కర్కాటక రాశిలో బుధుడి సంచారం వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు పెరగనున్న అదృష్టం

 


కర్కాటక రాశిలో బుధుడి సంచారం వేళ మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు పెరగనున్న అదృష్టం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు కర్కాటకంలోకి సంచారం చేసే సమయంలో మిథునం, కన్య సహా ఈ రాశులకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి

జ్యోతిష్యం ప్రకారం, నవ గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుండి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. కొన్నిసార్లు తిరోగమనం కూడా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో 22 జూన్ 2025న ఆదివారం రాత్రి 9:17 గంటలకు బుధుడు మిథునం నుంచి కర్కాటకంలోకి సంచారం చేయనున్నాడు. జూలై 28వ తేదీ వరకు ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు. అనంతరం సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. నవ గ్రహాలలో బుధుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బుధుడిని యువరాజుగా భావిస్తారు. మన జాతకం ప్రకారం బుధుడి అనుగ్రహం ఉంటే తెలివితేటలు, వ్యాపారం, మేధస్సు, ఆర్థిక పరమైన విషయాల్లో శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే కొన్ని రాశుల వారికి బుధుడి రవాణా వల్ల అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా బుధుడి సంచారంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బుధుడి స్థాన ప్రభావం

తొలిస్థానంలో : వ్యాపారులకు లాభం, గౌరవం పెరుగుతాయి.
రెండో స్థానంలో : విలాసవంతమైన జీవితం గడుపుతారు. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.
మూడో స్థానంలో : మీలో నైపుణ్యాలు ఎక్కువగా పెరుగుతాయి.
నాలుగో స్థానంలో : వివాహ జీవితంతో పాటు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొంటారు. విదేశాల్లోనూ విహరిస్తారు.
ఐదో స్థానంలో : నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ఆరో స్థానంలో : కెరీర్లో సక్సెస్ అవుతారు.
ఏడో స్థానంలో : వివాహం విజయవంతంగా పూర్తవుతుంది.
ఎనిమిదో స్థానంలో : మీరు కోరుకున్న ఆదాయాన్ని పొందుతారు.
తొమ్మిదో స్థానంలో : మీ జీవితంలో ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారు.
పదో స్థానంలో : మీ వ్యాపారం మరియు వృత్తిలో విజయం సాధిస్తారు.
పదకొండో స్థానంలో : ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది.
పన్నెండో స్థానంలో : వివాహ జీవితంలో ఆనందం మరియు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది.

మిథున రాశి

మిథున రాశి నుంచి బుధుడి సంచారం రెండో స్థానం నుంచి జరగనుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు సైతం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఈ సమయంలో వ్యాపారులకు సైతం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలమైనది.

కన్య రాశి

కన్య రాశి నుంచి బుధుడి రవాణా లాభ స్థానంలో జరగనుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలను పొందొచ్చు. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు.

తులా రాశి

తులా రాశి నుంచి బుధుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ అదృష్టం పెరగనుంది. మీకు అన్ని వర్గాల నుండి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అయితే ఎక్కువగా రిస్క్ తీసుకోకూడదు. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి నుంచి బుధుడు అష్టమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. దీంతో మీకు అద్భుతమైన విజయాలు దక్కే అవకాశం ఉంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దీంతో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

కుంభ రాశి

కుంభ రాశి నుంచి బుధుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు కళాత్మక పనిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇది మీ గౌరవాన్ని మరింత పెంచుతుందది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.మీరు రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్థిపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కాలంలో కొత్త వాహనం లేదా ఏదైనా కొత్త ఎలక్ట్రికల్ వస్తువులను కొనొచ్చు. మీ వ్యక్తిగత జీవితం బాగానే ఉంటుంది.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #karkatakarasi #cancer #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...