ఉద్యోగమా -వ్యాపారమా
చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు. చాలామందికి వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది కానీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతామా లేదా అనే సందేహం వస్తుంది.ఒక జాతకుడికి వ్యాపారము కలిసి వస్తుందా లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అనే విషయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. వ్యాపారం చేయడానికి ధైర్యం ఉండాలి. ఏ లగ్న జాతకులు అయినా సరే మూడవ స్థానం బలంగా ఉంటే వ్యాపారం చేయవచ్చు. మూడవ స్థానం ధైర్య వీర్య స్థానంగా చెప్పబడింది. మూడో స్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ పనివాళ్ళు ఎక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయకూడదు. మూడో స్థానం బలహీనంగా ఉన్నవారు పెట్టుబడి లేకుండా తను ఒక్కరు మాత్రమే కష్టపడి పనిచేసే వ్యాపారం చేయవచ్చు. ఉదాహరణకి టైలరు, వడ్రంగి, మెకానిక్ వీరికి పెట్టుబడి పెద్దగా ఉండదు రిస్కు తక్కువ. మూడో స్థానం బలంగా ఉన్నవారు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ పని వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. మూడవ స్థానంలో శని భగవానుడు కానీ రవి కానీ ఉన్నప్పుడు వీరు కచ్చితంగా వ్యాపారం చేయవచ్చు. మూడవ స్థానంలో ఉండే గ్రహాలు వాటి దశా కాలంలో జాతకుడిని ఉన్నత స్థితికి చేరేలా సహకరిస్తాయి. జాతకుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తారా లేదా విదేశాలలో వ్యాపారం చేస్తారా లేదా భారీ ఎత్తున వ్యాపారాలు చేయగలరా అనేది రెండవ స్థానము 10వ స్థానము 11వ స్థానం పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. లగ్నాత్తు మూడవ స్థానం బలహీనంగా ఉంటే జాతకుడు ఉద్యోగం చేయడం మంచిది. మూడో స్థానం అధిపతి 6 8 12 స్థానాలలో ఉన్నప్పుడు లేదా రాహు కేతువులతో సంబంధం ఏర్పడినప్పుడు ఆ స్థానం బలహీనమైనదిగా నిర్ణయించాలి. వ్యాపారం చేసే సమయంలో దశాబుక్తులు కూడా సహకరించాలి. ముఖ్యంగా తులాలగ్న జాతకులకు వ్యాపారం చేయాలి దానితోపాటు ఉద్యోగం చేయాలి అనే కోరిక ఉంటుంది. ఇటువంటి జాతకులకు రెండు రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. ముఖ్యంగా ధనస్థానము బలంగా ఉండి రాజ్యస్థానం కూడా బాగున్నప్పుడు వ్యాపారం చేయవచ్చు. రాజ్య స్థానం ఆధారంగా ఎటువంటి వ్యాపారం చేస్తే జాతకుడు సక్సెస్ అవుతారు అనేది నిర్ణయించాలి. అదేవిధంగా దశా భుక్తులు సహకరిస్తున్నాయా లేదా అనేది పరిశీలించి జాతకుడు ఎటువంటి వ్యాపారం ఏ సమయంలో చేయాలి అనే విషయం నిర్ధారణ చేయాలి.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutip #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి