దృష్టి /దిష్టి దోష నివారణ


 

దృష్టి /దిష్టి దోష నివారణ

1.పిల్లలు సరిగా నిద్ర లేక ఏడుస్తూ చికాకుగా ఉన్నచో ఒక ఎర్రని మట్టి పాత్ర తీసుకొని.. అందులో కొన్ని పాలు పోసి సవ్యం గా 7 సార్లు దిష్టి తీసి ఆ పాత్రను జన సంచారం లేని ప్రదేశం  వద్ద  వదిలి వచ్చి నచో. పిల్లలు హాయిగా నిద్రపోతారు

2..ఆహారం తీసుకోకుండా ..ఎండిపోతున్న, లేక కారణం లేకుండా సన్నపడుతున్న పిల్లలకు అమావాస్య రోజున సేకరించిన మంజిష్ట చెట్టు కర్రకు రంద్రం చేసి తెలుపు లేదా ఎరుపు దారం తో గుచ్చి... మాలగా చేసి పిల్లల మెడలో వేసిన పిల్లలు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు.. 1 నెల రోజులు పిల్లలకు మాంసాహారం తినిపించకూడదు..

3.. అది, లేదా అమావాస్య రోజున .ఆంబోతు కొమ్ముకు అంటిన ఎర్ర మట్టిని తీసుకొని వచ్చి అందులో గోరోజనం కలిపి ప్రతి రోజు...పిల్లలకు తిలకముగా పెట్టినచో వారికి, గ్రహ, భూత, ప్రేత, పిచాచ, బాధలు లేకుండా సుఖంగా ఆరోగ్యం గా ఉంటారు...

4, ఆంజనేయ స్వామి వారి దేవాలయం లో  స్వామి భుజాల నుండి సిందూరం ను శనివారం నాడు తీసుకు వచ్చి దిష్టి తగిలిన వ్యక్తి నుదుటన పెట్టినచో.. దిష్టి దూరం గా పోవును

5..పిల్లలకు వారి కాళ్ళు, చేతులకు, ఆదివారం..లేదా సోమ. గురువారాలలో.. మంచి సమయం లో రాగి కంకణం లు వేసినచో... పిల్లలకు పళ్ళు త్వరగా వచ్చును.. దిష్టి ఉండదు..

6.. ఆదివారం నాడు పిల్లల తల చుట్టూ పాలు 3 సార్లు దిష్టి తీసి మట్టి పాత్ర లో పోసి ఎవరు  త్రొక్కని ప్రాంతంలో వేయండి. పిల్లలకు అనారోగ్య బాధలు ఉండవు...

7 గ్రహణ సమయం లో సేకరించిన తెల్లజిల్లేడు వేరును తావిజులో ఉంచి.. భైరవ మంత్రం తో అభిమంత్రించి పిల్లల మెడలో వేసిన... అనారోగ్యాలు త్వరగా తగ్గుతాయి.. పర ప్రయోగ బాధలు ఉండవు...

8... మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే. దక్షిణం వైపున చిన్న కుండిలో వేప చెట్టును పెంచండి.. ప్రతి రోజు మీ పిల్లల పేర్లు చెప్పి ఆ చెట్టుకు నీరు పోయండి... పిల్లలకు మంచి జరుగుతుంది..

9...శుభకార్యాలకు లేదా.మంచి డ్రెస్ లు వేసుకున్నప్పుడు  పిల్లలకు సాధారణం గా దిష్టి తగులుతుంది.. దిష్టి నివారణకు..ఉప్పు, మిరపకాయలు, బెల్లం, తీసుకొని పిల్లల తల నుండి, కాళ్ళ వైపుకు 7 సార్లు క్రిందకు పైకి తిప్పి ఇంటికి దూరం గా పడవేయండి....కొద్దీ నిమిషాలలోనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు...

గమనిక...దిష్టి అనేది.. సాయంత్రం వేళల్లో తీస్తే మంచి ఫలితాలు ఉంటాయి... ఇంటి సింహ ద్వారం బయట మాత్రమే  దిష్టి తీయాలి... తీసిన తరువాత కాళ్ళు చేతులు నీళ్లతో శుభ్రం చేసుకుని  ఇంట్లోకి వెళ్ళాలి.. తల వెంట్రుకలతో దిష్టి పోదు కదా. ఇంకా దరిద్రం పట్టుకుంటుంది.. దిష్టి తీసిన రోజు పిల్లలకు...మాంసాహారం పెట్టవద్దు... మాంసం తిని దిష్టి తీసిన ఫలితం ఉండదు.

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025