పుణ్యచరితులు.
పుణ్యచరితులు.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాల సాధనే పుణ్యచరితుల లక్ష్యం. దీన్ని సాధించే ప్రయత్నం నిరంతరమూ సాగాలి. ఇలా సాగించేవారు రెండు ´ విధాలుగా ఉంటారు. అనుకున్నది సాధించేందుకు చెమటోడ్చేవారు కొందరు. తినేందుకు బతకాలి “ అనుకునేవారు మరికొంతమంది. ఈ రెండో తరహా వ్యక్తులు సమాజానికి ఉపకరించరు. పరులసొమ్మును ఆశించే వీరు పరాన్న భుక్కులు, వీరినే 'కాపురుషులు' అంటారు.
పుణ్యచరితుల్ని లోకులు 'గురువులు'గా భావి - స్తారు. అందరూ జీవిత పరమార్థం తెలుసుకుని, పురుషార్థాల్ని సాధించి, ధన్యజీవులు కావాలన్నదే ఆ గురువుల ధ్యేయం. జనశ్రేయస్సుకు కావాల్సినవనరులను సమకూర్చడమే వారి ఆశయం. మాటలతో కాదు, చేతల ద్వారా మార్గదర్శనం చేయించగల స్ఫూర్తి వారి సొంతం. పురుషార్థ సాధకులకు రహదారి చూపించే దీపాల వంటివారు గురువులే!
ధర్మ, కర్మవీరులు సింహాల వంటివారు. వారు ఎంతో ఓర్పు, కూర్పు, నేర్పుతో పనులు చేపడతారు. బండికి ఒంటిచక్రం తగిలిస్తే అది ముందుకు పోలేదు. రెండో వైపు చక్రమూ బిగించాలి. అప్పుడు వాహనం సాఫీగా ఎక్కడా కుంటువడకుండా సాగుతుంది. ఆ రెండో చక్రమే దైవాను గ్రహం! దైవం దయ కొరవడిందంటాడు కాపురుషుడు. మరో పని గురించి ఆలోచించడు. పురుష సింహుడు ఆ ఓటమిని విశ్లేషించి, విజయ సోపానంగా మార్చుకుం టాడు. కాపురుషుడిలా కుంగిపోడు. అంతా సింహావలో కనం చేసుకొని, తరవాతి పనికి శ్రీకారం చుడతాడు.
పురుషార్థాల్లో మొదటి మూడూ అయ్యాక, ఇంకా సాధించాల్సింది ఉందని అనిపిస్తుంది. అది తీరని దాహం వంటిది. సాధకుణ్ని సదా వెంటాడుతూనే ఉంటుంది. అదేపనిగా డబ్బు సంపాదించినవాడు దాన్ని ఎలా దాచాలో తోచక, ఆలోచిస్తూ నిద్రాహారాలకు దూరమై, ఆఖ రికి కృశించి నశిస్తాడు. అన్ని ధర్మాలు, శాస్త్రాలు చదివిన పండితుడైనా- ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటప డుతూ శాంతికి, సుఖానికి నోచుకోలేడు. కామాగ్నికి దాసుడైనవాణ్ని, అది కార్చిచ్చుగా మారి దహించివేస్తుంది.
కంటికి కనిపించకుండానే ఆరాటం పెంచేది- మోక్షం. అంటే, ముక్తి. అప్పుడు మనిషి మనసు అన్ని బంధాల నుంచీ స్వేచ్ఛను కోరుతుంది. ఆకాశంలో హాయిగా విహరించే విహంగాన్ని చూసినప్పుడు, అతడిలో ఈర్ష్య కలుగుతుంది. పంజరంలో చిక్కి గిలగిలలాడుతున్న రామచిలుకను చూసి జాలి పెరుగుతుంది.
స్వేచ్ఛ మూడు రకాలు. ఉత్తముడు కోరుకునే స్వేచ్ఛ-బ్రహ్మజ్ఞానం. మధ్యముడు కోరే స్వేచ్చ కర్మబంధ మోక్షం. అధముడు- ప్రస్తుత అనుభవాల్ని మించిందే స్వేచ్ఛ అని భావిస్తాడు. లాలసలో పడి, ఇనుప పంజరం నుంచి బంగారు పంజరంలోకి దూకుతాడు.
ముక్తుడు, బద్దుడు, తమోజీవి- వీరే ఉత్తమ, మధ్యమ, అధములు. అందరికీ పంచాలన్న ఆకాంక్ష గల వ్యక్తి నిజ మైన స్వేచ్ఛావాది. జీవన్ముక్తుడై పరుల కోసం పాటుపడే పుణ్యజీవి. అతడికి తోడుగా దైవశక్తి ఉంటుంది. జీవన్ము క్తుడు తన స్వేచ్ఛను తిరిగి ఆ భగవంతుడికి సమర్పించి, పరుల శ్రేయస్సుకు అంకితం చేస్తాడు. 'పురుషు లందు పుణ్యపురుషులు వేరయా' అనే వేమన వేదానికి అర్థం ఇదే!
పుణ్యపురుషుడు నిరంతర స్వేచ్ఛా విహారి. అతడు భూమిని, ఆకాశాన్ని కలిపే అందమైన ఇంద్రధనుస్సులా ప్రకాశిస్తాడు. నింగిలోని పాలపుం తల్ని తాకుతూ, నక్షత్రాలే కళ్లుగా విహంగ వీక్షణం సాగిస్తాడు. అనంతరం, నేలకు దిగివచ్చి మెత్తని పూలగుండెల్లో తన అస్తిత్వాన్ని నింపుతాడు. ఎల్లలు లేని ఈ విశాల విశ్వం అంతటా నిండి ఉన్న తాను ఒక శరీరం కాదని, ఆత్మ అని తెలిసి వ్యవహ రిస్తాడు. అప్పుడే అతడికి స్వేచ్ఛలోని మాధుర్యం అనుభవమవుతుంది. అలాంటి పుణ్యచరితుడి ప్రతి ప్రయత్నమూ స్వేచ్ఛాయుతమై, దైవేచ్చగా పరిణతి చెంది, చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది!
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి