నమ్మకద్రోహం-జ్యోతిష విశ్లేషణ
నమ్మకద్రోహం-జ్యోతిష విశ్లేషణ నమ్మకద్రోహం, లేదా నమ్మించి మోసం చేయడం లేదా ఏమార్చడం అనేది సమాజంలో అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రేమికుల విషయంలో, కొందరి భార్యాభర్తల విషయంలో, స్నేహితులు లేదా వ్యాపార భాగస్వామి మధ్య నమ్మకద్రోహం ఏర్పడినప్పుడు నమ్మినవారు నమ్మకాన్ని సంపదను పోగొట్టుకోవడంతోపాటు మానసిక బాధకు గురి అవుతారు. జ్యోతిష్యం ప్రకారం ఒకరి జాతకంలో ఎటువంటి గ్రహ కాంబినేషన్ ఉన్నప్పుడు నమ్మకద్రోహం చేస్తారు అనేది పరిశీలించవచ్చు. రాహువు అత్యాశ, ఈగో ప్రాబ్లంకు కారకుడు. తరువాత కర్మ కారకుడు శని భగవానుడిని కూడా పరిశీలించాలి. మనసులోని తెలివైన ఆలోచనలకు కారకుడైన బుధుడు, కోరికలకు కారణమైన శుక్ర భగవానుడు. నమ్మకద్రోహానికి ప్రధాన కారకుడు అయిన రాహువు శని భగవానుడు నక్షత్రంలో ఉన్నప్పటికీ లేదా శని భగవానుడి నక్షత్రంలో రాహువు ఉన్నప్పుడు లేదా శని భగవానుడికి ముందు కానీ వెనుక గాని రాహువు ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. బుధుడు మరియు శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు గానీ లేదా బుధుడు శుక్రుడు కలిసి శని భగవానుడు స్థానంలో ఉండి లగ్నంతో కానీ లగ్నాధిపతితో కానీ సంబంధం ఏర్పడినప్పుడు జాతకులు నమ్మకద్రోహం చేసేవారిగా గాని లేద...