అహోబిలం నరసింహ స్వామి దేవస్థానం


 

అహోబిలం నరసింహ స్వామి దేవస్థానం – అత్యంత శక్తివంతమైన నరసింహ క్షేత్రం

అహోబల మహత్యం:

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. 

ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది.

ఇది నరసింహ స్వామి అవతారానికి మూల క్షేత్రం గా పరిగణించబడుతుంది.

ఇక్కడ 9 రూపాల్లో నరసింహ స్వామి దర్శనమిస్తారు — వీటిని నవ నరసింహ క్షేత్రాలు అంటారు.

పార్వేట:

అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. 

ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మర్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. 

అహోబిల స్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు. పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. 

స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.

ఎగువ అహోబిలం:

ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది.

దిగువ అహోబిలం:

శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.అక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి

వైవిధ్యమైన నరసింహస్వామి ఆలయాలు

మార్చు

ఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు

ఆలయం ప్రదేశం:

లక్ష్మీనరసింహం- దిగువ అహోబిలం

సత్తిరాంత నరసింహం, 

యోగనరసింహం:- తేరువీధిలో 2 కి.మీ.

కారంగి నరసింహం:- పై అహోబిలం

ఉగ్రనరసింహం:- దిగువ అహోబిలం

భార్గవ నరసింహం:- గరుడాద్రి

పర్ములిధి నరసింహం:- వేదాద్రి

వరాహ నరసింహం:- 

ప్రహ్లాద నరసింహం:- గంధాద్రి

అహోబిల పర్వతం చుట్టును అనేక సన్నిధులు తీర్థాలు ఉన్నాయి.

దర్శనీయ స్థలాలు:

నవ నారసింహ గుళ్ళు:

1 జ్వాలా నరసింహ

2 అహోబిల నరసింహ: 

3 మాలోల నరసింహ:

4 క్రోద నరసింహ (వరాహ నారసింహ):

5 కారంజ నరసింహ: 

6 భార్గవ నరసింహ:

7యోగానంద నరసింహ: 

8 క్షాత్రపత నరసింహ (ఛత్రవట నారసింహ):

9 పావన నరసింహ: 

ప్రహ్లాద బడి:

ఇది చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపైనుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాలాగా సహజసిద్ద కొండ ఉంటుంది, దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు! ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు

మఠం: 

అహోబిలం మఠం చాలా ప్రసిద్ధి పొందినది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది. సంకీర్తనాచార్యుడు, అన్నమయ్య ఇక్కడనే దీక్షపొంది మంత్రోపదేశం పొందినాడు. (లేదా వారి గురుపరపంపర ఈ మఠానికి సంబంధించినది). ఇది దిగువ అహోబిలంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము చాలా అందంగా, శిల్పకళలతో విలసిల్లుతుంది. మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీని పూజాపునస్కారాలు చూడదగ్గవి.

ఉగ్ర స్థంభం:

ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది దీని రెండు చీలికలను రెండు భాగాలుగా విభజించడం చూడవచ్చు. ఇది చిరస్మరణీయ దృక్కోణం . దీనిని చేరుకోవడం కొంచెం కష్ష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది.

దీని పైన ఒక జండా (కాషాయం), నరసింహస్వామి పాదాలు ఉంటాయి.ఎగువ అహోబిలమ్ ఆలయం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, స్తంభం

దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి. జ్వాలానరసింహ, భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి. జ్వాలా, ఉగ్ర స్టాంబామ్ అనే రెండు సన్నివేశాలను మీరు ఒక గైడ్ ను తీసుకోవలసి ఉంది. మిగిలిన అన్ని ఇతర దేవుళ్ళు సాపేక్షంగా సులభంగా చూడవచ్చు. జ్వాలా, ఉగ్ర స్తంభముల మధ్య కూడా జ్వాలా మార్గంలో గుర్తించబడింది.

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గం: 

హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. కడప, తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిష్టాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు.

రైలు మార్గం:

అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల. చెన్నై- బొంబాయి రైల్వేమార్గంలో గల కడప స్టేషన్‌లోదిగితే, ఆళ్లగడ్డ మీదుగా 115 కి.మీ. దూరంలో రహదారిమార్గంలో చేరవచ్చు.

విమాన మార్గం:

అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు.

వసతి సౌకర్యాలు:

తిరుమల తిరుపతి దేవస్థాన అతిధి గృహం

అహోబిలం మఠ అతిథి గృహం: శ్రీ అహోబిల మఠ మలోలా గెస్ట్ హౌస్ గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తుంది. మొత్తం 14 గదులు, 4 సింగిల్ గదులు, 6 డబుల్ గదులు, 4 ట్రిపుల్ గదులు ఉన్నాయి. వీటిలో రెండు డబుల్ గదులు, రెండు ట్రిపుల్ గదులు ఎయిర్ కండిషన్ ఉన్నాయి. అదనంగా, 10 వసతి గృహాల గదులు ఉన్నాయి.

 భక్తులకు నమ్మకం:

ఈ క్షేత్ర దర్శనం చేయగానే, భయాలు తొలగి ధైర్యం, ఆత్మబలాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం.

నరసింహ జయంతి, శ్రావణ మాసంలో, మరియు గురువారాల్లో భక్తులు ఎక్కువగా విచ్చేస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...