేత్రపాలక శిలకి తాళాలు తాకించి ఆయన అనుమతి లభించినట్టుగా భావించి ఆ పనులు చేసేవారు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వున్నది అంశావతారం మాత్రమే. ఒ...

చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ....!!

చిత్రం
  చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ....!! ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి….దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది .  అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది….. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి . ఉరుములు , పిడుగులు . పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు …! భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?. ఏమి జరగబోతోంది ? లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా? సింహం లేడిని తినేస్తుందా ? వేటగాడు లేడిని చంపెస్తాడా ? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను కాల్చేస్తుందా? ఒక వైపు నిప్పు , రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే ...