రాశిఫలాలు - జులై 02, 2025

 

మేషం

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం

ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి.

మిధునం

నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చాలా కాలంగా  పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.

సింహం

ఆకస్మిక ధనలాభ  సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.  సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.  వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య

వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయట పడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం

సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

ధనస్సు

కుటుంబ సభ్యుల నుండి  శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

మకరం

భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ ఉన్నవి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.

కుంభం

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం

వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 
9542665536

#rasiphalalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దేవాలయం లో ఏమి దానం ఇస్తే ఏ గ్రహం అనుకూల కలుగుతుంది...

ఆయుష్షు స్థానం-రాహుకేతువులు

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం...